బిగ్ బాస్2 : ఏడ్చుకుంటూ పరిగెత్తిన కౌశల్.. పిలుపు వినిపిస్తున్నా కదలలేని పరిస్థితి!


బిగ్ బాస్2 : ఏడ్చుకుంటూ పరిగెత్తిన కౌశల్.. పిలుపు వినిపిస్తున్నా కదలలేని పరిస్థితి!

బిగ్ బాస్ 2 లో ప్రస్తుతం జరుగుతున్న టాస్క్ బిగ్ బాస్ రిమోట్ కంట్రోల్. బిగ్ బాస్ తన మాట ద్వారా ఇంటి సభ్యులని కంట్రోల్ చేస్తున్నారు. ఫ్రీజ్ అంటే ఎక్కడ ఉన్నవారు అక్కడే కదలకుండా ఉండిపోవాలి. ఫాస్ట్ ఫార్వార్డ్ అంటే వేగంగా ముందుకు కదలాలి. రివైండ్ అంటే వెనుకకు కదలాలి. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఎమోషన్స్ ని కూడా జత చేస్తున్నారు. ఇంటి సభ్యులు ఫ్రీజ్ లో ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఒక్కొకరుగా వస్తున్నారు. చాలా కాలం తరువాత తమ కుటుంబ సభ్యులని చూసిన హౌస్ మేట్స్ భావోద్వాగాలని ఆపుకోలేకపోతున్నారు.

మంగళవారం ముగిసిన ఎపిసోడ్ లో సామ్రాట్, అమిత్, దీప్తి కుటుంబ సభ్యులు ఒకరి తరువాత ఒకరు హౌస్ లోకి వచ్చారు. కుటుంబ సభ్యులు ఇంటిలోకి వస్తున్న సమయంలో హౌస్ మేట్స్ ఫ్రీజ్ లో ఉండడంతో స్పందించడానికి కూడా వీలు లేకుండా ఉంది. కొంత సమయం తరువాత బిగ్ బాస్ వరుని రిలీజ్ చేస్తున్నారు.

మొదట సామ్రాట్ తల్లి హౌస్ లోకి వచ్చి అందరితో ఆప్యాయంగా మాట్లాడారు. ఆ తరువాత అమిత్ సతీమణి, కుమారుడు వచ్చారు. కొడుకుని చూడగానే అమిత్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక దీప్తి భర్త, కొడుకు కూడా బిగ్ బాస్ హౌస్ ని సందర్శించారు.

ఇక కౌశల్ కుటుంబ సభ్యులు నేడు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. కౌశల్ పిల్లల ఎంట్రీని భిన్నంగా బిగ్ బాస్ ప్లాన్ చేశారు. కౌశల్ సహా ఇంటి సభ్యులంతా ఫ్రీజ్ లో ఉన్న సమయంలో సీక్రెట్ రూమ్ నుంచి పప్పా అనే పిలుపు వినిపిస్తుంది.

పిలిచేది తన పిల్లలే అని తెలిసినా కౌశల్ కదలలేని పరిస్థితి. సీక్రెట్ రూమ్ నుంచి కౌశల్ కొడుకు, కూతురు మైక్ లో పిలుస్తుండగా బిగ్ బాస్ అతడిని రిలీజ్ చేస్తాడు. అంతే కౌశల్ ఏడ్చుకుంటూ పిల్లల వైపు పరిగెడుతున్నాడు. ఈ దృశ్యాలని హృదయాన్ని హత్తుకునే విధంగా ఉన్నాయి.

ఇక హౌస్ లోకి గీత మాధురి, తనీష్, రోల్ రైడ్ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి రావలసి ఉంది. నేడు జరగబోయే ఎపిసోడ్ లోనే ఈ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గీత, తనీష్, రోల్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి వస్తే భావోద్వేగాలు ఎలా ఉంటాయనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

Have a great day!
Read more...

English Summary

Big Boss 2 Kaushal gets emotional afters hearing his child voice. Emotional incidents in Bigg Boss