Gunde Ninda Gudi Gantalu:'గుండె నిండా గుడిగంటలు' సోమవారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. విద్య తన బాయ్‌ఫ్రెండ్‌తో ఆలోచనలు కలిసినప్పటికీ, మీనా సలహా తీసుకుంటుంది. ఆమె సలహాతో ప్రేమను వెంటనే వ్యక్తం చేయకుండా మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. మరోవైపు కంటిచూపు రాక ఇబ్బందులు పడుతున్న మనోజ్‌పై బాలు సరదా అల్లరి చేస్తాడు. అతని పాలను బాలు తాగేయడం నవ్వులు పూయించింది. తల్లి ప్రభావతిని పొగిడిన మనోజ్, ఆమె వెళ్లిపోయిందనుకుని వెక్కిరించడంతో ప్రభావతి నిజం తెలుసుకుని బాధపడింది. తర్వాత రోహిణి చెప్పిన క్లయింట్ బదులు ఇంటికి వచ్చిన బిచ్చగాడిని మనోజ్ గౌరవంగా ఆహ్వానించడం, అతని 'జీరో ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్'గురించి ఆసక్తిగా అడగడం ఫన్నీగా సాగింది.
ఆ తర్వాత బాలు దేవుడి ముందు మనోజ్‌తో తన తప్పులన్నీ ఒప్పించి క్షమాపణ చెప్పించాడు. ఆ తరువాత బాలు తన ప్లాన్ ప్రకారం.. నర్స్ ను రప్పించి, కంటి కట్లు విప్పడంతో మనోజ్‌కు మళ్లీ చూపు వస్తుంది. దీంతో కుటుంబ సభ్యులకు ఆనందపడుతారు. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. శృతి తల్లి శోభ ఇంటికి వచ్చి ప్రభావతితో గొడవ పడుతుంది. ఈ సమయంలో బ్లాంక్ చెక్ ఇచ్చి అవమానించే ప్రయత్నం చేసింది. దీనిపై బాలు, మీనా, రోహిణి గట్టిగా ఎదురు నిలవడంతో ఇంట్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శోభ ఎంట్రీతో కొత్త వివాదానికి తెరలేచింది.
Courtesy: jiohotstar అందరూ ఆశ్చర్యపోతుండగా బాలు చెక్ తీసుకుని మొదట రూ.500 అని రాస్తాడు. మనోజ్ "ఇంత తక్కువా?" అని అడగడంతో మరో సున్నా, మరో సున్నా జోడిస్తూ చివరకు రూ.50 కోట్ల వరకు రాస్తాడు. ఆ మొత్తం చూసి శోభ షాక్ అవుతుంది. వెంటనే బాలు ఆ చెక్కును ఆమె ముందే చించి పారేస్తూ, "మమ్మల్ని డబ్బుతో కొనలేరు. మాకు ఆత్మగౌరవం ఉంది. రవి, శృతి కూడా డబ్బు కోసం కాదు... ఆత్మాభిమానంతో జీవించే వాళ్లు" అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తాడు. అయితే శోభ కూడా వెనక్కి తగ్గకుండా, "నా అల్లుడితో నేనే పెద్ద రెస్టారెంట్ పెట్టిస్తా. మీరంతా చూస్తూ ఉండండి" అంటూ సవాల్ విసురుతుంది. దీనికి మీనా, "మీ కూతురు మీ డబ్బు కోసం కాదు... తన కష్టంతో బతకాలనుకుంటోంది. ఆమె మీ మాట వినడం లేదనే కోపంతో ఇక్కడికి వచ్చి రచ్చ చేస్తున్నారు" అంటూ శోభ గాలి తీసేస్తుంది. చివరకు శోభ, "శృతిని రెస్టారెంట్‌లో సర్వర్‌గా పని చేయకుండా ఆపండి" అని ప్రభావతికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శోభ వెళ్లిపోయిన తర్వాత సత్యం తన కుమారుడు బాలను దగ్గరకు పిలిచి, "నిన్ను చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది. ఈరోజు నా