షాలిని పాండే ఎద ఆ హీరో వీపుకు తగిలిందట.. క్లాస్ పీకుతున్నాడుగా!


షాలిని పాండే ఎద ఆ హీరో వీపుకు తగిలిందట.. క్లాస్ పీకుతున్నాడుగా!

నాగ చైతన్య సూపర్ హిట్ 100% లవ్ చిత్రం 2011లో విడుదలైంది. సుకుమార్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచారు. చైతు, తమన్నా ఈ చిత్రంలో జంటగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సంచలనమే. తెలుగు సూపర్ హిట్ చిత్రాలు పరభాషల్లో రీమేక్ కావడం సహజమే. 100% లవ్ చిత్రాన్ని దర్శకుడు ఎంఎం చంద్రమౌళి తెరక్కిస్తున్నాడు.

అర్జున్ రెడ్డి భామ

ఈ చిత్రాన్ని 100% కాదల్ పేరుతో తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే, తమిళ నటుడు జివి ప్రకాష్ కుమార్ జంటగా నటిస్తున్నారు. 100 పెర్సెంట్ లవ్ చిత్రంలో తమన్నా నటన హైలైట్ గా నిలిచింది. తమిళంలో షాలిని పాండే ఎలా నటిస్తుందో చూడాలి.

ఆకట్టుకునేలా టీజర్

తాజాగా 100% కాదల్ టీజర్ ని విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే కథలో ఎలాంటి మార్పులు లేకుండా ఒరిజినల్ స్టోరీని ఫాలో అయిపోయినట్లు తెలుస్తోంది. షాలిని పాండే క్యూట్ లుక్స్ తో అదరగొడుతోంది.

ఇంఫ్యాక్చుయేషన్

100 పెర్సెంట్ లవ్ చిత్రంలో తమన్నాకు నాగ చైతన్య ఇంఫ్యాక్చుయేషన్ అంటే ఏంటో వివరించే సన్నివేశం చాలా సరదాగా ఉంటుంది. ఆ సన్నివేశాన్నే తమిళ ప్రోమోగా విడుదుల చేశారు. జివి ప్రకాష్.. షాలిని ఇంఫ్యాక్చుయేషన్ అంటే ఏంటో వివరిస్తున్నాడు.

నీ యద నా వీపుని తాకింది

బైక్ కొద్దిగా పైకి జంప్ చేసింది. అప్పుడే నీ ఎద నా వీపుని తాకింది. నీ శ్వాసలో తేడా వచ్చింది. హార్ట్ బీట్ కూడా పెరిగింది. దీనినే ఇంఫ్యాక్చుయేషన్ అని అంటారు అంటూ జీవి ప్రకాష్ డైలాగ్ చెబుతుంటే, షాలిని పాండే రొమాంటిక్ లుక్స్ తో అదరగొడుతోంది. బావ మరదళ్ల సరసంతో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

Have a great day!
Read more...

English Summary

100 percent Kadhal teaser released. 100 percent remake 100 percent Kadhal will release soon