2026లో ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న మూవీ నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్. అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డిలు నాగబంధం మూవీని నిర్మించగా.. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్, మహేశ్ మంజ్రేకర్, జగపతి బాబు, అనసూయ, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఎస్ సౌందర్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జునైద్ కుమార్, అభిలు సంగీతం అందించారు. ఆర్‌సీ ప్రణవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో నాగబంధం పై అంచనాలు పెరిగిపోయాయి. వరల్డ్ వైడ్‌గా జూలై 3న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జూలై 2వ తేదీన నాగబంధం మూవీ ప్రీమియర్స్ షో ప్రదర్శిస్తున్నారు. నాగబంధం చిత్రంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయాలను పరిశీలిస్తే..
విజువల్‌గా స్టన్నింగ్ ఎక్స్‌పీరియన్స్, కీలక ఘట్టాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. విరాట్ కర్ణ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో ఆయన తెరపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. దర్శకుడు అభిషేక్ నామా తన విజువల్స్, భారీ కథనంతో ఆకట్టుకున్నారు. నమో రే సాంగ్ ఒక దృశ్య కావ్యంలా ఉండి.. ఈ సినిమాలోనే అత్యంత ఆకర్షణీయమైన ఎలిమెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. నిక్ స్టూడియోస్ ప్రొక్షన్ డిజైన్ భారీగా, ప్రతి ఫ్రేమ్ సినిమా స్థాయిని ప్రతిబింబిస్తుంది. నభా నటేష్ తన పాత్ర ద్వారా బలమైన ముద్ర వేసింది. అద్భుతమైన దృశ్యాలతో కూడిన పౌరాణిక ఫాంటసీ చిత్రాలను ఇష్టపడే వారైతే, నాగబంధం మూవీని బిగ్‌స్క్రీన్‌పై ఖచ్చితంగా చూడాల్సిందేనని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. విజువల్స్ పరంగా అద్భుతమైన, గ్రాండ్ స్కేల్ మైథాలజీ మూవీ నాగబంధం ఇప్పుడే చూశాను. ఇంతటి ప్రతిష్టాత్మకమైన వీఎఫ్ఎక్స్ విన్యాసాలను విజయవంతంగా రూపొందించిన అభిషేక్ నామా, చిత్ర బృందానికి అభినందనలు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, స్టార్ రేంజ్ పర్ఫార్మెన్స్‌తో విరాట్ కర్ణ సినిమాలో సర్‌ప్రైజ్ ఇచ్చారు అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ .. ఆర్ట్ వర్క్ .. మ్యూజిక్ .. ఒకరిని మించి ఒకరు బెస్డ్ వర్క్ ఇచ్చారు.. నిర్మాతల సపోర్ట్ లేకుంటే ఇది సాద్యమయ్యే పని కాదు.. దర్శకుడు అభిషేక్ నామా క్వాలిటీ సినిమా పల్స్ పట్టేశారు.. కాన్ఫిడెంట్ గా సినిమా ను తీయగలిగారు అని ఒకరు కామెంట్ పెట్టాడు. హీరో విరాట్ కర్ణ.. ఆద్యంతం అద్భుతమైన నటనను ప్రదర్శించారు. మరీ ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో ఆయన నటన అద్భుతం. దర్శకుడు అభిషేక్ నామా అందించిన దృశ్యాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా నమో రే సాంగ్ సూపర్. నిక్ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ తెరని విజువల్ వండర్‌గా మార్చేశాయి. నభా నటేష్ తన పాత్రలో అద్భుతంగా నటించారు అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. నాగబంధం ఒక భారీ మైథలాజికల్ అడ్వెంచర్. ఈ మూవీ అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది. ఆకట్టుకునే ప్రపంచం, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, టెక్నికల్‌గా పటిష్టమైన ఎగ్జిక్యూషన్‌తో నాగబంధం ఒక బలమైన కమర్షియల్ మూవీగా నిలుస్తుంది. విరాట్ కర్ణ అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్‌లో బాగున్నాడు. భయంకరమైన ప్రతినాయకుడిగా రిషబ్ సాహ్నీ అద్భుతంగా నటించగా.. నభా నటేష్ చక్కటి నటనను కనబరిచింది అని ఓ ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చాడు. వయలెన్స్‌కి అమ్మ మొగుడు అసలు. బోయపాటి మాస్ నీ మించిపోయేలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. బిగ్‌స్క్రీన్ రక్తంతో తడిసిపోయింది. మాస్ ఆడియన్స్‌కి పూనకాలే, మామూలు ఆడియన్స్‌కి చుక్కలే అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. నాగబంధం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎపిక్ అండ్ డివోషనల్. ఇది గ్రాండ్ స్కేల్ మైథలాజికల్ అడ్వెంచర్. ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అద్భుతమైన దృశ్యాలు, అత్యున్నత నిర్మాణ విలువలు, ఆకట్టుకునే ప్రపంచంలోకి ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మిమ్మల్ని తీసుకెళ్తుంది. దర్శకత్వం అనేది ప్రశంసలకు అర్హమైనది. ఎందుకంటే ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించడం అంత సులభం కాదు. అయినప్పటికీ పౌరాణిక అంశాలు, యాక్షన్, భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలను దర్శకుడు చక్కగా సమతుల్యం చేస్తూ కథనాన్ని ఆసక్తికరంగా నడిపించారు. ఆయన విజన్ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. హీరో -విలన్ మధ్య జరిగే పోరాటం ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇది సినిమా ఆసాంతం ఉత్కంఠను సజీవంగా ఉంచుతుంది. అద్భుతమైన, భారీ స్థాయి అనుభూతిని అందించిన సాంకేతిక బృందం ప్రశంసలకు అర్హమైనది. నాగబంధం.. ఖచ్చితంగా బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా. విరాట్ కర్ణ అద్భుతంగా నటించారు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలలో ఆయన తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అదరగొట్టారు. ఇది ఒక స్టార్‌ను పరిచయం చేసే రేంజ్ పర్ఫార్మెన్స్. ప్రతినాయకుడిగా రిషబ్ సాహ్నీ అద్భుతంగా నటించారు. భయపెట్టేలా, పవర్‌ఫుల్‌గా ఉంటూ విరాట్‌కు సరైన ప్రత్యర్ధిగా నిలిచారు. వీరిద్దరి మధ్య జరిగే ప్రతి ముఖాముఖి సన్నివేశం అద్భుతంగా పండింది. నభా నటేష్ కూడా అద్భుతమైన నటనతో కథనానికి మంచి బలాన్ని చేకూర్చారు. ఓవరాల్‌గా నాగబంధం అనేది అద్భుతమైన దృశ్యాలతో, బలమైన పాన్ ఇండియా ఆకర్షణతో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. పురాణగాథలకు యాక్షన్, సాహసం, భారీ స్టాయి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఇష్టమైతే.. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు. నమోరే సాంగ్ స్క్రీన్ మీద కంప్లీట్ విజువల్ ఫీస్ట్‌లా అనిపించింది. దేవాలయం సెట్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. నభా నటేష్ గ్రేస్ అదిరిపోయిందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. More Articles