హాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్, ఫాంటసీ చిత్రం ది ఒడిస్సీ. ఈతాకా గ్రీక్ సమ్రాజ్యాధినేత ఒడిస్సీ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ట్రోజాన్ వార్ తర్వాత చోటు చేసుకొన్న సంఘటలన నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఒడిస్సీగా మాట్ డామన్, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నె హత్‌వే నటించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ నటించారు. ఈ సినిమాను ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్ నిర్మించారు.
ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయ్‌తేమ, ఎడిటర్: జెన్నిఫర్ లామే, మ్యూజిక్: లడ్‌విగ్ గోరాన్సన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. యూనివర్సల్ పిక్చర్స్ , సింకోపి బ్యానర్లపై రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో, ఇతర దేశాల్లో జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఇండియాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) పూర్తి చేసింది. ఈ సినిమాకు సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
ది ఒడిస్సీ సినిమా కథ విషయానికి వస్తే.. గ్రీక్ సామ్రాజ్య విస్తరణలో భాగంగా సుదీర్ఘంగా సాగిన ట్రోజాన్ వార్ తర్వాత ఇంటికి చేరి భార్య పెనెలోప్‌ను కలిసిన తర్వాత చోటు చేసుకొన్న సంఘటనలు, గ్రీకులు ఆరాధ్యంగా భావించే పాలిఫేమస్, సిరెన్, నింప్ కాలిప్సో దేవుళ్లతో జరిగిన మానసిక సంఘర్షణ అంశాలుగా ఈ సినిమాను కథను తెరకెక్కించారు. ఒడిస్సీ, తన భార్య మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. వరల్డ్ వైడ్ మోస్ట్ అవైటింగ్‌గా పాపులారిటీని సంపాదించుకొన్న ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యులు, ప్రతినిధులు, అధికారులు వీక్షించారు. భారతీయ సినిమా సెన్సార్ నిబంధనల ప్రకారం ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ కథ, కథనాలు డిమాండ్ కారణంగా ఈ సినిమాలోని సీన్లు గానీ, డైలాగ్స్ గానీ మార్చడానికి వీలు కుదరదు అంటూ సినిమా యూనిట్ చేసిన రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకొంది. ఈ చిత్రంలోని న్యూడ్ సీన్లను గ్రాఫిక్స్‌తో బ్లర్ చేశారు. అనంతరం ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా విడుదలకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ది ఒడిస్సీ సినిమా కంటెంట్‌పై, ఫిల్మ్ మేకింగ్‌పై ప్రశంసలు గుప్పిస్తూ.. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. ఈ చిత్రాన్ని 18 ఏళ్ల దాటిన వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా థియేటర్‌లో చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని తమ నిబంధనల్లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమా కథ, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ డిమాండ్ చేయడంతో ఈ సినిమా నిడివి సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే పెరిగింది. ఈ సినిమా నిడివి 2 గంటల 55 నిమిషాలు. అంటే ఈ మూవీ రన్ టైమ్ 175 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించడం ద్వారా సెన్సార్ సర్టిఫికెట్ ధృవీకరించింది. ఇప్పటికే ముంబైలో జరిగిన వరల్డ్ ప్రీమియర్ షో ద్వారా ఈ సినిమాపై సాధారణ ఆడియెన్స్, క్రిటిక్స్ క్రిస్టఫర్ నోలన్ మేకింగ్, విజన్ గురించి ప్రశంసలు గుప్పిస్తున్నారు. టామ్ హాలెంట్, పాటిన్సన్, మాట్ డామన్, అన్నె హత్‌వే నటుల పెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉందంటూ కితాబు ఇస్తున్నారు. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌గా మారే అవకాశాలను క్రియేట్ చేసుకొన్నది. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.More Articles