Photo Courtesy: JioHotstar
నువ్వే నందూ అనడానికి ప్రూఫ్ ఏంటీ అని భ్రమరాంబ అడగటంతో చిన్నప్పుడు జరిగిన ప్రతి విషయాన్ని చెబుతుంది నందూ. మా కుటుంబం గురించి ఏవో నాలుగు విషయాలు తెలుసుకుని నువ్వే నందూ అంటే మేం నమ్మమని అంటుంది రేఖ. దాంతో నేను చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు ఒక పోలీస్‌కి దొరికాను. ఆయనే నన్ను పెంచి పెద్ద చేశాడు. ఆయనే నా కేస్‌ని మిస్సింగ్ కేసుగా ఎఫ్ఐఆర్ చేయించాడని నందూ ఆధారాలు చూపించడంతో అంతా షాక్ అవుతారు. ఇన్నాళ్లూ నీకు దూరంగా ఉంటున్నాను, నీకు బుద్ధి చెప్పే సమయం కోసం వెయిట్ చేస్తున్నానని అంటుంది నందూ.
ఈ ఆస్తి మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ కావాలంటే ఇందూ అక్క సంతకంతో పాటు నా సంతకం కూడా కావాలని చెప్పి డాక్యుమెంట్స్‌ని చించి రేఖ ముఖాన కొడుతుంది. ఇందూ అక్కకి నేను ఉన్నా.. ఇకపై నువ్వేం చేసినా నేను ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. మమ్మల్ని ఇంతకాలం వదిలేసి ఎక్కడికి వెళ్లావని నందూని చూసి బాధపడతారు సుభాష్, అపర్ణ. నేనే నందూని అని అక్కకి తెలుసని చెప్పడంతో అపర్ణ, సుభాష్‌లు షాక్ అవుతారు. సమయానికి వచ్చి ఆస్తిని కాపాడావని నందూకి థ్యాంక్స్ చెబుతుంది ఇందూ. అయితే ఇదంతా రాజ్ బావ వల్లే.. తనే సమయానికి నన్ను పంపించాడని నందూ చెప్పడంతో అపర్ణ, సుభాష్‌లు సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 10వ తేదీ ఎపిసోడ్ 1081లో ఇంకా ఏం జరిగిందంటే?
Photo Courtesy: JioHotstarMore Articles