Photo Courtesy: JioHotstar

ఎంత దూరం పెడుతున్నా నా నుంచి వెళ్లిపోవడం లేదు అసలు నీకు నాకు సంబంధం ఏంటీ అని ఇందూపై మండిపడతాడు రాజ్. నువ్వు లేకుండా నేను బతకలేను, నీతోనే ఉంటానని కంటతడి పెడుతుంది ఇందూ. నీకు నాకు పెళ్లి జరిగిందని మా అమ్మానాన్నలు అనుకుంటున్నారు. మనకి పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిపిస్తే నీ జీవితమే నాశనం అయిపోతుందని వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఏం జరుగుతుందో నేను కూడా చూస్తానని ఇందూ కౌంటర్ ఇస్తుంది.

Advertisement

భ్రమరాంబకి నోరు అతుక్కుపోయి బాధపడుతుంటే రేఖ వచ్చి మనం అనుకున్నది ఏది జరగలేదని ఆ రాజ్‌గాడు బతికే ఉన్నాడని రగిలిపోతుంది. రాజ్‌కి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి అతనిని పరామర్శించడానికి లక్కీ వస్తాడు. మీ అమ్మ అడ్రస్, వివరాలు తెలుసుకుందామని వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెబుతాడు రాజ్. మా అమ్మ ఎవరో త్వరగా తెలుసుకుని నా ముందు నిలబెట్టమని అడుగుతాడు లక్కీ. పాల గ్లాసుతో గదిలోకి వచ్చిన ఇందూని చూసి రాజ్ వణికిపోతాడు. తన అందంతో, గిలిగింతలతో రాజ్‌ని ముగ్గులోకి లాగాలని ఇందూ అనుకోగా అతను తప్పించుకుంటాడు. ఉదయాన్నే ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్న ఇందూని, ఆమెకు సపోర్ట్ చేస్తున్న తల్లిదండ్రులను చూసి రాజ్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 20వ తేదీ ఎపిసోడ్ 1089లో ఇంకా ఏం జరిగిందంటే?

Advertisement