Photo Courtesy: JioHotstar
ఈరోజు మీ అమ్మని చూడబోతున్నావని లక్కీకి చెబుతాడు రాజ్.. మా అమ్మ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుందని లక్కీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండటంతో సాయంత్రం వరకు వెయిట్ చేయమని చెబుతాడు రాజ్. ఆ వెంటనే రేఖకి ఫోన్ చేసి లక్కీకి తల్లినని ఒప్పుకుంటావా? లేక నేనే వచ్చి అందరి ముందు నిజం చెప్పానా అని బెదిరిస్తాడు. ఆ మాటలు విన్న రేఖ షాక్ అవుతుంది. ఇంతలో భ్రమరాంబ, ఐశ్వర్య వచ్చి నీకు ఏమైంది? ఎందుకంత పరధ్యానంలో ఉంటున్నావు? ఆ రాజ్ గాడే ప్లాన్ చేసి మరి నందూని మనింటిలోకి పంపించాడు. ఈ ఇంటికి దూరంగా ఉంటున్నా నిన్ను దెబ్బకొట్టాడని ఫైర్ అవుతుంది.
దాంతో రాజ్ కథ ఈరోజుతో ముగించేస్తున్నానని, దానికి ఏర్పాట్లు చేశానని రేఖ చెబుతుంది. ఈ మాటలన్నీ విన్న స్వాతి వెంటనే ఈ విషయం ఇందూకి చెబుతుంది. రాజ్‌ని ఎలాగైనా కాపాడుకోవాలని అతను ఫోన్ ఎత్తకపోవడంతో వెంటనే రాజ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారిద్దరూ కంగారుపడతారు. రాజ్‌ను వెంటాడుతున్న రేఖ మనిషి కారుతో గుద్దేయడంతో అతను కిందపడిపోతాడు. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్యలో ఉన్న రాజ్‌ని చూసి కంటతడి పెడతారు ఇందూ, లక్ష్మీ, చలపతి. వాడు నీ మొగుడు అయినందుకే ఆ రేఖ చంపాలని అనుకుంది. అదే దుగ్గిరాల వారసుడని తెలిస్తే అస్సలు బతకనివ్వదని చలపతి అనడంతో ఇందూ షాక్ అవుతుంది. వాడు మీ నాన్నగారి అక్క కొడుకు, నీకు స్వయానా బావ అని చలపతి నిజం చెప్పేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 14వ తేదీ ఎపిసోడ్ 1084లో ఇంకా ఏం జరిగిందంటే?
Photo Courtesy: JioHotstar వాడు ప్రాణాలతో ఉండాలంటే నీ ప్రేమను చంపేసుకోవాలి, నువ్వు వాడి జీవితంలో నుంచి తప్పుకోమని ఇందూ కాళ్లపై పడతాడు చలపతి. దాంతో ఇందూ బాధతో వెళ్లిపోతుంది. కిచెన్‌లో వంట చేసుకుంటున్న అపర్ణ దగ్గరికి రేఖ వచ్చి .. మీ మనవడు కానీ మనవడు ఆ రాజ్ గాడు ఇంట్లో నుంచి వెళ్లిపోయినా హాయిగా ఉన్నావా? అని అడుగుతుంది. మీకు వాడి మీద చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా? మీ మహారాణి ఇందూకి వాడు అడ్డుగా నిలబడి కాపాడతాడని ఫీలింగ్ కదా? వాడు దీనిని కాపాడుకోవాలంటే ముందు వాడిని వాడు కాపాడుకోవాలి కదా అని అంటుంది రేఖ. వాడు ఇక ఎప్పటికీ రాడు, రాలేడు. ఈ కుటుంబంలోనే కాదు .. ఈ భూమ్మీదే ఎక్కడా కనిపించడని రేఖ చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. వాడు చూడటానికి నీ కొడుకులా కనిపిస్తాడని కదా అంత ప్రేమ కురిపిస్తున్నావు? నీ అసలు కొడుకు లాగే వీడు కూడా అంతర్ధానమైపోతాడని చెబుతుంది రేఖ. ఎదుటివాళ్ల నాశనం కోరుకుంటే ఏమొస్తుంది నీకు? ఆ నోటితో ఎందుకు అశుభాలు పలుకుతావని మండిపడుతుంది అపర్ణ. మీరు సమూలంగా నాశనమైపోతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ రాజ్‌గాడు నీకు సపోర్ట్‌గా ఉంటాడని కలలు కనొద్దు. ఆ రాజ్‌గాడు వచ్చాడు, పోయాడు.. ఇక ఇంట్లో వాడు ఒక చరిత్ర మాత్రమేనని చెబుతుంది రేఖ. నీకు మిగిలింది ఒకే ఒక్క ఆప్షన్ వాడిని మరిచిపోవడమేనని అంటుంది. రేఖ మాటలతో అపర్ణ కంగారుపడి రాజ్‌కి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తుంది. ఆ వెంటనే ఇందూకి ఫోన్ చేస్తుంది అపర్ణ.More Articles