అనసూయ భరద్వాజ్.. టాలీవుడ్‌లో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా తన గ్లామర్, ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తారు. ముఖ్యంగా నలభై ఏళ్ల వయసు దాటినా అదే ఫిట్‌నెస్, అదే గ్లామర్‌ను కంటిన్యూ చేస్తుంది. అయితే.. ఆమె డైలీ రొటీన్ ఏంటో తెలుసుకోవాలనే చాలామంది అభిమానులు ఆసక్తి చూపిస్తారు. తాజాగా అనసూయ ఓ ఫిట్‌నెస్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement

బుల్లితెరపై 'జబర్దస్త్' కార్యక్రమంతో స్టార్ యాంకర్‌గా ఎదిగిన అనసూయ.. తర్వాత వెండితెరపై వరుస అవకాశాలు అందుకుంది. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రతో నటిగా తన సత్తా చాటారు. 'పుష్ప'లో దాక్షాయణి పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించింది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో తన ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అభిమానులకు ప్రేరణగా నిలుస్తోంది.

తాజాగా షేర్ చేసిన వీడియోలో అనసూయ ఉదయం నుంచి తన ఫిట్‌నెస్ రొటీన్‌ను చూపించింది. జిమ్‌లో బరువులు ఎత్తడం, స్కిప్పింగ్ చేయడం, లోయర్ బాడీ స్ట్రెంగ్త్ కోసం ప్రత్యేక వ్యాయామాలు చేయడం వంటి అంశాలను వీడియోలో చూపించింది. ముఖ్యంగా మహిళల్లో పెల్విక్ ప్రాంతం, ఇన్నర్ థైస్ బలంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరమని తన వర్కవుట్ ద్వారా తెలియజేసింది.

Advertisement

వీడియోలో మాట్లాడుతూ.. "ఉదయాన్నే లేవడం, వర్కవుట్ చేయడం అంత ఈజీ కాదు. చాలా మంది ఇవాళ వద్దు.. రేపటి నుంచి మొదలు పెడదాం అని సాకులు చెబుతుంటారు. కానీ ఒకసారి అలవాటు చేసుకుంటే అది జీవితంలో భాగమైపోతుంది. రోజూ మీ ఆరోగ్యం కోసం కనీసం ఒక గంట సమయం కేటాయించండి. వీలైతే గంటన్నర వరకు వ్యాయామం చేయండి" అంటూ ఫిట్‌నెస్‌పై తన అభిప్రాయాన్ని పంచుకుంది.

Advertisement

అనసూయ వీడియోలో కేవలం వ్యాయామం మాత్రమే కాదు.. వర్కవుట్ తర్వాత తీసుకునే ఆహారం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిమ్ పూర్తి చేసిన తర్వాత మెంతి నీళ్లు, నానబెట్టిన నట్స్, బ్లూబెర్రీస్, వాల్‌నట్స్, స్పినాచ్-మష్రూమ్ ఆమ్లెట్ వంటి పోషకాహారాన్ని తీసుకుంటున్నట్లు చూపించింది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం రెండూ కలిసి ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణమని ఆమె పరోక్షంగా తెలిపింది.

Advertisement

ఇంకా వీడియోలో మాట్లాడుతూ "ఒకప్పుడు బఫే కనిపిస్తే వెంటనే తినాలని అనిపించేది. కానీ ఇప్పుడు నా ఆరోగ్యం నా చేతుల్లో ఉందని అర్థమైంది. టొమాటోలు సహజసిద్ధమైన సన్‌స్క్రీన్‌లా పనిచేస్తాయని మీకు తెలుసా?" అంటూ ఆహారపు అలవాట్ల గురించి చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో సరైన ఆహారం ఎంత ముఖ్యమో ఆమె మరోసారి గుర్తు చేసింది. ఈ వీడియో వైరల్ కావడానికి కారణం కేవలం ఆమె గ్లామర్ మాత్రమే కాదు. ఫిట్‌నెస్‌ను అలవాటుగా మార్చుకోవాలనే సందేశాన్ని ఎంతో సరదాగా, సులభంగా చెప్పడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు ఆమె కమిట్‌మెంట్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement