హాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్, ఫాంటసీ చిత్రం ది ఒడిస్సీ. ఈతాకా గ్రీక్ సమ్రాజ్యాధినేత ఒడిస్సీ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ట్రోజాన్ వార్ తర్వాత చోటు చేసుకొన్న సంఘటలన నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఒడిస్సీగా మాట్ డామన్, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నె హత్‌వే నటించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ నటించారు. ఈ సినిమాను ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్ నిర్మించారు.
ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయ్‌తేమ, ఎడిటర్: జెన్నిఫర్ లామే, మ్యూజిక్: లడ్‌విగ్ గోరాన్సన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. యూనివర్సల్ పిక్చర్స్ , సింకోపి బ్యానర్లపై రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో, ఇతర దేశాల్లో జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..
కొన్ని సినిమాలు ఎంటర్‌టైన్ చేస్తాయి. మరొకొన్ని సినిమాలు సినిమా రీ డిఫైన్ చేస్తాయి. ఈ రెండింటిని అందించే చిత్రం ది ఒడిస్సీ. ఇప్పటి వరకు స్క్రీన్ మీద చూడని విధంగా క్రిస్టఫర్ నోలన్ ఈ సినిమాను అద్బుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉండేలా సినిమాను రూపొందించారు. ప్రతీ ఫ్రేమ్ మిమ్మల్ని ఒడిస్సీ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రతీ యుద్దం, ప్రతీ త్యాగం మిమ్మల్ని ఎమోషన్స్‌కు గురి చేస్తుంది. మాట్ డామన్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు అని నెటిజన్ సుదీర్గమైన రివ్యూను రాశారు. క్రిస్టఫర్ నోలన్ ది ఒడిస్సీ సినిమాను తన ఊహా ప్రపంచంలో ఎపిక్‌గా, బ్యూటిఫుల్‌గా రూపొందించారు. భావోద్వేగాలు అద్బుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమాను ఐమాక్స్ కెమెరాలో ఫస్ట్ టైమ్ తెరకెక్కించారు. ట్రోజన్ వార్ తర్వాత ఓ యోధుడు ఇంటికి వెళ్లే ప్రయాణం గురించే కథ. ఈ సినిమా కథ, కథనాలు అద్బుతంగా ఉన్నాయి అని క్రిటిక్ భరద్వాజ్ రంగన్ తన రివ్యూలో పేర్కొన్నారు. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్, సస్పెన్స్, ఊపిరి బిగపట్టేలా సన్నివేశాలను ఆశించే ప్రేక్షకులకు అన్ని కలిపి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా ది ఒడిస్సీ చిత్రాన్ని క్రిస్టఫర్ నోలన్ రూపొందించారు. తన రాణి, యువ రాజు నుంచి వేరు పడిన రాజు భావోద్వేగమైన జీవితం ఒక స్థాయిలో.. మరోస్థాయిలో సముద్ర ప్రయాణంలో థ్రిల్లింగ్ అడ్వెంచర్స్. మిస్టీరియస్ ద్వీపాలు ఊహకు అందని విధంగా మరిచిపోలేని విధంగా ఉంటాయి అని క్రిటిక్ రమేష్ బాలా తన రివ్యూలో పేర్కొన్నారు. క్రిస్టఫర్ నోలన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేశాడు. గ్రాండ్‌గా, ఎమోషనల్‌గా బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్ అంటే ఏమిటో చూపించాడు. ఈ సినిమాకు నా రేటింగ్ 4. హోప్, జీవనర్మరణ పోరాటంతో కూడిన గ్రిప్పింగ్ జర్నీ. నోలన్ ఈ సినిమాను ఊహకు అందని విధంగా రూపొందించారు అని నెటిజన్ కామెంట్ చేశాడు.
ఒడిస్సీ చిత్రం కేవలం ఓ యోధుడి, రాజు సాహోసోపేతమైన సినిమా కాదు. ఓ మనిషిలోని మానవత్వాన్ని చూపే కథ. ఇతికా నేపథ్యంలో ఈ సినిమా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. క్రిస్టఫర్ నోలన్ ఈ సినిమాను యాక్షన్, హ్యుమన్ ఎమోషన్స్‌తో కలబోసి అద్బుతంగా ఈ సినిమాను రూపొందించారు అని నెటిజన్ అభిప్రాయపడ్డారు.More Articles