Photo Courtesy: JioHotstar

నేను నీతో కలిసి మీ ఇంటికి రాను.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని ఇందూపై సీరియస్ అవుతాడు రాజ్. ఈ అమ్మాయిని అర్జెంట్‌గా ఇక్కడి నుంచి పంపించేయమని చలపతిని అడుగుతాడు. తను నీ భార్య, ఈ ఇంటి కోడలు.. నీకు ఈ ఇంట్లో ఉండటానికి ఎంత హక్కుందో, తనకు అంతే హక్కుంది.. అయినా భార్యాభర్తల గొడవల్లోకి మేమెందుకు అని చలపతి, లక్ష్మీలు వెళ్లిపోతారు. రాజ్ కోపంగా వెళ్తుండగా కాలు జారి కిందపడిపోతుండగా ఇందూ వచ్చి పట్టుకుంటుంది. రాజ్ బతికే ఉండటం చూసి రేఖ షాక్ అవుతుంది. వీడు ఇంకా బతికే ఉన్నాడు.. ఆ రౌడీగాడు డబ్బులు తీసుకుని మోసం చేశాడని రగిలిపోతుంది.

Advertisement

నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావని అంటుంది రేఖ. లక్కీగాడి మేటర్ సమాధి చేయడానికి నన్ను చంపాలని నువ్వే ఈ యాక్సిడెంట్ చేశావని నాకు తెలుసని రాజ్ అనడంతో రేఖ షాక్ అవుతుంది. లక్కీగాడి మేటర్ నేను మరొకరికి కూడా చెప్పాను.. నాకు ఏదైనా జరిగితే వాళ్లు వచ్చి ఈ విషయం బయటపెట్టేవారు అనడంతో రేఖకి చెమటలు పడతాయి. త్వరలోనే నేను మళ్లీ దుగ్గిరాల నిలయానికి వస్తాను.. అప్పుడు లక్కీగాడి విషయం కూడా బయట పెడతానని చెబుతాడు. నువ్వెందుకు ఇక్కడే ఉన్నావని ఇందూని రేఖ అడగ్గా.. నేను ఇక్కడ లేకపోతే మీరే రాజ్‌కి యాక్సిడెంట్ చేయించారని అనుకుంటారని చెబుతుంది. దాంతో ఇందూని అక్కడే ఉండమని అంటుంది రేఖ. అపర్ణ చేసిన టిఫిన్ బాగోకపోవడంతో భ్రమరాంబ, ఐశ్వర్యలు మండిపడతారు. ఇంతలో నందూ వచ్చి వారిపై సీరియస్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 17వ తేదీ ఎపిసోడ్ 1087లో ఇంకా ఏం జరిగిందంటే?

Advertisement