స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగువారిని ఆకట్టుకున్నారు కన్నడ కస్తూరి శోభా శెట్టి. ఈ మెగా సీరియల్‌లో డాక్టర్‌ను బాబును దక్కించుకోవడం కోసం దీపను ముప్పుతిప్పలు పెట్టే డాక్టర్ మోనితగా అద్భుతంగా నటించారు శోభా శెట్టి. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని కొత్త తరహా విలనిజంతో భయపెట్టారు. అత్త చేతిలో వేధింపులు, గొడవలను చూసిన తెలుగు మహిళా ప్రేక్షకులకు కొత్త రకం సవతి పోరును చూపించారు శోభ. ఆ సీరియల్‌తో ఆమెకు తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. అసలు పేరును వదిలేసి మోనితగానే అందరూ పిలుస్తున్నారంటే ఆ పాత్రపై శోభా శెట్టి ఎలాంటి ముద్ర వేశారో చెప్పొచ్చు.

Advertisement
Advertisement

కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన శోభా శెట్టి చాలా చిన్న వయసులోనే నటనా రంగంలోకి వచ్చారు. 2017లో కన్నడ సూపర్‌స్టార్, దివంగత పునీత్ రాజ్‌కుమార్ హీరోగా వచ్చిన అంజనీ పుత్రలో ఆమె నటించారు. పునీత్, రష్మిక మందన్న వంటి స్టార్స్ ఉన్నప్పటికీ తన మార్క్ చూపించారు శోభ. ఆ తర్వాత కన్నడ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పలు సీరియల్స్‌లో నటించారు. అనంతరం అష్టాచెమ్మా సీరియల్‌తో తెలుగులో అడుగుపెట్టారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభా శెట్టికి కార్తీక దీపంలో డాక్టర్ మోనిత పాత్ర పోషించే అవకాశం దక్కింది. ఈ రోల్‌లో తన నట విశ్వరూపాన్ని చూపించారు శోభ. మోనిత పాతకు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవడంతో పాటు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు.

Advertisement

ఈ ఫేమ్‌తోనే 2023లో బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నారు శోభా శెట్టి. టాప్ సెలబ్రిటీలు ఉన్నా.. శివాజీ వంటి అపర చాణక్యుడి ఉన్నప్పటికీ ఆమె తన ఉనికిని చాటుకుని ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. దూకుడు, వ్యక్తిత్వం, ఆటతీరుతో అభిమానులను అలరించిన ఆమె ఖచ్చితంగా ఫైనల్‌కు వెళ్తుందని అంతా భావించారు. కానీ గ్రాండ్ ఫినాలేకు ముందు 98వ రోజున శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్‌తో ఆమె మరింత పాపులర్ అయ్యారు.

Advertisement

ఇక తన మాతృభాష కన్నడంలోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కించుకున్నారు శోభా శెట్టి. తద్వారా రెండు భాషలలో టెలికాస్ట్ అయినా బిగ్‌బాస్‌ సీజన్‌లలో పాల్గొన్న అరుదైన ఘనతను సంపాదించుకున్నారు. అయితే కన్నడ బిగ్‌బాస్ 11లో ఏకంగా హోస్ట్ కిచ్చా సుదీప్‌తో ఆమె గొడవపడటం హాట్ టాపిక్‌గా మారింది. రెండు వారాలు గడిచిన తర్వాత అనారోగ్య కారణాలతో శోభా శెట్టి సెల్ఫ్ ఎలిమినేషన్ అవుతానని చెప్పారు. అయితే ఇందుకు కిచ్చా ఒప్పుకోలేదు. మీరు టాప్ 2లో ఉన్నారు.. ఇప్పటి వరకు ఓట్లేసి మిమ్మల్ని ప్రోత్సహించిన ప్రేక్షకులను ఎలా నిరుత్సాహపరుస్తారని సుదీప్ మండిపడ్డారు.

Advertisement

బిగ్‌బాస్ టీమ్ కూడా సర్దిచెప్పాలని చూసినప్పటికీ.. డబ్బు, పేరు కావాలంటే తర్వాత సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోతే మళ్లీ తిరిగిరాదనే ఉద్దేశంతో కన్నడ బిగ్‌బాస్‌ను వీడింది శోభా శెట్టి. హౌస్‌లో ఉండగా శారీరకంగా, మానసికంగా ఒత్తిడిలో ఉండటంతో ప్రియుడు యశ్వంత్ ఆమెకు అండగా నిలిచాడు. వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగి రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇటీవల శోభా శెట్టి ఓ బొటెక్, డిజైనర్ స్టూడియోను ప్రారంభించారు. ఈ స్టోర్‌కి సంబంధించిన చీరలు, ఇతర డ్రెస్సులు స్వయంగా ధరించి తనకు తానే బ్రాండింగ్ చేసుకుంటున్నారు. తాజాగా పలుచటి ఆక్వా కలర్ చీరను ధరించి తన నడుము అందాలను చూపెడుతూ కుర్రాళ్లకు సెగలు రేపుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement