Photo Courtesy: JioHotstar
రాజ్‌ని చంపాలనుకున్నది రేఖ ఆంటీయేనని ఇందూ చెప్పడంతో నందూ షాక్ అవుతుంది. ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టను.. చేసిన తప్పుకి తనకు శిక్ష పడాల్సిందేనని అంటుంది నందూ. కానీ ఇందూ మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెబుతుంది. వెంకీకి నందూ ఫోన్ చేసి మీ అన్నయ్యకి యాక్సిడెంట్ చేసిన వాళ్లని పట్టుకోవడంలో సాయం చేయమని అడుగుతుంది. ఉదయాన్నే ఇంటికి డబ్బుల కోసం వచ్చిన శృతిని ఐశ్వర్య నానామాటలు అంటుంది. ఇదంతా చూసిన నందూ కోపంతో రగిలిపోతుంది. తను కష్టపడి సంపాదిస్తోంది.. నీలాగా ఖాళీగా కూర్చోవడం లేదని కౌంటర్ ఇస్తుంది. నందూని కొట్టడానికి ఐశ్వర్య చేయ్యెత్తగా ఇందూ ఆపుతుంది. శృతికి డబ్బులిచ్చి పంపేసి ఐశ్వర్యకి క్లాస్ పీకుతుంది.
మీరేం చేసినా ఐశ్వర్య మారదని రాజ్ అంటాడు. మా అక్కని మేం మార్చుకుంటామని చెబుతుంది ఇందూ. నిద్రలో యాక్సిడెంట్ కల రావడంతో రాజ్ ఉలిక్కిపడి లేస్తాడు. దాంతో రాజుని ఏం జరిగిందని అడుగుతుంది ఇందూ. నా వాళ్లకు ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్లుగా నా చిన్నప్పటి నుంచి ఓ యాక్సిడెంట్ కలలో వస్తుందని చెబుతాడు. అది విన్న ఇందూ.. నువ్వు దుగ్గిరాల వారసుడివి కాబట్టేనని మనసులో అనుకుంటుంది. లక్కీని ఇంటికి పిలిపించిన రాజ్.. ఇతను నాతో పాటు ఇక్కడే ఉంటాడని చెబుతాడు. మేం ఒప్పుకోమని భ్రమరాంబ అనడంతో రేఖ పిన్నిని అడుగుదామిన రాజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. చిన్నప్పుడే వీడి తల్లి .. లక్కీని అనాథాశ్రమంలో పడేసిందని రాజ్ చెప్పడంతో సుభాష్, అపర్ణలు నానామాటలు అంటారు. వీడికి వాడి తల్లిని చూపిస్తానని మాటిచ్చానని అందుకే ఇక్కడికి పిలిపించానని చెబుతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 23వ తేదీ ఎపిసోడ్ 1092లో ఇంకా ఏం జరిగిందంటే?
Photo Courtesy: JioHotstar లక్కీకి రేఖ పిన్నియే అడ్రస్.. తనే ఆథార్ కార్డ్ అని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. తన పలుకుబడి ఉపయోగించి వీళ్ల అమ్మ ఎక్కడున్నా సరే తనే వెతికి తీసుకొచ్చి లక్కీగాడి ముందు పెడతానని నాకు మాటిచ్చింది. అందుకే తీసుకొచ్చానని అంటాడు రాజ్. వాడు ఇన్నేళ్లుగా ఆ బాధను, నరకయాతన అనుభవించాడు.. మనలాంటి వాళ్లు సాయం చేస్తేనే కదా నలుగురు నాలుగు దిక్కులకు వెళ్తారని అంటాడు రాజ్. ఇంతలో రేఖని లక్కీ అమ్మా అని పిలవడంతో అంతా షాక్ అవుతారు. అమ్మ ఆలనా పాలనా తెలియదు, అమ్మ ప్రేమకు నోచుకోలేని దౌర్భాగ్యుడిని, అసలు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ భూమ్మీద కన్నతల్లి కూడా తెలియనివాళ్లు ఉన్నారంటే అది నేను మాత్రమే.. నా తల్లి కోసం ఎంత భారం మోస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. మీరు నాకు సాయం చేస్తానని అన్నారా? మీలాంటి వారు సాయం చేస్తాను అన్నారంటే నాకు మా అమ్మ దొరుకుతుందన్న నమ్మకం ఉంది.. థ్యాంక్స్ మేడం అని లక్కీ అంటాడు. మేడం ఏంటీ? అమ్మ లాంటిది అని రాజ్ అనడంతో రేఖ షాక్ అవుతుంది. వాడు ఇక్కడ ఉండటానికి వీల్లేదని భ్రమరాంబ చెప్పగా.. అది చెప్పాల్సింది రేఖ పిన్ని, తను మాట తప్పే మనిషి కాదు. ప్రాణాలైనా వదులుకుంటుంది కానీ ఇచ్చిన మాట తప్పదని అంటాడు రాజ్. ఇతనిని పంపించేయమంటావా? ఉండమంటావా? అప్పుడు నేను ఒక్కడినే వీడి తల్లిని వెతికే బాధ్యతని భుజాన వేసుకుంటాను. కానీ ఆమె ఎక్కడున్నా కనిపెట్టి తీరతానని చెబుతాడు రాజ్. రేఖ ఉండమని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అందరూ నాకు ఇచ్చిన గౌరవమే వీడికి కూడా ఇవ్వాలని చెబుతాడు రాజ్. నందూ గురించి ఆలోచిస్తూ సిగ్గుపడుతుంటా వెంకీ. ఇన్నాళ్లూ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, నేను ప్రేమిస్తున్నది నిన్నే.. అది ఇప్పుడే తెలుసుకున్నాను. నా జీవితంలో మరో అమ్మాయికి చోటు లేదు.. నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలని నందూకి ప్రపోజ్ చేయాలని లెటర్ రాస్తుంటాడు. రాజ్‌ని వాడి ఇంటికి పంపించడం ఇష్టం లేకపోయినా మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాడు ఆ ఇంటికి వెళ్లను అంటుంటే మనమే బలవంతంగా పంపించాం.. వాడు అక్కడ ఎలా ఉంటాడోనని చలపతి బాధపడతాడు. అది వాడి ఇల్లు.. వాడు అక్కడ బాగానే ఉంటాడని లక్ష్మీ అనడంతో వెంకీ షాక్ అవుతాడు. అది వదిన ఇల్లు కదా? అన్నయ్య ఇల్లు అంటావేంటీ? అని ప్రశ్నిస్తాడు. అది మీ వదిన ఇల్లు కాబట్టే మీ అన్నయ్య ఇల్లు అని చలపతి కవర్ చేస్తాడు. మీరు అన్నయ్య గురించి అనవసరంగా ఆలోచిస్తున్నారు. తనకు నిజయంగా వెళ్లాలని లేకుంటే కాలు కూడా బయటపెట్టడు, వదినతో బతిమలాడించుకోవడానికే అలా యాక్ట్ చేశాడని అనిపిస్తోంది. వదినే అన్నయ్యని పంపించింది కాబట్టి.. ఇలా రివేంజ్ తీర్చుకున్నాడని అంటాడు వెంకీ. వాడి సంగతి సరేకానీ, నీ పరిస్ధితి ఏంటీ? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఒక మనిషికి ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో అర్ధం కాదు. ప్రేమించడం తప్పు కాదు.. