Gundeninda Gudigantalu:గుండె నిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్‌లో మనోజ్ తన కళ్లు పోతాయేమోనన్న భయంతో ఆందోళన చెందగా, మీనా, శృతి, కుటుంబ సభ్యులంతా అతడికి ధైర్యం చెబుతారు. సత్యం కూడా కష్టసమయంలో ఒకరికి ఒకరు అండగా నిలబడటమే కుటుంబం గొప్పతనమని చెప్పి మనోజ్‌కు భరోసా ఇస్తాడు. మరోవైపు యాక్సిడెంట్ కేసుపై విచారణకు వచ్చిన పోలీసులకు, రూ.30 లక్షలు మోసం చేసిన విల్లా విజయ్‌ను వెంబడించే క్రమంలో ప్రమాదం జరిగిందని మనోజ్ వివరిస్తాడు. అనంతరం రోహిణి, తన కళ్లు ఇచ్చైనా నీ చూపును కాపాడతానంటూ మనోజ్‌ను ఎమోషనల్‌గా ఓదారుస్తుంది.

Advertisement

ఇంట్లో ప్రభావతి మీనాపై విమర్శలు చేయగా, శృతి, సత్యం ఆమెకు గట్టి క్లాస్ పీకుతారు. మనోజ్ చికిత్స ఖర్చులన్నీ బాలు, మీనానే భరించారని చెప్పడంతో ప్రభావతి నోరు మూసుకుంటుంది. హాస్పిటల్‌లో డాక్టర్ కట్లు విప్పి కళ్ల పరిస్థితి బాగానే ఉందని చెప్పడంతో మనోజ్ ఊపిరి పీల్చుకుంటాడు. అయితే చికిత్స బిల్లు బాలు చెల్లించాడని తెలిసినా అతడిపై సెటైర్లు వేస్తాడు. వెంటనే బాలు రూ.2 లక్షలకు పైగా అయిన మొత్తం బిల్లును మనోజ్ చేతిలో పెట్టి షాక్ ఇస్తాడు. అయినా మనోజ్, రోహిణి ఖర్చులపై అనుమానాలు వ్యక్తం చేయడంతో మీనా వారికి గట్టిగా సమాధానం చెబుతుంది. ఈ ఘర్షణల మధ్య ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement