Photo Courtesy: JioHotstar

వాడు ప్రాణాలతో ఉండాలంటే నీ ప్రేమను చంపేసుకోవాలి. నువ్వు వాడి జీవితంలో నుంచి తప్పుకోమని ఇందూకి చెబుతాడు చలపతి. మీ మనవడు వస్తాడు.. మమ్మల్ని ఉద్దరిస్తాడని కలలు కంటున్నావా? వాడు ఇక ఎప్పటికీ తిరిగిరాడని రేఖ చెప్పడంతో ఏం జరిగిందోనని అపర్ణ కంగారుపడి రాజ్, ఇందూలకి ఫోన్ చేస్తుంది, కానీ ఎవ్వరూ ఫోన్ తీయరు. నా కొడుకు ప్రాణాలతో ఉండి, మా కళ్ల ముందే ఉంటే చాలు వాడి బిజినెస్‌లు చేయొద్దని ఏడుస్తాడు చలపతి. మా మధ్యలో నువ్వు ఉండొద్దు వెళ్లిపోమని ఇందూని కసురుకుంటాడు. అయితే ఆ అమ్మాయిని కూడా ఇక్కడే ఉండనివ్వండి అని నచ్చచెబుతుంది లక్ష్మీ.

Advertisement

రాజ్‌ని బతికించమంటూ దేవుడి ముందు ఏడుస్తుంది ఇందూ. నా బావకి ఏమైనా అయితే నేను భరించలేను, నాకు నా బావ కావాలని చెబుతుంది. రేఖ మాటలతో అపర్ణ, సుభాష్‌లు కంగారుపడతారు. రాజ్‌కి ఏం జరిగింది? ఇందూ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ స్పృహలోకి రావడంతో చలపతి, ఇందూ, లక్ష్మీలు సంతోషిస్తారు. ఇకపై నువ్వు వాడి జీవితంలో ఉండొద్దు, వాడి మీద నీ ప్రేమను చంపేసుకోమని చెబుతాడు చలపతి. అది మాత్రం మా బావని మా ఇంటికి తీసుకెళ్తాను, అక్కడైతేనే రాజ్ సేఫ్‌గా ఉంటాడని చెబుతుంది ఇందూ. కానీ చలపతి, లక్ష్మీలు మాత్రం ససేమీరా అంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 15వ తేదీ ఎపిసోడ్ 1085లో ఇంకా ఏం జరిగిందంటే?

Advertisement