ఘట్టమనేని వారసుడిగా జయకృష్ణ ఘట్టమనేని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ సినిమా ద్వారా ప్రముఖ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో డాక్టర్ మోహన్ బాబు, వీకే నరేష్, బ్రహ్మాజీ, షామ్, అజయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాను జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. సీ అశ్వినీదత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
చందమామ కథలు పిక్చర్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: జీవీ ప్రకాశ్, సినిమాటోగ్రఫి: జయకృష్ణ గుమ్మడి, ఎడిటర్: మాధవ్ కుమారు గుల్లపల్లి, ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. లవ్, రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసింది. జూలై 30వ తేదీన రీలీజ్ అవుతున్న ఈ సినిమాకు సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ మూవీ రన్ టైమ్ ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
శ్రీనివాస మంగాపురం సినిమా కథ విషయానికి వస్తే.. తిరుపతికి చెందిన శ్రీనివాస బాబు అలియాస్ వాసు బాబు (జయకృష్ణ), మంగ తాయారు అలియాస్ మంగ (రషా తడానీ) ఇద్దరు ప్రేమించుకొంటారు. వారి ప్రేమకు బళ్లారిలో మైనింగ్ డాన్ వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) అడ్డు పడుతాడు. వాసు బాబును మంగ నుంచి వేరు చేయడానికి తన అనుచరులను ఉసిగొల్పుతాడు. వాసు, మంగ ప్రేమాయణం, రొమాంటిక్ లైఫ్ ఎలా సాగింది? వెంకటప్పయ్య నాయుడు ఎందుకు వారి ప్రేమకు అడ్డు తగిలాడు? తిరుపతిలో శక్తిమంతుడైన వెంకటప్పయ్యను వాసుబాబు ఎలా ఎదురించాడు? మంగతో ప్రేమను ఎలా సఫలం చేసుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. పక్కాగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాను సెన్సార్ బోర్డు ప్రతినిధులు, అధికారులు వీక్షించారు. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్, సన్నివేశాల్లో స్వల్ప మార్పులు మినహా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు, చేర్పులకు చిత్ర యూనిట్ సానుకూలంగా స్పందించడంతో ఈ సినిమా విడుదలకు క్లియరెన్స్ లభించింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా, అజయ్ భూపతి తన మార్కు ట్రీట్‌మెంట్‌తో రూపొందించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సర్టిఫికెట్ ప్రకారం ఈ సినిమాను 16 ఏళ్లకుపైబడిన ప్రతీ ఒక్కరు ఈ సినిమాను చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు మాత్రం తమ తల్లిదండ్రుల అనుమతి, మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ సుమారుగా 2 గంటల 30 నిమిషాలు. అంటే.. 150 నిమిషాల నిడివితో సినిమాను కట్ చేశారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. అజయ్ భూపతి మార్క్ రొమాన్స్, లవ్ సీన్లు ఆకట్టుకొంటాయి. కొత్తవారైనా జయకృష్ణ, రషా తడానీ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ దర్శకుడు తీసుకొచ్చారు. ఈ మూవీకి మోహన్ బాబు విలనిజం హైలెట్ ఉంటుంది. యాక్షన్ సీన్లు, డైలాగ్స్ మంచి కమర్షియల్, మాస్ యాంగిల్‌లో సాగుతాయనే టాక్ సెన్సార్ తర్వాత గట్టిగా వినిపిస్తున్నది. ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిలింబీట్‌ను ఫాలో అవ్వండి.More Articles