గౌరవంతో పాటు మన కుటుంబ పరువును కూడా కాపాడావు" అంటూ భావోద్వేగానికి గురవుతాడు. తండ్రి ప్రశంసలు అందుకున్న బాలు సంతోషంగా ఉండగా, మనోజ్ మాత్రం అసూయతో "నాన్న నిన్నే ఎందుకు మెచ్చుకున్నాడు?" అని అడుగుతాడు. దానికి బాలు, "నీలాంటి వాడినైతే ఆ బ్లాంక్ చెక్‌ను క్యాష్ చేసుకునేవాడు. కానీ నేను మన ఇంటి ఆత్మగౌరవాన్ని డబ్బుకంటే ఎక్కువగా భావించాను. అందుకే ఆ చెక్కును చించి ఆమె అహంకారానికి సమాధానం చెప్పాను. ఇది మన కుటుంబ పరువు సమస్య" అంటూ స్పష్టంగా చెప్పడంతో మనోజ్ నోరు మూసుకుంటాడు. మరోవైపు.. సుమతి, కానిస్టేబుల్ అరుణ్ కలిసి గుడికి వెళ్తారు. ఆలస్యంగా వచ్చిన సుమతి సరదాగా, "నా మీద ఫైన్ మాత్రం వేయొద్దు" అని చెప్పడంతో అరుణ్, "డ్యూటీ వేరు... పర్సనల్ లైఫ్ వేరు. డ్యూటీలో కఠినంగా ఉంటాను కానీ వ్యక్తిగత జీవితంలో నేను కూడా సాధారణ మనిషినే" అని చెప్పడంతో సుమతి అతని మాటలకు ఇంప్రెస్ అవుతుంది. ఇద్దరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుడి ఆశీర్వాదం తీసుకుంటారు. అదే సమయంలో విద్య, మురళి కూడా గుడికి వస్తారు. విద్య తన ప్రేమను ఎప్పుడు అంగీకరిస్తుందా అని మురళి ఆతృతగా ఎదురుచూస్తుంటాడు. విద్య తనకు కనిపిస్తే సమస్యలు వస్తాయని భావించిన సుమతి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఈలోపు ఒంటరిగా ఉన్న అరుణ్‌తో మాట్లాడిన మురళి, తాను ప్రేమిస్తున్న అమ్మాయికి తన మనసులోని మాట చెప్పలేకపోతున్నానని చెబుతాడు. దానికి అరుణ్, "ప్రేమ అంటే ధైర్యం. సరైన సమయంలో చెప్పకపోతే తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మనసులో ఉన్న మాటను ఆలస్యం చేయకుండా చెప్పేయ్" అంటూ అతనికి ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. అరుణ్ మాటలు విన్న మురళి వెంటనే విద్య దగ్గరకు వెళ్లి ప్రేమను వ్యక్తం చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ టెన్షన్‌తో "ఐ... ఐ..." అని మాత్రమే చెప్పగలుగుతాడు. దానికి విద్య నవ్వుతూ, "మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ మీరు అనుకున్నది జరుగుతుంది. అయితే ఇలాంటి విషయాల్లో తొందరపడకండి... కాస్త ఓపిక పట్టండి" అంటూ పరోక్షంగా పాజిటివ్ సంకేతాలు ఇస్తుంది. దీంతో మురళిలో కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్య వెళ్లిపోయిన తర్వాత సుమతి మళ్లీ అరుణ్‌ను కలుస్తుంది. ఈ సందర్భంగా అరుణ్ తన ప్రేమ గురించి ఏమి ఆలోచించావని అడుగుతాడు. దానికి సుమతి, "మిమ్మల్ని చూసింది ఈ మధ్యకాలంలోనే. మీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి నాకు ఇంకొంత సమయం కావాలి. ముందుగా మంచి స్నేహితులుగా ఉంటాం. సరైన సమయం వచ్చినప్పుడు నా మనసులోని మాట నేనే చెబుతాను" అని సమాధానం ఇస్తుంది. ఆమె మాటలు విన్న అరుణ్, "నీ సమాధానం కోసం నేను ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాను" అని చెప్పడంతో వారి ప్రేమకథ మరో అడుగు ముందుకు పడుతుంది. సుందరి పెళ్లి బడ్జెట్‌లో కామెడీ శృతి విషయంలో మళ్లీ రచ్చ
