స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బీ షిండే నిర్మిస్తున్నారు. శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా, అతుల్ తివారి, కమలేష్ సావంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిషాంత్ భగవత్ సినిమాటోగ్రాఫర్‌గా, మంగేష్ ధాక్డే సంగీత దర్శకుడిగా, అనీశ్ మాత్రే ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రతి నిత్యం మనం తినే ఆహారం ఎలా పాయిజన్‌గా మారుతుంది? పంటలు పండించేందుకు వాడుతున్న రసాయనాలు ఆరోగ్యంపై చూపుతున్న దుష్ప్రభావాల ఆధారంగా ది ఇండియా స్టోరీ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఆసక్తిని పెంచుతున్నాయి. జూలై 24న తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ది ఇండియా స్టోరీపై సోషల్ మీడియాలో క్రిటిక్స్, నెటిజన్ల అభిప్రాయాలు పరిశీలిస్తే..
More Articles