నటీనటులు: మాట్ డామన్, అన్నె హత్‌వే, టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ తదితరులు
దర్శకత్వం: క్రిస్టోఫర్ నోలన్
నిర్మాతలు: ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్
సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయ్‌తేమ,
ఎడిటర్: జెన్నిఫర్ లామే,
మ్యూజిక్: లడ్‌విగ్ గోరాన్సన్
బ్యానర్: యూనివర్సల్ పిక్చర్స్ , సింకోపి
రిలీజ్ డేట్: 2026-07-17
ట్రోజాన్ వార్ తర్వాత ఒడిస్సీయస్ ( మాట్ డామన్) తన గ్రీక్ సామ్రాజ్యానికి తిరిగి రాకుండా అజ్ఞాత జీవితాన్ని గడుపుతుంటాడు. యుద్దానికి బయలుదేరే ముందు భార్య పెనెలోపే (అన్నా హాత్‌వే)తో తాను ఒకవేళ తిరిగి రాకుంటే.. మరో పెళ్లి చేసుకోమని ఒడిస్సీయస్ చెబుతాడు. కానీ తన జీవితంలో మీకు తప్ప మరొకరికి చోటు ఉండదు అని భర్తతో పెనెలెపీ చెబుతుంది. అయితే గ్రీక్ రాజు ఒడిస్సీయస్ బతికి లేడనే పుకార్లను కొట్టిపడేసి.. తాను బతికే ఉన్నాడు.. తన కోసమే జీవితమని పెనెలెపీ ఎదురు చూస్తుంటుంది. తండ్రి బతికే ఉన్నాడనే నమ్మకంతో ఒడిస్సీయస్ కుమారుడు టెలిమాకస్ (టామ్ హాలెండ్) అతడిని వెతికేందుకు వెళ్తాడు. గ్రీక్ రాజ్యంలో సైనికాధికారి ఆంటీనస్ (రాబర్ట్ పాటిన్సన్) రాణి పెనెలోపేను బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఉంటాడు.
గ్రీక్ రాజ్యం నుంచి ఒడిస్సీయెస్ అదృశ్యమైన తర్వాత ఎలాంటి కుట్రలు జరిగాయి? అజ్ఞాతవాసంలో ఉన్న ఒడిస్సీయస్‌కు ఎదురైన అనుభవాలు ఏమిటి? ఎందుకు ఒడిస్సీయస్ తన రాజ్యానికి, భార్యకు, కుమారుడికి దూరంగా బతకాలని అనుకొన్నాడు? ఆంటినస్ వేధింపులకు రాణి పెనెలోపే తలవొగ్గిందా? తన తండ్రి కోసం టెలిమాకస్ వెతకడం వెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఇంతకు ఒడిస్సీయస్ తిరిగి తన రాజ్యానికి వచ్చాడా? చివరకు గ్రీక్ రాజ్యంలో పీఠం కోసం కుమ్ములాట ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనే ప్రశ్నలకు సమాధానమే ది ఒడిస్సీ సినిమా కథ.
గ్రీక్ సామ్యాజ్యంలో ట్రోజన్ వార్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యాన్ని కథగా మార్చుకొని బలమైన పాత్రలను తీర్చిదిద్దిన తీరు విషయంలో దర్శకుడు క్రిస్టఫర్ నోలన్‌ను అభినందించాలి. కథను కథగానే చెప్పాలనే తాపత్రయం, నిజాయితీ ఆయనలో కనిపిస్తుంది. ఏ మాత్రం సన్నివేశాలను ఎలివేట్ చేయకుండా.. ప్రేక్షకుల మెప్పు కోసం ప్రయత్నించకుండా తాను చెప్పాలనుకొన్న కథను బలంగా చెప్ప ప్రయత్నం చేశారు. అయితే భారతీయ ప్రేక్షకులకు ఇలాంటి కథలు సుపరిచితమే. దాంతో నోలన్ ఎంచుకొన్న స్క్రీన్ ప్లే, సన్నివేశాల కారణంగా ఫస్టాఫ్ చాలా డల్‌గా, బోరింగ్‌గా సాగుతుంది. కథలో మంచి స్కోప్ ఉంది.. ఎలివేషన్స్ ఉంటే బాగుండు అని ఆశించే ఆడియెన్స్‌కు కొంత మేరకు పూర్తిగా నిరాశపడుతుంది. ది ఒడిస్సీ సినిమా ఫస్టాఫ్ కొంత అసంతృప్తికి గురి చేసినప్పటికీ.. సెకండాఫ్‌లో కంటెంట్‌ను బాగా జొప్పించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు నడిచిన డ్రామా, యాక్షన్, ఎమోషన్స్ చక్కగా కుదిరాయనిపిస్తుంది. చివరి 30 నిమిషాలు సినిమాకు మంచి హై మూమెంట్స్ ఉండటం ఊరటగా ఉంటుంది. టికెట్‌కు తగినట్టుగా పైసా వసూల్ అనే విధంగా సినిమాను ముగించారని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు ప్రపంచ సినిమాలో అత్యుత్తమ నటులనే విషయం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మాట్ డామన్, అన్నా హాత్ వే, టామ్ హాలెండ్, రాబట్ట్ పాటన్సన్ తమ పాత్రల పరకాయ ప్రవేశం చూసి పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. మాట్ డామన్, రాబర్ట్ పాటిన్సన్ నటన అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. అన్నా, టామ్ హలెండ్ ఈ సినిమాకు బలంగా నిలిచారు. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ గుర్తుండిపోయేలా తెరపైన కనిపించారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధానమైన బలంగా కనిపిస్తాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కొర్ స్పెషల్ ఎట్రాక్షన్. రెగ్యులర్‌గా హై సౌండింగ్ కాకుండా సన్నివేశాలకు తగనట్టుగా కొత్త మ్యూజిక్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ సినిమా కోసం వాటిన కలర్ సినిమాకు, సన్నివేశాలకు మంచి రిచ్‌నెస్ తెచ్చిపెట్టింది. నోలన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి అంచనాలకు భిన్నంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. ది ఒడిస్సీ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. రాజ్యాలు, యుద్దాలు, గెలుపు, ఓటములు, లవ్, ఎమోషన్స్, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, వెన్నుపోటు, పర స్త్రీపై వ్యామోహం లాంటి అంశాలతో రూపొందిన ఆసక్తికరమైన కథ. కాకపోతే బాహుబలి, గతంలో ఎన్నో పౌరాణిక, చారిత్రత్మక సినిమాలను చూసిన భారతీయ ప్రేక్షకులకు పెద్దగా కిక్ ఇవ్వదు. కానీ జెన్ జీ ఆడియెన్స్‌కు ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. కంటెంట్, పెర్ఫార్మెన్స్ ప్రధానంగా సాగే సినిమాలు చూసే, నోలన్ అభిమానులకు ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. ఈ వారం మంచి యాక్షన్, ఎమోషన్స్ సినిమా చూడాలనుకొంటే.. ది ఒడిస్సీ సినిమా కేరాఫ్ అడ్రస్. వాచ్ ఇన్ థియేటర్స్. డొంట్ మిస్.More Articles