Photo Courtesy: JioHotstar
మా అక్కని ఎందుకు వదిలేశావు అని రాజ్‌ని నిలదీస్తుంది నందూ. ఆస్తిని కొట్టేయడానికి రేఖ ఆంటీ ప్లాన్ చేస్తోందని నువ్వే వచ్చి మా కుటుంబాన్ని, కంపెనీని కాపాడాలని రాజ్‌ని బతిమలాడుతుంది అపర్ణ. ఏం జరిగినా సరే ఆస్తిని కాపాడతానని మాటిస్తాడు రాజ్. ఆస్తి పేపర్ల మీద ఇందూ సంతకం చేస్తుండగా నందూ వచ్చి ఎవరి ఆస్తి ఎవరు రాయించుకుంటున్నారు, నా సంతకం లేనిదే మీకు ఆస్తి దక్కదని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కళ్యాణ్- అప్పూల కూతురిని నేనే అని చెప్పి అన్ని ఆధారాలు చూపిస్తుంది నందూ. రాజ్‌ని ఇంటికి తీసుకొచ్చేది లేదని ఇందూ తేల్చేయడంతో అపర్ణ, సుభాష్‌లు బాధపడతారు. తల్లి కోసం లక్కీ బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతాడు రాజ్. ఇంతలో ఆంటోనీ కనిపించడంతో అతనిని ఫాలో చేస్తూ వెళ్తాడు. 50 లక్షలు ఇవ్వకపోతే లక్కీ మీ కొడుకని అందరికీ చెబుతానని రేఖకి ఆంటోనీ వార్నింగ్ ఇస్తాడు. ఆ వెంటనే రాజ్ వచ్చి మీరే లక్కీకి తల్లి అని ఒప్పుకోమని డెడ్‌లైన్ పెట్టడంతో రేఖ షాక్ అవుతుంది.
Photo Courtesy: JioHotstar బ్రహ్మముడి జూలై 06వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు .. 1077వ ఎపిసోడ్ నుంచి 1082వ తేదీ వరకు ఏం జరిగిందంటే? జూలై 06వ తేదీ 1077వ ఎపిసోడ్‌లో .. జూలై 07వ తేదీ 1078వ ఎపిసోడ్‌లో.. Photo Courtesy: JioHotstar జూలై 08వ తేదీ 1079వ ఎపిసోడ్‌లో.. జూలై 09వ తేదీ 1080వ ఎపిసోడ్‌లో.. Photo Courtesy: JioHotstar జూలై 10వ తేదీ 1081వ ఎపిసోడ్‌లో.. జూలై 11వ తేదీ 1082వ ఎపిసోడ్‌లో..
రాజ్‌ని ఎందుకు గెంటేశావు? నీపాటికి నిర్ణయాలు తీసుకుంటే ఇక పెద్దవాళ్లు మేమెందుకు అని ఇందూపై మండిపడుతుంది అపర్ణ. తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు రేఖ సంతోషిస్తుంది. రాజ్‌కి అపర్ణ ఫోన్ చేసి మా అందరినీ మధ్యలోనే వదిలేస్తావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి నమ్మకాలు వమ్ము చేస్తావా అని బాధపడుతుంది. ఇందులో నా తప్పేం లేదు, మీ మనవరాలే నన్ను వెళ్లిపోమన్నదని అంటాడు రాజ్. మనవడిని పంపేయడంపై ఇందూకి సుభాష్- అపర్ణలు క్లాస్ పీకుతారు. నేను పంపించకపోతే రాజ్ వాళ్ల అమ్మానాన్నలకు దూరమవుతాడని అంటుంది. రాజ్ లేకపోవడంతో దుగ్గిరాల ఆస్తిని కొట్టేయాలని రేఖ ప్లాన్ చేస్తుంది. ఈ మాటలన్నీ విన్న స్వాతి వెంటనే వచ్చి ఇందూకి చెబుతుంది. నువ్వు వెంటనే ఫోన్ చేసి రాజ్ బావని రమ్మని చెబుతుంది స్వాతి. కానీ ఇందూ మాత్రం వినిపించుకోదు. నా కోసం తనను వాళ్ల కుటుంబానికి దూరం చేయలేనని అంటుంది ఇందూ.
