Photo Courtesy: JioHotstar

Gunde Ninda Gudi Gantalu: మీరు చదువు మధ్యలో మానేయకుండా ఉంటే ఎంతో గొప్ప స్థాయిలో ఉండేవారని బాలుతో మీనా అంటుంది. నేను చదివి పెద్ద ఆఫీసర్ అయ్యుంటే నీలాంటి మంచి భార్య నా జీవితంలోకి వచ్చేది కాదని భార్యపై ప్రశంసలు కురిపిస్తాడు బాలు. ఇద్దరికీ పెద్ద పెద్ద ఆర్డర్స్ రావడంతో బాలు, మీనా సంతోషిస్తారు. డబ్బు కంటే మనశ్శాంతే ముఖ్యమని మీనా అంటుంది. ప్రభావతికి చింతామణి ఫోన్ చేసి మీనాకు వచ్చిన 10 లక్షల రూపాయల ఆర్డర్ గురించి చెప్పగానే ప్రభావతి కుళ్లుకుంటుంది. అయితే మీనా తీసుకునే చివరి ఆర్డర్ ఇదే, ఇక జీవితంలో పూల డెకరేషన్ అనే మాట ఎత్తదు అంటూ తన ప్లాన్ బయటపెడుతుంది.

Advertisement

చింతామణి మాటలు విన్న ప్రభావతి ఆనందానికి అవధులు ఉండవు. మీనాని పిలిచి క్యాలీఫ్లవర్ పకోడీలు చేసి పెట్టమని సెటైర్లు వేస్తుంది. బాలు ట్రిప్ కోసం వేరే చోటికి వెళ్తున్నట్లు చెప్పడంతో మీనాకు బుద్ధి చెప్పడానికి ఇదే మంచి టైం అనుకుంటుంది ప్రభావతి. తన కాంట్రాక్ట్‌కు కావాల్సిన లోన్ కోసం బ్యాంక్ మేనేజర్‌ని కలుస్తుంది మీనా. అయితే లోన్ రావడం సాధ్యమని అతను చెప్పడంతో మీనా షాక్ అవుతుంది. అక్కడే ఉన్న ఓ ఉద్యోగి.. సింగరాజు అనే ఫైనాన్సర్ గురించి చెబుతాడు. బాలు చెప్పినట్లు రవి- శృతిలు మీనాకు కావాల్సిన డబ్బును సర్దుబాటు చేస్తామని మాటిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. మరి జూలై 17వ తేదీ 729వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Advertisement

Photo Courtesy: JioHotstar

బ్యాంక్ ఉద్యోగి చెప్పినట్లు ఫైనాన్సియర్ సింగరాజు దగ్గరికి వెళ్తుంది మీనా. నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఎలాంటి ఆస్తి పత్రాలు లేవు, కానీ తీసుకున్న డబ్బుని వడ్డీతో సహా తిరిగి ఇవ్వగలను అని చెబుతుంది నువ్వు ఎలా కడతావని సింగరాజు అడగ్గా.. నేను ఫంక్షన్స్‌కి డెకరేషన్ చేస్తుంటాను, ఇవాళ పెట్టుబడి పెడితే రేపు ఖచ్చితంగా లాభం వస్తుంది. 10 లక్షల విలువైన ఆర్డర్ వచ్చింది.. కానీ నా దగ్గర పెట్టుబడికి డబ్బు లేదు, కానీ ఆర్డర్ పొగొట్టుకోలేక మీ దగ్గరికి వచ్చానని చెబుతుంది మీనా. ఒక ఆడపిల్ల మూర మల్లెపూలు అమ్ముకునే స్థాయి నుంచి 10 లక్షలు విలువైన ఆర్డర్ అందుకునే స్థాయికి వచ్చిందంటే గర్వంగా ఉందని మీనాని మెచ్చుకుంటాడు సింగరాజు. అయితే అతను చింతామణి భర్త అన్న సంగతి మీనాకి తెలియదు.

Advertisement

నన్ను వెతుక్కుంటూ వచ్చావు, నీ ముఖం చూస్తే కాదనలేకపోతున్నానని 10 లక్షల రూపాయల్ని అప్పుగా ఇస్తాడు సింగరాజు. డెకరేషన్ పూర్తయి బిల్లు రాగానే వడ్డీతో సహా తీరుస్తానని చెబుతుంది మీనా. తనకు వచ్చిన ఆర్డర్ కోసం డెకరేషన్ అద్భుతంగా చేస్తుంది మీనా. ఇదంతా చూసిన చింతామణి అసిస్టెంట్ ఆశ్చర్యపోతాడు. మీనా చేసిన డెకరేషన్‌ని వీడియో తీసి ఆమెకు చూపిస్తాడు. క్లయింట్ చాలా సంతోషిస్తాడు.. క్లయింట్ దృష్టిలో ఆర్డర్ నాది, అక్కడ పనిచేసేవాళ్లలో మీనా కూడా ఒక కూలీ అంటుంది. మీనా బాగా చేసిందని అసిస్టెంట్ చెప్పడంతో చింతామణి లాగిపెట్టి కొడుతుంది. ఈ బిజినెస్‌ని మీనా వదిలేసి పారిపోయేలా ప్లాన్ చేశానని చెబుతుంది చింతామణి.

Advertisement

తను చేసిన డెకరేషన్‌ని బాలుకి వీడియో కాల్ చేసి చూపిస్తుంది మీనా. చాలా బాగా చేశావని భార్యను మెచ్చుకుంటాడు బాలు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందని ప్రశంసిస్తాడు. ఆ ఆనందం నీ పక్క నుంచి చూడలేకపోయానని బాధపడతాడు. డబ్బులు రాగానే ముందు ఆ ఫైనాన్సియర్‌కి ఇచ్చేయమని చెబుతాడు బాలు. నేను ఎక్కడున్నా నా ఆలోచనలు నీ చుట్టూనే ఉంటాయని అంటాడు. మీరు జాగ్రత్తగా తిరిగిరండి అని చెబుతుంది మీనా. వీళ్లు ఇక్కడ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు.. నాకు కూడా నేర్చుకోవాలని ఉందని అంటాడు బాలు. భర్త ముద్దు అడగటంతో లైవ్ వీడియోలోనే ముద్దు పెడుతుంది మీనా.

Advertisement

డెకరేషన్ చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారని, కొందరు నీ నెంబర్ కూడా తీసుకున్నారని చెబుతాడు క్లయింట్. మీకు మాట రాకూడదని రాత్రి పగలు కష్టపడ్డామని చెబుతుంది మీనా. క్లయింట్ వెళ్లబోతుండగా నా డబ్బులు అని అడుగుతుంది మీనా. ఏం డబ్బులు అని క్లయింట్ అనడంతో మీనా షాక్ అవుతుంది. మొత్తం 10 లక్షల రూపాయల ఆర్డర్.. అడ్వాన్స్ కింద లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన 9 లక్షలు ఇవ్వమని బతిమలాడుతుంది మీనా. మొత్తం 10 లక్షలు ముందే ఇచ్చానని క్లయింట్ చెప్పడంతో షాక్ అవుతుంది. ఎక్కడా రూపాయి కూడా తేడా రాలేదని అగ్రిమెంట్ కూడా చూపిస్తాడు. అందులో 10 లక్షల రూపాయలు ముట్టినట్లుగా ఉండటంతో మీనా ఉలిక్కిపడుతుంది.

