Rating:
2.5/5

నటీనటులు: సత్యదేవ్, వికాస్ ముప్పాల, మలయాళ నటి దీపా థామస్, బాలా పరసార్, ఆనంద్ భారతీ, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు
రచయిత, ఎడిటర్‌, దర్శకత్వం: వెంకటేష్ మహా
నిర్మాతలు: చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
సమర్పణ: ఘట్టమనేని మహేష్ బాబు (GMB) ఎంటర్‌టైన్‌మెంట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బొల్లెబోయిన
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ పర్మార్
మ్యూజిక్: స్మరణ్ సాయి,
ప్రొడక్షన్ డిజైనర్: రోషన్ సింగ్,
క్యాస్టూమ్ డిజైనర్: శిల్పా జీఎన్ఎస్,
సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్
బ్యానర్: శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2026-07-03

Advertisement

రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) దీర్ఘకాలంగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఒంటరి జీవితాన్ని గడుతుంటాడు. కొన్ని నెలలకు మించి బతకడని డాక్టర్లు తేల్చినా.. వైద్యులను ఆశ్చర్య పరుస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అయితే అయితే రామప్పను తన జీవితంలో చోటు చేసుకొన్న ఓ విషాద సంఘటన మానసికంగా కుంగదీస్తుంది. ఆ విషాద సంఘటనకు తానే కారణం కుమిలిపోతుంటాడు. ఓ అనుమానం పెనుభూతంలా అతడిని పట్టి పీడిస్తుంది.

Advertisement

రామప్ప చివరి రోజులు ఎలా గడిచాయి? ప్రాణ స్నేహితుడు, వ్యక్తిగత డాక్టర్ ఆచారి (వికాస్ ముప్పల)తో ఎలాంటి అనుబంధం ఉంది? రామప్ప మానసికంగా కుంగిపోకుండా ఆచారి చేసిన ప్రయత్నాలు ఏమిటి? అయిష్టంగా రామప్పను రేణుక (దీపా థామస్) ఎందుకు పెళ్లి చేసుకొన్నది. రామప్ప ఎందుకు ఓ కుమారుడిని దత్తత తీసుకొన్నాడు? రామప్ప పెంపుడు కొడుకుకు ఎదురైన అవమానాలు ఏంటి? తనను పెనుభూతంలా పట్టి పీడిస్తున్న అనుమానం వెనుక రామప్పకు నిజం తెలిసిందా? చివరకు రామప్ప జీవితానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం రావు బహదూర్ సినిమా కథ.

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలవడంతో ఉన్నట్టుండి క్రేజ్ పెరిగింది. మూవీ రిలీజ్‌కు ముందు ఆయన వేసిన ట్వీట్‌తో అంచనాలు పెరిగాయి. అయితే తెలుగు సినిమా చూడని కథ అంటూ చెప్పడంతో రావు బహదూర్ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. తీరా చూస్తే చివరి 10 నిమిషాల క్లైమాక్స్ కోసం రెండున్నర గంటలపాటు సినిమాను సాగదీయడం అత్యంత నిరాశను, అసంతృప్తిని కలిగించే అంశంగా కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. సత్యదేవ్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమా కంటెంట్‌ను కొంత మెరుగుపరిచాడు. కథ లేకుండా సరైన స్క్రీన్ ప్లే లేకుండా చివరి ఎపిసోడ్ వరకు లాగి ఓ రకంగా సహనానికి పరీక్ష పెట్టారనే చెప్పాలి.

Advertisement

ఈ సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే నీరసంగా, నిస్తేజంగా సాగుతుంది. మొదటి 30 నిమిషాలకుపైగా సినిమా అంతా గందరగోళంగ అనిపిస్తుంది. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడనే ప్రశ్న సినిమా చూస్తున్నంత సేపు వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి నిరాశ మధ్య సెకండాఫ్‌లో కొంత బెటర్‌మెంట్ ఇవ్వడం, ట్రీట్‌మెంట్ గాడిన పడటంతో అప్పటి వరకు ఉన్న అసంతృప్తి తగ్గేలా చేస్తుంది. ఓవరాల్‌గా ఒకే అని సంతృప్తితో వచ్చేలా సినిమాగా మహా చిత్రం ఉందని చెప్పాలి.

నటీనటుల విషయానికి వస్తే.. సత్యదేవ్ ఆల్ రౌండ్ పెర్పార్మెన్స్‌తో మరోసారి మెప్పిస్తాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసి నటనతో ఆకట్టుకొన్నాడు. రేణుకగా దీపా థామస్‌కు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండటంతో తాను కూడా ఏమీ చేయలేకపోయింది. సత్యదేవ్‌కు ఫ్రెండ్‌గా నటించిన వికాస్ సినిమాకు సపోర్టింగ్‌గా నిలిచాడు. మిగితా క్యారెక్టర్లు ఉన్నా గానీ.. కథను నడిపించడానికి ఉపయోగపడ్డాయే గానీ.. సినిమాను ఎలివేట్ చేయడానికి ఏ మాత్రం ఉపయోగం లేవనే చెప్పాలి.

Advertisement

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కారణంగా కొన్ని సన్నివేశాలు నేచురల్‌గా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫి డిపార్ట్‌మెంట్ పెద్దగా కష్టపడాల్సిన సన్నివేశాలు ఏమీ కనిపించవు. స్టేజ్ డ్రామాగా కొనసాగడం వల్ల కార్తీక్ ప్రతిభ పెద్దగా ఎలివేట్ కాలేదనే చెప్పాలి. సినిమాకు వాడిన కలర్ ప్యాటర్న్ స్టోరీ మూడ్‌ను క్రియేట్ చేసేందుకు ఉపయోగపడింది. దర్శకుడే ఎడిటర్ కావడం వల్ల తాను తీసిన సన్నివేశాలపై ఎక్కువ మమకారం ఉండటం వల్ల సినిమా నిడివి పెరిగి సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా ఇంకా బెటర్‌మెంట్‌కు స్కోప్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Advertisement

రావు బహదూర్ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. డైరెక్టర్ ఆలోచించిన పాయింట్ బాగుంది. సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉంది. కానీ ఆ పాయింట్‌ను పూర్తిస్థాయి కథగా మార్చడంలో తడబాటు కనిపిస్తుంది. సినిమా కథ చెప్పడంలో తెలివి ఉండాలి. కానీ ఎక్కువ మేధావితనం ప్రదర్శించకూడదనే విషయం ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమా ఫిలాసఫికల్‌గా ఎమోషనల్ డ్రామా, ఈ డాక్టర్, పేషెంట్ డ్రామాను చూడాలంటే ఎక్కువ పెషన్స్ తప్పనిసరి. కేవలం సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.