రాజ్ దగ్గరికి వచ్చిన నందూ.. మా అక్క జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావు, ఆమెను మోసం చేశావని మండిపడుతుంది. నువ్వేదో సొంత చెల్లెలిలా ఫీలైపోతున్నావని ఫైర్ అవుతాడు రాజ్. నేను సొంత చెల్లెలినే రాజ్ బాబాయ్ కొడుకు కూతురిని అని నందూ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. మా అక్కని, ఆ ఇంటిని నువ్వే కాపాడాలని చెప్పి కోపంగా వెళ్లిపోతుంది. అర్ధరాత్రి ఇందూని పిలిచిన రేఖ.. ఆ రాజ్‌గాడి పీడ వదిలిపోయింది. ఇకపై ఇలాంటి తప్పులు జరగకూడదంటే ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ కావాలని చెబుతుంది. ఆ మాటలతో ఇందూ, అపర్ణలు షాక్ అవుతారు. నా మనవడి సంతకం లేనిదే ఈ ఆస్తి నీకు దక్కదని చెబుతుంది అపర్ణ. అందుకే రాజ్‌తో దొంగచాటుగా ఫైల్స్ మీద సంతకం చేయించుకున్నట్లు ఆస్తి పేపర్ల మీద సంతకం తీసుకున్నానని రేఖ చెప్పడంతో ఇందూ- అపర్ణలు ఉలిక్కిపడతారు. రాజ్ ఒంటరిగా బాధపడుతుండటంతో లక్కీని పిలిపించిన చలపతి.. వాడితో మాట్లాడి ధైర్యం చెప్పమని అంటాడు. రాజ్‌కి అపర్ణ ఫోన్ చేసి రేఖ ఆస్తిని కొట్టేయబోతుందని చెబుతుంది.
ఆస్తిని కొట్టేయడానికి రేఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మా దుగ్గిరాల కుటుంబాన్ని, ఆస్తిని, కంపెనీని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు నీ మీదే ఉందని రాజ్‌కి చెబుతుంది అపర్ణ. ఏం జరిగినా సరే ఆస్తిని కాపాడతానని అమ్మమ్మకి రాజ్ మాటిస్తాడు. ఉదయాన్నే ఒక బ్రోకర్‌కి ఫోన్ చేసి బంజారాహిల్స్‌లో ల్యాండ్ కొనాలని అనుకుంటున్నానని చెబుతుంది భ్రమరాంబ. పగటి కలలు కనొద్దని మీరేం చేసినా నా మనవడు రాజ్ ఈ దారుణాన్ని అడ్డుకుంటాడని చెబుతుంది అపర్ణ. ఆస్తిని రిజిస్ట్రర్ చేయించడానికి రిజిస్ట్రార్ ఇంటికి వస్తాడు. దాంతో ఇందూని పిలిచి ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించబోతుండగా నందూ ఎంట్రీ ఇస్తుంది. ఈ ఆస్తి ఇందూదే కాదు, నాది కూడా.. నాకు కూడా హక్కుందని అంటుంది. అసలు నువ్వెవరు? నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటని రేఖ ప్రశ్నిస్తుంది. దుగ్గిరాల ప్రకాష్ - ధాన్యలక్ష్మీల మనవరాలిని, అప్పూ- కళ్యాణ్‌ల కూతురిని నందూని అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు
నువ్వే నందూ అనడానికి ప్రూఫ్ ఏంటీ అని భ్రమరాంబ అడగటంతో చిన్నప్పుడు జరిగిన ప్రతి విషయాన్ని చెబుతుంది నందూ. మా కుటుంబం గురించి ఏవో నాలుగు విషయాలు తెలుసుకుని నువ్వే నందూ అంటే మేం నమ్మమని అంటుంది రేఖ. దాంతో నేను చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు ఒక పోలీస్‌కి దొరికాను. ఆయనే నన్ను పెంచి పెద్ద చేశాడు. ఆయనే నా కేస్‌ని మిస్సింగ్ కేసుగా ఎఫ్ఐఆర్ చేయించాడని నందూ ఆధారాలు చూపించడంతో అంతా షాక్ అవుతారు. ఈ ఆస్తి మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ కావాలంటే ఇందూ అక్క సంతకంతో పాటు నా సంతకం కూడా కావాలని చెప్పి డాక్యుమెంట్స్‌ని చించి రేఖ ముఖాన కొడుతుంది. మమ్మల్ని ఇంతకాలం వదిలేసి ఎక్కడికి వెళ్లావని నందూని చూసి బాధపడతారు సుభాష్, అపర్ణ. సమయానికి వచ్చి ఆస్తిని కాపాడావని నందూకి థ్యాంక్స్ చెబుతుంది ఇందూ. అయితే ఇదంతా రాజ్ బావ వల్లే.. తనే సమయానికి నన్ను పంపించాడని నందూ చెప్పడంతో అపర్ణ, సుభాష్‌లు సంతోషిస్తారు.
