ఘట్టమనేని వారసుడిగా జయకృష్ణ ఘట్టమనేని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ సినిమా ద్వారా ప్రముఖ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో డాక్టర్ మోహన్ బాబు, వీకే నరేష్, బ్రహ్మాజీ, షామ్, అజయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాను జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. సీ అశ్వినీదత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
చందమామ కథలు పిక్చర్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: జీవీ ప్రకాశ్, సినిమాటోగ్రఫి: జయకృష్ణ గుమ్మడి, ఎడిటర్: మాధవ్ కుమారు గుల్లపల్లి, ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. జూలై 30వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాలను వెల్లడించారు. జయకృష్ణ, రషా, అజయ్ భూపతికి ముందస్తుగా కంగ్రాట్స్ తెలిపారు. తాజాగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేసి చిత్ర యూనిట్ గురించి, సినిమా గురించి ఏం చెప్పారంటే?
వీడియోలో మహేష్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా రమేష్ అన్నయ్య అబ్బాయి జయకృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. దాంతో మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంది. వాస్తవానికి అందరం చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాం. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. జయకృష్ణ, రషా తడానీ జంట బాగుంది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అందుకు పూర్తిగా అజయ్ భూపతికి క్రెడిట్ ఇవ్వాల్సిందే అని మహేష్ బాబు అన్నారు. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. టెక్నిషియన్స్ అంతా చాలా హర్డ్ వర్క్ చేశారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ వెన్నముకగా నిలిచారు. పాటలు బాగున్నాయి. మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో పాటలు నాకు బాగా నచ్చాయి. ఈ సినిమా జూలై 30వ తేదీన రిలీజ్ అవుతున్నది అని మహేష్ బాబు తెలిపారు. నా జీవితంలో జూలై 30వ తేదీకి ప్రాముఖ్యత ఉంది. ఆ రోజునే నేను హీరోగా నటించిన రాజకుమారుడు చిత్రం రిలీజైంది. ఈ రిలీజ్ డేట్‌ను నిర్మాత అశ్వినీదత్తుగారే ప్లాన్ చేసి ఉంటారు. ఇలాంటి విషయంలో దత్తుగారు పర్టిక్యులర్‌గా ఉంటారు. నేను, రాంచరణ్, అల్లు అర్జున్ ఆయన బ్యానర్ ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యాం. మాకు మేముగా మా టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొన్నాం. ఇలాంటి బ్యానర్ నుంచి పరిచయం కావడం జయకృష్ణ, రషా తడానీ నిజంగా అదృష్టవంతులు. మా బాబాయి ఆదిశేషగిరిరావు, జెమినీ కిరణ్, అశ్వినీదత్ అందరూ కలిసి కొత్త వాళ్లతో ఈ సినిమాను నిర్మించి ముందుకు వస్తున్నారు. కాబట్టి మా నాన్న సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, నా అభిమానులు జయకృష్ణ, రషాను ఆదరించాలని కోరుకొంటున్నాను. చిత్ర యూనిట్ మంచి సక్సెస్ లభించాలని విషెస్ తెలియజేస్తున్నాను అని అన్నారు. More Articles