Photo Courtesy: Star Maa
స్టార్ మాలో ప్రసారమవుతున్న కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా.. అరుణ ముచ్చర్ల, కమెడియన్ అలీ, నటి శ్రీదేవి విజయ్ కుమార్, స్టార్ చెఫ్ సంజయ్ తుమ్మాలు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో రకరకాల థీమ్స్, వెరైటీ వంటకాలతో జడ్జిలు ఇస్తున్న టాస్క్‌లు.. టెస్ట్‌లో పాస్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ పడుతున్న పాట్లు, వారి అల్లరి ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. తాజాగా ఈ వారానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ అల్లరిని చూస్తే..
ఆషాడ మాసంలో వచ్చే బోనాలు పండుగను పురస్కరించుకుని ప్రత్యేకంగా సిద్ధమైంది కుకు విత్ జాతిరత్నాలు. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్, జడ్జిలు బోనాన్ని నెత్తిన పెట్టుకుని అమ్మవారి ముందు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా సింగర్ మధుప్రియ బోనాలను ఉద్దేశిస్తూ పాడిన పాట ఆకట్టుకుంది. ఈ ఆషాడానికైనా మాకు పప్పన్నం ఏమైనా ఉంటదా? ఉండదా అని యాంకర్ ప్రదీప్‌ని రాకింగ్ రాకేష్ అడుగుతాడు. దాంతో ప్రదీప్ పైకి చూపిస్తూ దేవుడి దయ అన్నట్లుగా సైగలు చేస్తాడు. నీకు పప్పన్నం కావాలి అంతేకదా ఒక ఆర్డర్ ఇచ్చేయ్ ఇంటికెళ్లి తింటాడని కమెడియన్ అలీ సెటైర్లు వేయడంతో అంతా నవ్వేస్తారు.
Photo Courtesy: Star Maa మీ అద్భుతమైన కుటుంబానికి ఇంకో కుటుంబ సభ్యుడు తోడవుతాడని కంటెస్టెంట్స్ చేత కొబ్బరికాయలు కొట్టిస్తాడు ప్రదీప్. అందులో వచ్చే స్లిప్ ఆధారంగా బంధువులు వస్తారని చెబుతాడు. డిమోన్ పవన్‌కి బాబాయ్.. తనూజకి చెల్లి, ఆషిక పదుకొణెకు మామయ్యలు స్లిప్స్‌లో వస్తారు. ఆషికకు మావయ్యగా ముక్కు అవినాష్ వచ్చి ఆమెని ఎత్తుకుని తిప్పుతాడు. చిన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు మావయ్య నీ చంక ఎక్కుతా అనేది, ఇప్పుడు ఎత్తుకోమన్నా ఎత్తుకుంటానని అవినాష్ చెప్పడంతో ఆషిక పదుకొణె పారిపోతుంది. ఇక డిమోన్ పవన్‌కి బాబాయ్‌గా నూకరాజు వస్తాడు. ఈసారి ఊళ్లో జాతర మనమే జరిపిస్తున్నాం, ఈ జాతర బాగా జరిగితే నీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నానని చెబుతాడు నూకరాజు. ఆ మాటతో పవన్ షాక్ అవుతాడు. ఆ వెంటనే తనూజకి చెల్లెలిగా రీతూ చౌదరి వస్తుంది. అది చూసి ఈరోజు వంట వండినట్లే అంటుంది తనూజ. మా అక్క ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఎదురుచూస్తున్నాను. మా అక్కకి ఒక మంచి అబ్బాయి కావాలి ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటే నేను కూడా వెంటనే పెళ్లి చేసేసుకుంటానని చెబుతుంది రీతూ. నిన్ను వాడు పెళ్లి చేసుకోవాలి కదా అని అవినాష్ సెటైర్లు వేస్తాడు. ఆషికా నాకు మేనకోడలు అవుతుంది.. అంటే రీతూ నాకు చెల్లెలు అవుతుంది, పవన్ నీకు తమ్ముడు అవుతాడని అవినాష్ అనడంతో రీతూ షాక్ అవుతుంది. మణికంఠ, రాకింగ్ రాకేష్ వచ్చి డ్యాన్స్ ఇరగదీస్తారు. ఇతను అమ్మాయిలందరికీ ఏమవుతాడని పునర్మవి అడుగుతుంది. అమ్మాయిలందరికీ తమ్ముడు వరుస అవుతాడని చెబుతాడు యాంకర్ ప్రదీప్. నేను ఇప్పుడే ఫారిన్ నుంచి వచ్చాని బిల్డప్ ఇవ్వగా.. మరి ఎప్పుడు వెళ్లిపోతారు అని ప్రదీప్ సెటైర్ వేస్తాడు. ఇతని ఓవరాక్షన్ చూసి ఇవన్నీ వద్దు కానీ ఒక 5 వేలు కొడతాను, ఆయనని బయటికి పంపేయండి అంటాడు నూకరాజు. నేను 10 వేలు ఇస్తాను ముందైతే పంపించండి అని పంచ్ విసురుతుంది జడ్జి శ్రీదేవి విజయ్ కుమార్. పేమెంట్ కంటే ఎక్కువ మరి చూస్కో అని మణికంఠను నూకరాజు టెంప్ట్ చేస్తాడు. తర్వాత కంటెస్టెంట్స్ అందరికీ తిరగలితో నూకలు విసిరే టాస్క్ ఇస్తాడు ప్రదీప్. వీరి అల్లరి, చిలిపి పనులతో సందడి నెలకొంది. మరి శ్రీదేవి ఇచ్చిన ఆఫర్‌కు మణికంఠ ఓకే చెప్పాడా? ఎవరెవరు ఎలాంటి వంటలు చేశారు? తెలియాలంటే జూలై 18, 19వ తేదీలలో ప్రసారమయ్యే కుకు విత్ జాతిరత్నాలు ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.More Articles