Photo Courtesy: JioHotstar
నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చే వరకు ధర్నా ఆపేది లేదని రాజ్‌తో తేల్చి చెబుతుంది ఇందూ. నాకు మీరు సపోర్ట్‌గా ఉండాల్సిందిపోయి ఈ అమ్మాయికి అండగా ఉంటారా? నేను మీ కన్నకొడుకునేనా అని మండిపడతాడు రాజ్. నాకు మీరిద్దరూ సమానమే అంటుంది లక్ష్మీ. ఇలా చేస్తే రేపు నాకు పిల్లని ఎవరిస్తారని రాజ్ అనడంతో ఈ అమ్మాయిని వదిలేస్తావా అని మండిపడతాడు చలపతి. నేను తమ్ముడిని దృష్టిలో పెట్టుకుని అన్నానని కవర్ చేస్తాడు. అప్పుడే భర్త రేపు ఏమైనా అన్యాయం చేస్తే అత్తామామలు తోడుగా ఉంటారని చుట్టుపక్కల వాళ్లకి అర్ధమవుతుందని అంటాడు చలపతి.
ఇందూ అరుపులతో ఇరుగుపొరుగు ఆడవాళ్లు వచ్చి రాజ్‌పై కేసులు పెట్టి, జైళ్లో పెట్టిద్దామని, నీకు విడాకులు ఇప్పిస్తానని చెబుతారు. తన ప్లాన్ రివర్స్ అయ్యేలా ఉందని వాళ్లని ఇందూ పంపించేస్తుంది. ఇంతలో కాలనీలో ఉన్న భర్తలంతా వచ్చి ఏం జరిగిందని అడగ్గా.. నా భర్తను మా ఇంటికి రమ్మంటే రావడం లేదని అమాయకంగా చెబుతుంది ఇందూ. దాంతో భర్తలంతా ఇందూకి అండగా నిలిచి రాజ్‌కి చీవాట్లు పెడతాడు. మర్యాదగా నువ్వు ఆ అమ్మాయితో వెళ్లకపోతే మన సిటీలో ఉన్న భర్తలందరినీ ఇక్కడ దింపుతామని బెదిరిస్తారు. దాంతో రాజ్ ఇందూ వెంట వెళ్లడానికి ఒప్పుకుంటాడు. రాజ్‌ని ఇందూని ఆటోలో అత్తారింటికి పంపుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 21వ తేదీ ఎపిసోడ్ 1090లో ఇంకా ఏం జరిగిందంటే?
Photo Courtesy: JioHotstar నేను మీ ఇంటికి రావాలంటే నాకు కొన్ని కండీషన్స్ ఉన్నాయని ఇందూతో అంటాడు రాజ్. ఇదేదో మీ ఇంటి దగ్గరే అయిపోయేదని చెబుతుంది ఇందూ. నేను దర్జా మహారాజులా బెడ్ మీదే పడుకుంటాను, ఇంట్లో విషయాల్లో నాకు నచ్చినట్లుగానే జోక్యం చేసుకుంటాను నువ్వు అడ్డు చెప్పకూడదు. అప్పుడప్పుడు ఓవరాక్షన్ పేరుతో నా పేమెంట్‌ని కట్ చేయకూడదు. నా చూపులు, మాటలు ఎప్పుడూ చెడు ఉద్దేశంతో ఉండవు, కానీ నువ్వు అలా అనుకుని నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదని కండీషన్స్ పెడతాడు రాజ్. నా పేమెంట్ 20 శాతం పెంచాలని డిమాండ్ చేస్తాడు. ఈ కండీషన్స్ అన్నింటికి ఒప్పుకుంటేనే మీ ఇంటికి వస్తానని చెబుతాడు రాజ్. నీ కండీషన్స్‌కి నేను ఒప్పుకుంటున్నాను, అయినా నీ ఇంటికి రావడానికి డబ్బులు అడుగుతావా అని మండిపడుతుంది ఇందూ. మనకి కావాల్సింది డబ్బులు, ఫ్రీడమ్ .. టైంకి డబ్బులు ఇస్తావా లేదా అని మాట ఇవ్వమని అడుతాడు. దాంతో రాజ్‌ని ఇందూ రెచ్చగొట్టేలా టచ్ చేయడంతో భయపడతాడు. రాజ్, ఇందూలు తిరిగి దుగ్గిరాల ఇంటికి రావడంతో రేఖ, భ్రమరాంబలు షాక్ అవుతారు. అపర్ణ సంతోషంతో వెలిగిపోతూ మనవడి దగ్గరికి వెళ్తుంది. ఏం జరిగింది? ఈ దెబ్బలు ఏంటీ? అని అడగ్గా.. యాక్సిడెంట్ అయ్యిందని చెబుతుంది ఇందూ. అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం తప్పిందని అంటుంది. నీ మనవడు ఉక్కు మనిషి ఏం కాలేదు.. కానీ కొంచెం కాలికి బాగా దెబ్బ తగిలిందని చెబుతాడు రాజ్. నువ్వు అందరినీ బెండు తీస్తా అనేవాడివి, చివరికి ఇలా అయిపోయావని అంటాడు శేషం. మీరు కంగారుపడతారని ఈ విషయం మీకు చెప్పలేదని అంటుంది ఇందూ. ఇంత పెద్ద ప్రమాదం తగిలితే మాకెందుకు చెప్పలేదు.. రాజుని ఇలా చూస్తుంటే నా ప్రాణం పోతున్నట్లుగా ఉంది. తనకి ఏదైనా జరగరానిది జరిగితే మా పరిస్ధితి ఏంటీ? తను కొన్నిరోజులు ఇంట్లో లేకపోతేనే మనం ఏదో కోల్పోయినట్లుగా, శూన్యంలోకి వెళ్లిపోయినట్లుగా ఉందని బాధపడుతుంది అపర్ణ. నేను ఇందూ భర్తని కాదు, భర్తలా నటిస్తున్నాను.. మీరు అనవసరంగా ఎక్కువ ప్రేమను పెంచుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి నాక్కూడా మీ మనవడినేమో అన్న ఫీలింగ్ కలుగుతోందని అనుకుంటాడు రాజ్. రాజ్‌ని ఇంటికి తీసుకురమ్మని నాతో గొడవ పడ్డావు కదా? ఇప్పుడు రాజుని నీ భర్తలా కాకుండా, మీ మనవడిలా ఇంటికి తీసుకొచ్చానని ఇందూ చెప్పడంతో రేఖ, భ్రమరాంబలు షాక్ అవుతారు. అసలు నీకు యాక్సిడెంట్ ఎలా జరిగిందని అడుగుతుంది స్వాతి. అంతపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావంటే నీ ఆయుష్షు గట్టిదేనని అంటాడు శేషం. యాక్సిడెంట్ ఎవరు చేశారు అని నందూ ప్రశ్నిస్తుంది. ఎవరో కావాలనే చేశారని రాజు అనడంతో నీకిలా యాక్సిడెంట్ చేయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తుంది స్వాతి. మనమంటే గిట్టనివాళ్లు కొందరుంటారు కదా? అలాంటి వాళ్లు ఎవరో అయ్యుంటారని చెబుతాడు రాజు. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని నందూ అడుగుతుంది. మనతోనే ఉంటూ మనకి వెన్నుపోటు పొడిచేవాళ్లు చాలామంది ఉంటారు అంటాడు రాజు. నీకు యాక్సిడెంట్ చేసినవాళ్లని అస్సలు వదిలిపెట్టను.. వాళ్లు ఎవరైనా సరే వెతికి పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తానని నందూ చెప్పడంతో రేఖ వణికిపోతుంది. అసలే రాజుకి దెబ్బలు తగిలాయి.. ఇలా మాట్లాడుతూనే ఉంటావా అని నందూపై సీరియస్ అవుతుంది రేఖ. ఆమె చాలా ఆందోళనగా కనిపిస్తుండటంతో శేషంకి అనుమానం వస్తుంది. నువ్వు మారిపోయావు.. ఆ రాజ్‌గాడిని ఎందుకు లోపలికి రానివచ్చావు? నందూని ఎందుకు వదిలేస్తున్నావని ప్రశ్నిస్తాడు. కొన్నిసార్లు మాయ చేయాలి, కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండాలి.. నేను ఏం చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటుందని సీరియస్‌గా వెళ్లిపోతుంది రేఖ. మనింటికి వచ్చేశాం.. నువ్వు నా కండీషన్స్‌కి ఒప్పుకుంటేనే ఇక్కడ ఉంటానని తేల్చేస్తాడు రాజ్. మా ఆస్తిని రేఖ ఆంటీ దక్కించుకుంటుందని తెలిసి సైలెంట్‌గా ఉండకుండా ఎందుకు నందూని పంపించావని ప్రశ్నిస్తుంది ఇందూ. నీ విషయంలో, నీ ఫ్యామిలీ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూసుకుంటానని మాటిచ్చాను కదా అని గుర్తుచేస్తాడు రాజ్. నీ కండీషన్స్‌కి నేను ఒప్పుకోను, గతంలో మాదిరిగానే ఉండాలని ఇందూ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నువ్వు బెడ్ మీదే పడుకో, నేను నేలమీద పడుకోమని చెబుతుంది ఇందూ. ఇందూ బయటికి వెళ్తుండగా నందూ ఎదురవ్వడంతో ఆమెను నవ్వుతూ హత్తుకుంటుంది. మనకి ఈ కష్టాలన్నీ ఎక్కువ రోజులు ఉండవని అంటుంది. రాజును తీసుకొచ్చినందుకు చాలా సంతోషిస్తున్నావని అర్ధమవుతుందని అంటుంది నందూ. రాజు ఎవరు? నందూ అడగ్గా.. చలపతి అంకుల్ కొడుకు అని చెబుతుంది ఇందూ. నీకు తనకు మధ్య ఏ రిలేషన్ ఉంది అని ప్రశ్నిస్తుంది నందూ. తనని తీసుకురమ్మని చెబితే నువ్వు పట్టించుకోలేదు.. ఇప్పుడు నువ్వే వెళ్లి తీసుకొచ్చావని అడుగుతుంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా రాజుని తన ఫ్యామిలీకి దూరం చేయకూడదని అనుకున్నావు.. అలాంటిది ఇప్పుడు ఎలా దూరం చేస్తావు? నువ్వు తనని తీసుకొచ్చావంటే చాలా బలమైన కారణం ఉందని అనుమానిస్తుంది నందూ రాజుకి జరిగిన యాక్సిడెంట్ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కావొద్దని చెబుతుంది ఇందూ. ఖచ్చితంగా అవుతా.. తను మనకి చాలా చేశాడు, అలాంటిది తనకి యాక్సిడెంట్ జరిగింది. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టనని చెబుతుంది నందూ. యాక్సిడెంట్ చేయించింది ఎవరో నాకు తెలుసు అని ఇందూ చెప్పగా నందూ షాక్ అవుతుంది. యాక్సిడెంట్ చేయించింది రేఖ ఆంటీ అని ఇందూ చెప్పడంతో పోలీస్ కంప్లయింట్ ఇద్దామని అంటుంది నందూ. సాక్ష్యాధారాలు కావాలని చెబుతుంది ఇందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.More Articles