Advertisement

మిమ్మల్ని నమ్మి 10 లక్షల రూపాయల్ని అప్పుగా తీసుకొచ్చాను.. నన్ను నమ్మి ఎంతమంది ఆడవాళ్లు వచ్చి పనిచేశారో చూశారా? అని నిలదీస్తుంది మీనా. మా అందరి కష్టం దోచుకుంటారా? మా వాళ్లతో చదివించుకుని సంతకం చేస్తానంటే టైం లేదని నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తారా అని బాధపడుతుంది మీనా. నేను సంతకం లేనప్పుడు లేని సున్నా.. ఇప్పుడు కొత్తగా ఎప్పుడొచ్చింది అని మీనా నిలదీస్తుంది. నీకు నేను రూపాయి ఇచ్చేది లేదు.. మర్యాదగా వెళ్లిపోమని క్లయింట్ తేల్చేస్తాడు. ఇంతపెద్ద ఆర్డర్ వచ్చిందని నా భర్తకు చెప్పుకుని మురిసిపోయాను, ఈ వృత్తిలో నిలదొక్కుకుంటానని అనుకున్నాను. ఒక పెద్ద మనిషి నన్ను నమ్మి ఈ ఆర్డర్ కోసం అప్పు ఇచ్చారు, అంతమంది ఆడవాళ్లు వచ్చి పనిచేశారు.. అంత అప్పు ఎలా కట్టాలో అర్ధం కావడం లేదు, నా డబ్బు నాకు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలనని చొక్కా పట్టుకుంటుంది మీనా. దాంతో మీనాను ఈడ్చుకెళ్లి రోడ్డు మీద పడేస్తారు. ఇదంతా చూసిన చింతామణి సంబరపడిపోతుంది. ఈ దెబ్బతో మీనా జీవితంలో కోలుకోలేదని అసిస్టెంట్‌తో అంటుంది. మీరు చెప్పినట్లే చేశాను.. ఇలాంటి ప్లాన్‌తో మీనాను దెబ్బకొడతారని అనుకోలేదని చెబుతాడు క్లయింట్.

ప్రభావతికి చింతామణి ఫోన్ చేసి మీనా బిజినెస్ మొత్తం మూతపడిపోయిందని చెబుతుంది. మీనా ఏడుస్తూ ఇంటికొస్తుందని చింతామణి చెప్పడంతో ప్రభావతి సంతోషిస్తుంది. ఈ చింతామణికి ఎదురొస్తే తొక్కేస్తానని చెబుతుంది. ఇన్నాళ్లూ నా ముందు ఎంత పొగరుగా తిరిగింది.. ఇకపై దానికి నేనేంటో చూపిస్తానని అనుకుంటుంది ప్రభావతి. రవికి ఫోన్ చేసి ఈరోజు ఇంట్లో వంట చేయడం లేదు.. వచ్చేటప్పుడు ప్యాక్ చేసి తీసుకురమ్మని చెబుతుంది ప్రభావతి. నాకొక శుభవార్త తెలిసింది, ఇంట్లో పండగ చేసుకోవాలని ఉందని అంటుంది. దాంతో రవికి డౌట్ వస్తుంది. ఇంతలో శృతి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. మా అమ్మ హోటల్ నుంచి పార్శిల్ తీసుకురమ్మందని రవి చెప్పడంతో ఇంట్లో ఏదో ప్రళయం రాబోతోందని అంటుంది శృతి. మీ అమ్మ హ్యాపీగా ఉందంటే ఇంట్లో బాలు- మీనాకి ఏదో ప్రాబ్లమ్ రాబోతోందని చెబుతుంది.

మీనా.. కళ్యాణ మంటపం ఓనర్ దగ్గరికి వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది. దాంతో మేనేజర్‌ని పిలిపించి నిలదీస్తాడు ఓనర్. మనం ఇచ్చిన మొత్తం అమౌంట్ తీసుకుని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిందని చెబుతాడు. నేను లక్ష రూపాయలు మాత్రమే తీసుకున్నాను.. మిగిలిన మొత్తం తర్వాత ఇస్తానని చెప్పారని అంటుంది మీనా. దాంతో అగ్రిమెంట్ తీసి చూపిస్తాడు మేనేజర్. అది చూడగానే నన్ను మోసం చేసి సంతకం పెట్టించుకున్నారని అంటుంది మీనా. డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇవ్వలేదని చెబితే ఎలా? ఈవిడ భర్త తాగేశాడో లేక ఈమె ఎక్కడైనా పడేసిందోనని నానామాటలు అంటాడు. దాంతో కోపంతో రగిలిపోయిన మీనా.. నా భర్త గురించి మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. పగలంతా కష్టపడి కారు నడిపే మనిషి అంటుంది మీనా. ఈ గొడవ మొత్తం విన్న ఓనర్.. ఇలాంటి పనులు చింతామణికి ఇస్తావు కదా? అని చెబుతాడు. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుని ఇచ్చానని కవర్ చేస్తాడు మేనేజర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.