రాజ్‌ని ఎలాగైనా ఇంటికి తీసుకురమ్మని అపర్ణ చెప్పగా.. ఇందూ మండిపడుతుంది. అతనిని తల్లిదండ్రులకు దూరం చేయలేనని తేల్చేస్తుంది ఇందూ. అయినా నేను వచ్చేశాను కదా ఇకపై అంతా నేను చూసుకుంటానని చెబుతుంది నందూ. రేఖకి రాజ్ ఫోన్ చేసి ఎలా ఉంది పిన్ని మన సర్‌ప్రైజ్ అని సెటైర్లు వేస్తాడు. ఇప్పుడు ఎప్పుడు ఇందూ నా భార్య.. తనకి నేనున్నాని చెబుతాడు. ఆస్తి రాలేదని బాధపడుతున్న భ్రమరాంబ, రేఖల దగ్గరికి తట్టా బుట్టా సర్దుకుని వస్తాడు శేషం. నందూ వచ్చాక మన పని ఔట్.. మనల్ని బాంబు పెట్టి పేల్చేస్తుందని, కనీసం ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడ ఉండకూడదని చెబుతాడు శేషం. నేను ఉండగా మీకు ఆ పరిస్ధితి రానివ్వనని ధైర్యం చెబుతుంది రేఖ. ఇందూని కాపాడటంతో రాజ్ చాలా సంతోషంగా మందు కొడతాడు. నీకు ఫ్యామిలీ ఉంది. అద్దె మొగుడు క్యారెక్టర్ కారణంగా ఇందూతో బంధం వచ్చింది. కానీ నాకు ఎవ్వరూ లేరు.. నా తల్లిదండ్రులు ఎవరో? ఎందుకు నన్ను వదులుకున్నారో తెలియదు అని బాధపడతాడు. ఇందూ రూమ్‌లోకి వచ్చిన ఐశ్వర్య.. రాజ్ లేడు కాబట్టి ఈ రూమ్ ఖాళీ చేయమని చెబుతుంది. ఇంతలో నందూ వచ్చి మా అక్క ఖాళీ చేయదు, నేను కూడా ఇదే రూమ్‌లో పడుకుంటానని గొడవ పడుతుంది.
తల్లి కోసం లక్కీ పడుతున్న బాధను చూడలేక కిందకి వస్తున్న రాజ్‌కి.. ఆంటోనీ కనిపించడంతో అతనిని ఫాలో అవుతాడు. ఓ చోట రేఖని ఆంటోనీ కలవడంతో రాజ్ షాక్ అవుతాడు. మీ కొడుకు లక్కీ తల్లి ఎక్కడ చూపించమని గొడవ చేస్తున్నాడని ఇక నా వల్ల కావడం లేదని ఆంటోనీ చెప్పడంతో రాజ్ ఉలిక్కిపడతాడు. లక్కీ గాడు రేఖ పిన్ని కొడుకా అని అనుకుంటాడు. మీరు 50 లక్షల రూపాయలు ఇస్తే ఓకే.. లేదంటే నీ తల్లి ఎవరో చెబుతానని 10 లక్షల రూపాయలు కావాలని అడిగితే ఆ లక్కీగాడు తల తాకట్టు పెట్టైనా తెస్తాడని చెబుతాడు ఆంటోనీ. అతను వెళ్లిపోగానే రేఖ దగ్గరికి వెళ్లిన రాజ్.. మా లక్కీగాడు తల్లి కోసం పడే బాధను చూడలేను. మీరే తల్లి అని అందరి ముందు ఒప్పుకోండి లేదంటే నేనే నిజం చెప్పేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఉదయాన్నే ఇందూకి పనులు చెబుతున్న భ్రమరాంబ, ఐశ్వర్యలపై మండిపడుతుంది నందూ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.More Articles