Photo Courtesy: JioHotstar

లక్కీకి రేఖ పిన్నియే అడ్రస్.. తనే ఆధార్ కార్డ్ అని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతాడు. అంటే తన పలుకుబడిని ఉపయోగించి లక్కీ వాళ్ల అమ్మని వెతుకుతుందని నా ఉద్దేశం అని అంటాడు. లక్కీ వాళ్ల అమ్మని వెతికి పెడతానని రేఖ పిన్నియే నాకు మాటిచ్చింది.. అందుకే వాడిని తీసుకొచ్చానని అంటాడు. నేను నా కన్నతల్లి స్పర్శ తెలియకుండానే పెరిగాను.. మీరు నా తల్లిని వెతికి పెడతారా అని రేఖతో అంటాడు లక్కీ. రేఖ పిన్ని మాట తప్పదు.. మాట మీదే నిలబడుతుందని చెబుతాడు రాజ్. ఇకపై నాకు ఇచ్చిన గౌరవమే వీడికి కూడా ఇవ్వాలని చెబుతాడు రాజ్.

Advertisement

నందూ మీద ఇష్టం పెంచుకున్న వెంకీ.. ఆమెకు ప్రపోజ్ చేయడానికి లవ్ లెటర్ రాసిపెట్టుకుంటాడు. రాజ్ గురించి ఆలోచిస్తున్న చలపతి- లక్ష్మీలు .. వెంకీని పిలిచి నువ్వు ఎవరినీ ప్రేమించినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ దుగ్గిరాల ఇంటి వారసురాలిని మాత్రం ప్రేమించొద్దని మాట తీసుకుంటాడు చలపతి. నందూ ఆ ఇంటి వారసురాలని తెలియక మాటిస్తాడు వెంకీ. ఇంతలో నందూ రావడంతో ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు. లక్కీని నువ్వు తీసుకురావడం వెనుక ఏదో కారణం ఉందని రాజ్‌ని ఇందూ నిలదీయడంతో రేఖ ఆంటీయే లక్కీ కన్నతల్లని రాజ్ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. వాడికి తల్లిని దగ్గర చేయడానికి నీ సాయం కావాలని చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 24వ తేదీ ఎపిసోడ్ 1093లో ఇంకా ఏం జరిగిందంటే?

Advertisement