దీప్తి సునైన.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. డబ్‌స్మాష్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకుంది దీప్తి. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ చేస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రేంజ్ నుంచి బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి మరింత పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీప్తి సునైన తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

హైదరాబాద్‌కు చెందిన దీప్తి సునైన.. అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఇదే సమయంలో హీరోయిన్‌గా అవకాశాలు కూడా వచ్చినప్పటికీ కొన్ని కారణాలతో ఆమె ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. వ్యక్తిగతంగా ఆమె పెట్టుకున్న కట్టుబాట్లే దీనికి కారణమని సన్నిహితులు చెబుతుంటారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వరకు ఓకే కానీ సినిమాలంటే తనకు ఆసక్తి లేదట.

దీప్తి సునైన మిస్ చేసుకున్న కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. వాటిలో తేజ సజ్జా హీరోగా వచ్చిన జాంబీరెడ్డి, డీజే టిల్లు, బేబీ. వీటిలో దీప్తికి తొలుత హీరోయిన్‌గా చేయమని నిర్మాతలు సంప్రదించారట. అయితే ఆమె మాత్రం కరాకండీగా చెప్పారట. ఒకవేళ వీటిలో కనుక హీరోయిన్‌గా చేసుంటే దీప్తి సునైన మరో స్థాయిలో ఉండేదని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. ఇందులో నిజానిజాలు తెలియకపోయినప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన సోషల్ మీడియా, యూట్యూబ్‌లోనే దీప్తి ముందుకు సాగుతున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఆమె తెలుగు లోగిళ్లకు బాగా చేరువయ్యారు.

Advertisement

తోటి యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. అతనితో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. త్వరలో పెళ్లి అనుకుంటుండగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. షణ్ముఖ్ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దీప్తి బ్రేకప్ చెప్పడం చర్చనీయాంశమైంది. నాటి నుంచి ఇద్దరి దారులు వేరయ్యాయి. రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ షణ్ముఖ్.. పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాడు. ఇటీవల తిరుపతిలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దీప్తి సునైన మాత్రం ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తూ కెరీర్‌లో బిజీగా ఉన్నారు. ఫ్రెండ్స్‌తో విహారయాత్రలు, ఆలయాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వారణాసిత పాటు నేపాల్‌లోని హిమాలయాల పర్వత శిఖరాల వద్ద ట్రెక్కింగ్‌కు వెళ్లారు.

Advertisement

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీప్తి సునైన.. తన షోలు, ఇతర వ్యక్తిగత విషయాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంటారు. తాజాగా వర్షాకాలం కావడంతో తొలకరి చినుకుల్లో తడుస్తూ మాన్‌సూన్ సీజన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు దీప్తి. చీరకట్టుకుని కుర్రాళ్లని కవ్విస్తూ ఉన్న దీప్తి వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అకస్మాత్తుగా ప్రేమ వర్షంలా వినిపించడం మొదలైంది అంటూ ఈ వీడియో ఆమె క్యాప్షన్ పెట్టారు. మరి ఇంకెందుకు ఆలస్యం ట్రెండింగ్‌లో ఉన్న దీప్తి సునైన వీడియోను మీరూ చూసేయండి.

Advertisement