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే మాత్రం మీ అన్నయ్యలా చేయకు. ముందే మాకు చెబితే అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాం. ఈ సిటీలో ఉన్న ఏ అమ్మాయినైనా ప్రేమించు.. కులం, గోత్రం, జాతకం వాటితో మాకు పనేలేదు.. కానీ ఆ దుగ్గిరాల ఇంటి అమ్మాయిని మాత్రం ప్రేమించొద్దని చలపతి చెప్పడంతో వెంకీ షాక్ అవుతాడు. మీ అన్నయ్య ఆ ఇంటితో బంధం ఏర్పరచుకున్నాడు.. నువ్వు కూడా అలాగే చేస్తావని ముందే చెబుతున్నాం. మీ అన్నయ్యని అక్కడికి పంపించడం మాకు ఇష్టం లేదు, ఆ ఇందూ ముఖం చూస్తే పాపం అనిపించింది. అందుకే మా మనసు చంపుకుని ఆ ఇంటికి పంపించాం.. నువ్వు కూడా ఆ ఇంటికి వెళ్తానంటే మేం పంపించమని చెబుతారు. అన్నయ్యకి అలా కలిసొచ్చింది కానీ నా విషయంలో అలా జరగదని అంటాడు వెంకీ. అయితే నువ్వు దుగ్గిరాల ఇంటి అమ్మాయిని ప్రేమించనని మాట ఇవ్వమని అడుగుతాడు చలపతి. నేను ప్రేమిస్తున్నది నందూని.. నందూ ఆ ఇంటి వారసురాలు కాదు కాబట్టి మాటిస్తాడు వెంకీ. ఇంతలో నందూ రావడంతో వెంకీ ముఖం వెలిగిపోతుంది. అసలు ఆ రేఖ ఆంటీకి మా అమ్మ గురించి ఎలా తెలుసు? ఎలా వెతుకుందని రాజ్‌ని నిలదీస్తాడు లక్కీ. ఇంతలో ఇందూ కూడా వచ్చి అదే ప్రశ్న అడుగుతుంది. రేఖ ఆంటీ ఎవరికైనా సాయం చేయడం చూశావా? అందరి నాశనం కోరుకునే ఆవిడ లక్కీకి ఎందుకు మంచి చేస్తుంది? లక్కీ వాళ్ల అమ్మ గురించి తనెందుకు వెతుకుందని ప్రశ్నిస్తుంది ఇందూ. అసలు మా అమ్మ ఎవరు? నీకు తెలుసా అని లక్కీ అడుగుతాడు. లక్కీని పక్కకి పిలిచి మీ అమ్మ గురించి నేను చూసుకుంటాను.. ఈలోపు ఐశ్వర్యని సెట్ చేసుకోమని చెబుతాడు రాజ్. దాంతో లక్కీ సంబరపడిపోతాడు. మా అందరికీ తెలియకుండా ఏదైనా డ్రామా ఆడుతున్నావా అని రాజ్‌పై మండిపడుతుంది ఇందూ. నువ్వు లక్కీని ఇక్కడికి తీసుకొచ్చావంటే ఏదో కారణం ఉంది చెప్పమని ఇందూ బలవంతం చేయడంతో రాజ్ నిజం చెప్పేస్తాడు. లక్కీ వాళ్ల అమ్మ ఎవరో కాదు రేఖ పిన్నియే.. లక్కీగాడు రేఖ పిన్ని కన్నకొడుకు అని రాజ్ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఇంత రహస్యం ఉందా? రేఖ ఆంటీకి ఇంత గతం ఉందా? నిజం తెలిసినప్పుడు చెప్పొచ్చు కదా? అని అంటుంది ఇందూ. మీ రేఖ పిన్ని ఒప్పుకుంటుందా? ఇప్పుడు లక్కీగాడికి అమ్మ ప్రేమ కావాలి.. బలవంతంగా ఒప్పుకుంటే వాడిని ప్రేమగా చూసుకోలేదు. అందుకే తనంతట తానే లక్కీ నా బిడ్డ అని చెప్పేలా చేయాలి. నాకు ఈ విషయంలో నీ సాయం కావాలని అడగ్గా.. సరేనని అంటుంది ఇందూ. నందూతో బైక్ మీద వెళ్తూ ఆమెకు ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు. అయితే అతను సైలెంట్‌గా ఉండటం చూసి మళ్లీ ఏ అమ్మాయినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది నందూ. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నేను సాల్వ్ చేస్తానని అంటుంది. వెంకీ ప్రపోజ్ చేయబోతుండగా ఎస్ఐగారి ఇంటికి వెళ్తుంది నందూ. తనకి ఎలా ప్రపోజ్ చేయాలని కంగారుపడుతుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.More Articles