బిగ్‌బాస్ అంతా మాయ.. నన్ను దారుణంగా చూపించారు.. నా తల్లిదండ్రుల బాధపడ్డారు..


బిగ్‌బాస్ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను ఓ వైపు ఆకట్టుకొంటున్నప్పటికీ.. మరోవైపు నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. విమర్శలను పట్టించుకోకుండా పలు భాషల్లో బిగ్‌బాస్ షో దూసుకెళ్తున్నది. హిందీలో 12వ సీజన్, తెలుగు, తమిళంలో 2వ సీజన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు బాబు గోగినేని హిందీ సెలబ్రిటీలు దియాంద్రా సోరేస్, హీనా ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.

బిగ్‌బాస్ షో అంతా నిజం కాదు. ముందస్తు స్క్రిప్టు ప్రకారమే జరుగుతుంది. కావున ప్రజలు ఈ కార్యక్రమాన్ని చూసి సమయాన్ని వృథా చేసుకోకండి. అలాగే ఓటింగ్ కోసం ఎనర్జీని, డబ్బును పాడుచేసుకోవద్దని దియాంద్రా బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. హిందీ బిగ్‌బాస్ షో 10 సీజన్‌లో దియాంద్రా పాల్గొన్నారు.

బిగ్‌బాస్ కార్యక్రమంపై అష్కా గొరాడియా అనే మాజీ పార్టిసిపెంట్ మాట్లాడుతూ.. నా లింగత్వాన్ని తప్పుగా చూపించారు. నాకు లెస్బియన్‌గా ముద్ర వేశారు. అదంతా ఎడిటింగ్ కారణంగానే జరిగింది. అలా చూపించడం నన్ను, నా తల్లిదండ్రులను మనోవేధనకు గురిచేసింది అని పేర్కొన్నారు.

బిగ్‌బాస్ 11 విజేత హీనాఖాన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ ఎడిటింగ్ ట్రిక్కులతో మాయచేస్తారు. అంతేకాని ముందస్తు ప్లాన్ చేసిన కార్యక్రమం కాదు అని పేర్కొన్నారు. అద్భుతమైన ఎడిటింగ్ ప్రతిభకు బిగ్‌బాస్ ఓ సాక్ష్యం అని చెప్పారు. బిగ్‌బాస్ షో విషయంలో నేను ఎవరినీ తప్పుపట్టను అని చెప్పారు.

తెలుగు బిగ్‌బాస్2లో పాల్గొన్న బాబు గోగినేని కూడా బిగ్‌బాస్ కార్యక్రమంపై ఈ మధ్య నిప్పులు చెరిగారు. ఏది నిజం చూపించరు. అంతా ఎడిట్ చేసి రేటింగ్స్ కోసం తప్పుగా చూపిస్తారు అని అన్నారు. ఈ విషయంపై సంజన కూడా తీవ్ర విమర్శలు చేసింది.

బిగ్‌బాస్‌ 4 విజేత, టీవీ యాక్టర్ శ్వేత తివారీ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ ప్రజలకు వినోదాన్ని పంచుతున్నది. దాని గురించి ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకోవడం నా దృష్టికి వచ్చింది. 24 గంటల కార్యక్రమాన్ని చాలా చక్కగా ఎడిట్ చేసి చూపిస్తున్నారు. కొన్నిసార్లు ఎక్కువగా సెలబ్రిటీలు మాట్లాడుకుంటే రెండు లైన్లలో చూపించి వదిలేస్తారు అని అన్నారు.

ఇలాంటి విమర్శలు, మద్దతుతో కూడిన కామెంట్ల మధ్య బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ 12 సీజన్ ప్రారంభం కాబోతున్నది. ఇటీవల 12 సీజన్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్‌ను గోవాలో నిర్వహించారు. బుల్లితెర ప్రేక్షకులు ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Have a great day!
Read more...

English Summary

Bigg Boss 11 runner-up Hina Khan had also called the show “well edited” after she emerged from the house. Former Bigg Boss contestant Aashka Goradia had given an example of how this functions. She had claimed on a TV show that her sexuality was misrepresented on Bigg Boss.