గుండె నిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగింది. రవి-శృతి విషయాన్ని ఎలాగైనా తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన శోభ మరోసారి ప్రభావతి ఇంటికి వచ్చి గొడవకు దిగుతుంది. ఈ క్రమంలో మీనా, బాలు చేసే పనులను తక్కువ చేసి మాట్లాడుతుంది. దీంతో మీనా ఘాటుగా స్పందిస్తూ, "కష్టపడి సంపాదించి బతకడం తప్పు కాదు. మేమెవరిపైనా ఆధారపడటం లేదు. మా కష్టార్జితంతోనే జీవిస్తున్నాం" అంటూ గట్టి సమాధానం ఇస్తుంది. అయినా తగ్గని శోభ, డబ్బుతో అందరినీ కొనగలనన్న అహంకారంతో బాలు చేతిలో బ్లాంక్ చెక్ పెడుతుంది.
మరోవైపు సుందరి పెళ్లి ఏర్పాట్లు మొదలవుతాయి. రంగా ఇంట్లో బాలు, మీనా, రోహిణి కలిసి పెళ్లి ఖర్చుల లెక్కలు వేస్తుంటారు. ఈ సమయంలో మీనాక్షి అకస్మాత్తుగా "నాకు ముందు నాలుగు పట్టుచీరలు కావాలి" అని చెప్పడంతో రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "ముందు పెళ్లికి అవసరమైన ఖర్చులు చెప్పు... తర్వాత నీ కోరికలు" అంటూ మందలిస్తాడు. పూల అలంకరణకు రూ.20 వేల అవసరమని మీనా చెప్పగా రంగా రూ.30 వేలుగా నమోదు చేస్తాడు. బాలు, రోహిణి చేసే పనులకు కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తాడు. ఇదే సమయంలో వరుడి తరఫు బంధువు మాణిక్యం ఫోన్ చేసి పెళ్లి పనులు ప్రారంభించామని, ఫర్నిచర్ కూడా కొనుగోలు చేస్తున్నామని చెబుతాడు. అతని గొంతు విన్న బాలు, మీనా కాస్త అనుమానం వ్యక్తం చేసినా, పెళ్లి దగ్గరపడుతున్నందున ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారు.
ఇదిలా ఉండగా శృతి తల్లి శోభ మరోసారి ప్రభావతికి ఫోన్ చేసి, తన కూతురు రెస్టారెంట్ ఉద్యోగం మానేయాలని మాట్లాడారా లేదా అని నిలదీస్తుంది. దీంతో ప్రభావతి ఇక ఈ విషయాన్ని తేల్చేయాలని నిర్ణయించుకుని ఇంట్లో వారందరినీ హాల్లోకి పిలుస్తుంది. ముందుగానే బాలను హెచ్చరిస్తూ, "నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు" అని చెబుతుంది. అయితే బాలు మాత్రం నిజం దాచకుండా జరిగిన విషయాలన్నింటినీ బయటపెడతాడు. దీంతో శృతి ఉద్యోగం, శోభ ప్రవర్తన, కుటుంబ గౌరవం అంశాలపై ఇంట్లో మరోసారి పెద్ద గొడవ మొదలవుతుంది. ఎపిసోడ్ చివర్లో ప్రభావతి ఏ నిర్ణయం తీసుకుంటుంది? శృతి ఉద్యోగంపై కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయానికి వస్తారా? లేక శోభ కారణంగా మరో కొత్త వివాదం తలెత్తుతుందా? అనే ఉత్కంఠతో కథ ముగియడంతో తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది.More Articles