Photo Courtesy: JioHotstar

రాజ్‌ని ఎలాగైనా ఇంటికి తీసుకురమ్మని అపర్ణ చెప్పగా.. ఇందూ మండిపడుతుంది. మేమంటే అక్కాచెల్లెళ్లం.. కానీ రాజ్‌కి ఏం సంబంధం, అతనిని తల్లిదండ్రులకు దూరం చేయలేనని తేల్చేస్తుంది ఇందూ. తను నీ భర్త .. కడదాకా తోడు ఉంటానని ఏడడుగులు వేసిన మనిషి.. మేం పిలిస్తే రాజ్ రాడు అని చెబుతుంది అపర్ణ. అయితే నేను పిలవలేనని చెప్పి వెళ్లిపోతుంది ఇందూ. అయినా నేను వచ్చేశాను కదా ఇకపై అంతా నేను చూసుకుంటానని చెబుతుంది నందూ. రేఖకి రాజ్ ఫోన్ చేసి ఎలా ఉంది పిన్ని మన సర్‌ప్రైజ్ అని సెటైర్లు వేస్తాడు. ఇప్పుడు ఎప్పుడు ఇందూ నా భార్య.. తనకి నేనున్నాని చెబుతాడు.

Advertisement

ఆస్తి రాలేదని బాధపడుతున్న భ్రమరాంబ, రేఖల దగ్గరికి తట్టా బుట్టా సర్దుకుని వస్తాడు శేషం. నందూ వచ్చాక మన పని ఔట్.. మనల్ని బాంబు పెట్టి పేల్చేస్తుందని, కనీసం ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడ ఉండకూడదని చెబుతాడు శేషం. నేను ఉండగా మీకు ఆ పరిస్ధితి రానివ్వనని ధైర్యం చెబుతుంది రేఖ. ఇందూని కాపాడటంతో రాజ్ చాలా సంతోషంగా ఉంటాడు. నీకు ఫ్యామిలీ ఉంది. అద్దె మొగుడు క్యారెక్టర్ కారణంగా ఇందూతో బంధం వచ్చింది. కానీ నాకు ఎవ్వరూ లేరు.. నా తల్లిదండ్రులు ఎవరో? ఎందుకు నన్ను వదులుకున్నారో తెలియదు అని బాధపడతాడు. ఇందూ రూమ్‌లోకి వచ్చిన ఐశ్వర్య.. రాజ్ లేడు కాబట్టి ఈ రూమ్ ఖాళీ చేయమని చెబుతుంది. ఇంతలో నందూ వచ్చి మా అక్క ఖాళీ చేయదు, నేను కూడా ఇదే రూమ్‌లో పడుకుంటానని గొడవ పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 11వ తేదీ ఎపిసోడ్ 1082లో ఇంకా ఏం జరిగిందంటే?

Advertisement