తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు దళపతి విజయ్, అందాల తార త్రిషా కృష్ణన్ రిలేషన్‌షిప్‌పై మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన విజయ్ గురించి ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో నోరు పారేసుకోవడం వివాదాస్పదంగా మారింది. అయితే విజయ్ సీఎం అయిన విధానం చూస్తే నాకు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉంది. నేను ఆ పదవిని చేపడితే.. త్రిషా మాదిరిగా చీరకట్టుకొని తన సహచరి తన ముందు కూర్చోవాలని కోరుకొంటున్నాను అని ధ్యాన్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ధ్యాన్ చేసిన కామెంట్స్, వ్యాఖ్యలు తమిళ, మలయాళ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. ధ్యాన్ శ్రీనివాసన్ మలయాళ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ..

Advertisement

నేను సినిమాలు వదిలేసి ఆస్ట్రేలియాలో స్టేజ్ షోలు, అడ్వర్టయిజ్‌మెంట్స్‌లో నటిస్తూ కాలం గడుపుతున్నాను. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పదవి చేపట్టిన తర్వాత నాకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక కలిగింది. సినిమాల్లో నటించి కేవలం 15 సంవత్సరాలు కష్టపడితే ఈజీగా ముఖ్యమంత్రి అయిపోతాను అనే ఆలోచన వచ్చింది అని ఆయన అన్నాడు.

Advertisement

నా మనసులో మాట చెప్పగానే నా తోటి నటుడు అజ్జు నాకు ఓ సలహా ఇచ్చాడు. నీవు ముందుగా మలయాల మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడి పోస్ట్ చేపట్టండి. ఆ తర్వాత చారిటీ పనులు చేసి ప్రజలను ఆకట్టుకో. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నించు అని అన్నాడు. ప్రస్తుతం అదే మంచిదనే ఆలొచన నాకు కలుగుతుంది అని అన్నారు.

విజయ్‌‌ను చులకన చేసి మాట్లాడటం అంతటితో ఆపలేదు. విజయ్ ప్రమాణ స్వీకారానికి చీరకట్టులో వచ్చిన త్రిషా కృష్ణన్‌పై సంఘటనపై కూడా నోటి దురుసు బయటపెట్టాడు. స్వచ్ఛంద సేవ చేసి ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రమాణ స్వీకారం చేసే సమంయలో నటి నవ్య కూడా త్రిష మాదిరిగానే చీర కట్టుకొని నా ముందు కూర్చోవాలి. ఆ సమయంలో ఆమె కళ్లలో ఆనందభాష్పాలు రావాలి అంటూ జోకులు వేసి తనలో తానే బిగ్గరగా నవ్వుకొన్నాడు.

Advertisement

అయితే ధ్యాన్ శ్రీనివాసన్ వ్యాఖ్యలకు అక్కడే ఉన్న నటి నవ్య కూడా స్పందిస్తూ.. ఆ విషయంలో నీవేమి ఆందోళన చెందకు. నీవు సీఎం అయి ప్రమాణ స్వీకారం చేస్తే.. ఆకు పచ్చ అంచు ఉన్న తెల్లటి చీర కట్టుకొని, మెడలో నెక్లేస్ వేసుకొని నేను నీ ముందు కూర్చుంటాను. అప్పుడు నా కళ్లలో ఆనందభాష్పాలు కూడా ఉంటాయి. నీవు సాధించిన విజయానికి జై కొడుతాను. అందుకు నాకు ముందు వరుసలో సీట్ ఏర్పాటు చేయాలి అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరి సంభాషణపై నెటిజన్లు, విజయ్ అభిమానులు, సినీ వర్గాలు అభ్యంతరం తెలిపారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉండే వారిపై బహిరంగంగా కామెంట్స్ ఎలా చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ధ్యాన్ శ్రీనివాసన్ విషయానికి వస్తే.. ఆయన దర్శకుడు శ్రీనివాసన్ కుమారుడు. యాక్టర్, డైరెక్టర్ వినీత్ శ్రీనివాసన్ సోదరుడిగా పరిచయం. ఆయన లవ్ యాక్షన్ డ్రామా, ప్రకాశన్ పరకట్టే, నాదికలిల్ సుందరీ యుమున చిత్రాల్లో నటించారు. మలయాళ సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కూడా ఉంది.