Photo Courtesy: JioHotstar

అపర్ణతో వంట చేయించి, చేసిన ఉప్మా బాలేదన్న భ్రమరాంబ, ఐశ్వర్యలకు బుద్ధి చెప్పడానికి ఉప్మాలో గమ్ వేసి తయారు చేస్తుంది నందూ. అది నోట్లో పెట్టుకోగానే వారిద్దరికీ నోరు అతుక్కుపోతుంది. ఈ ఇంట్లో ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి? ఈ వయసులో మా నానమ్మ మీకు వండి పెట్టాలా? ఇది మరోసారి రిపీట్ అయితే పనిష్మెంట్ మరోలా ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది. నేను ముందే చెప్పాను ఆ నందూతో జాగ్రత్తగా ఉండమని మీరే వినిపించుకోలేదని భ్రమరాంబ మీద ఫైర్ అవుతాడు శేషం.

Advertisement

రాజ్‌ని గదిలోకి తీసుకెళ్లి కాలికి మర్దన చేస్తానని అడుగుతుంది ఇందూ. దానికి రాజ్ ససేమిరా అనడంతో నీకు మరో కాలు ఉందనే కదా? నేనంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నావు, నీ రెండో కాలిని కూడా చితక్కొడితే చచ్చినట్లు నా మాట వింటావని అంటుంది. దాంతో చేసేదేం లేక మర్దన చేయించుకోవడానికి ఒప్పుకుంటాడు రాజ్. నన్ను వదిలేసి వెళ్లిపోమంటే ఎందుకు వెళ్లడం లేదు? నీకు నాకు సంబంధం ఏంటీ అని ఫైర్ అవుతాడు రాజ్. నువ్వు వచ్చాక నా జీవితంలో చాలామంచి జరిగింది, అలాంటిది నిన్ను వదిలేసి వెళ్లనని తేల్చేస్తుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 18వ తేదీ ఎపిసోడ్ 1088లో ఇంకా ఏం జరిగిందంటే?

Advertisement