గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు బాలీవుడ్ నటి ఆకాంక్ష చమోలా. భర్త, బిగ్‌బాస్ హిందీ విన్నర్ గౌరవ్ ఖన్నాకు విడాకులు ఇచ్చిన ఆమె.. ప్రస్తుతం లాకప్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఈ షోలో అడుగుపెట్టిన నాటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరోసారి తన వ్యక్తిగత జీవితంపై బాంబు పేల్చారు ఆకాంక్ష చమోలా. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement

లాకప్ 2: సచ్ యే సజా పేరుతో సెకండ్ సీజన్ జూన్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్‌లు తాజా సీజన్‌కు హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. తాజా సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌గా వచ్చారు. రామ్ కపూర్, శివంగి జోషి, ధీరజ్ ధూపార్, హర్షద్ చోప్డా, రియాజ్ అలీ, సూఫి మోతివాలా, ఆకాంక్ష చమోలా, ఆకాంక్ష చౌదరి, సునీతా అహుజా, ప్రమీలా సెరెనా, శ్రేయా కల్రా, యోగేష్ రావత్‌లు పాల్గొంటున్నారు.

Advertisement

గౌరవ్ ఖన్నాతో ప్రేమలో పడిన ఆకాంక్ష చమోలా 2016లో ఆయనతో డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అదే ఏడాది కాన్పూర్‌లో వీరిద్దరికి ఘనంగా వివాహం జరిగింది. నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలను పంచుకుంటూ, విహారయాత్రలలో ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. టెలివిజన్ షోలు, సీరియల్స్, రియాలిటీ షోలు, సినిమాలతో ఇద్దరూ కెరీర్ పరంగానూ బిజీగా ఉన్నారు. హిందీ బిగ్‌బాస్ 19 విజేతగా నిలిచిన గౌరవ్ ఖన్నా మరింత పాపులర్ అయ్యారు.

తాజాగా లాకప్ సీజన్ 2 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఆకాంక్ష చమోలా అడుగుపెట్టారు. ఒకరోజున రిలేషన్స్, విడాకుల అంశంపై కంటెస్టెంట్స్ మధ్య చర్చ జరుగుతుండగా గౌరవ్ ఖన్నాతో విడాకులు తీసుకుంటున్నట్లు బయటపెట్టిన ఆకాంక్ష షాకిచ్చింది. మేమిద్దరం ఏడాది కాలంగా విడివిడిగా ఉంటున్నాం, ఈ విషయాన్ని బయట ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగని మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు, ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటామని ఆకాంక్ష తెలిపారు. వీరిద్దరి విడాకులకు దారి తీసిన కారణాలు ఏంటి అనేది తెలియరాలేదు. అయితే పిల్లల విషయంగానే ఈ జంట విడిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరి బ్రేకప్‌ వ్యవహారం బాలీవుడ్‌‌లో చర్చనీయాంశమయ్యాయి.

Advertisement

ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఆకాంక్ష చమోలా మరో బాంబు పేల్చారు. తాను బై సెక్కువల్ (ద్విలింగ సంపర్కురాలు) అని పేర్కొంది. లాకప్ 2 షో నిబంధనల ప్రకారం .. కంటెస్టెంట్స్ తమ జీవితం గురించి ఎవరికీ తెలియని అంశాలను బయటపెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే నేను పెళ్లికాక ముందు బై సెక్సువల్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆకాంక్ష. పెళ్లికి ముందు చాలామంది అమ్మాయిలతో నాకు సంబంధాలు ఉన్నాయి. అయితే అవి శారీరక బంధం కాదు, కేవలం కొందరితో మాత్రమే రిలేషన్ సాగించాను అని ఆకాంక్ష వెల్లడించారు.

Advertisement

నాకు అమ్మాయిలంటే ఎంతో ఇష్టం.. వారికి సులభంగా ఆకర్షితురాలిని అవుతాను. మేల్ డామినేషన్ వరల్డ్‌లో అమ్మ, అక్కాచెల్లెళ్ల వైపు అమ్మాయిలు ఎక్కువ మొగ్గుచూపుతారు. ఎందుకంటే వారి దగ్గర హాయిగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే వారు నన్ను ఆకట్టుకుంటారు. ఆడవాళ్లతో నా రిలేషన్ గురించి ఈ సమాజం రకరకాల పేర్లు పెట్టినా.. నా దృష్టిలో మాత్రం అది స్వచ్ఛమైన ప్రేమ అని ఆకాంక్ష పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే గౌరవ్ ఖన్నాతో విడాకులు, తాజాగా తన లైంగిక కోరికలకు గురించిన వార్తలు బయటకు రావడంతో ఆకాంక్ష చమోలి నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు.