Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో మీనా జీవితంలో భారీ షాక్ ఎదురైంది. పది లక్షల కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి ఫైనాన్షియర్ సింగరాజు వద్ద నుంచి 9 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. తన కష్టాన్ని గుర్తించిన సింగరాజు డబ్బు ఇచ్చాడు. అయితే అతడే చింతామణి భర్త అని ఫ్యామిలీ ఫొటో చూసి మీనా తెలుసుకుంటుంది. మరోవైపు మీనా చేసిన డెకరేషన్‌ను చూసి అందరూ ప్రశంసిస్తారు. కానీ చింతామణి మాత్రం అసూయతో రగిలిపోతుంది. మీనాను బిజినెస్ నుంచి పూర్తిగా తప్పించాలని ప్లాన్ వేస్తుంది. పని పూర్తయ్యాక మిగిలిన 9 లక్షల రూపాయలు అడగడానికి వెళ్లిన మీనాకు షాక్ తగులుతుంది. ఈవెంట్ మేనేజర్ తాను ఇప్పటికే పది లక్షలు ఇచ్చానని చెబుతాడు.

Advertisement

అగ్రిమెంట్‌లో కూడా అలాగే సంతకం ఉందని చూపిస్తాడు. తాను మోసపోయానని మీనా గ్రహించి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదంతా చూసి చింతామణి ఆనందపడుతుంది. ప్రభావతికి ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది. దీంతో ప్రభావతి కూడా సంబరపడుతూ ఇంట్లో పండుగ చేసుకోవాలని నిర్ణయిస్తుంది. అటు శ్రుతికి మాత్రం ప్రభావతి ప్రవర్తనపై అనుమానం వస్తుంది. బాలు, మీనాకు ఏదో కష్టం వచ్చి ఉంటుందని భావిస్తుంది. చివరగా మీనా ఫంక్షన్ హాల్ ఓనర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయం చెబుతుంది. కానీ మేనేజర్ అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు, మీనా భర్త గురించి కూడా అవమానకరంగా మాట్లాడటంతో మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.

Advertisement

Courtesy: jiohotstar

'గుండె నిండా గుడిగంటలు' సోమవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో సాగింది. చింతామణి వేసిన కుట్రలో మీనా పూర్తిగా చిక్కుకోవడం, తాను చేయని తప్పుకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. మరోవైపు ఏమీ తెలియకుండా బాలు భార్యను పొగడ్తలతో ముంచెత్తడం ఎపిసోడ్‌కు మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చింది. 10 లక్షల డెకరేషన్ ఆర్డర్‌ను విజయవంతంగా పూర్తి చేశానని ఆనందపడుతున్న మీనాకు ఊహించని షాక్ ఎదురవుతుంది. ఫంక్షన్ హాల్ మేనేజర్, చింతామణితో చేతులు కలిపి ఆమెను మోసం చేస్తాడు. డబ్బులు ఇవ్వకుండా, పైగా మొత్తం చెల్లించేశామని అబద్ధం చెప్పి మీనాను ఇరికించే ప్రయత్నం చేస్తాడు. జరిగిన విషయం చెప్పేందుకు మీనా ఫంక్షన్ హాల్ యజమాని దగ్గరకు వెళ్లినా, ఆమె మాటలను వినడానికి ఆయన ఏమాత్రం ఆసక్తి చూపించడు.

Advertisement

"సార్.. నేను కష్టపడి పని చేశాను. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చింతామణితో కలిసి మేనేజర్ నన్ను మోసం చేశాడు. నేను సంతకం చేసిన అగ్రిమెంట్‌లో రూ.1 లక్ష మాత్రమే తీసుకున్నట్లు ఉంది. కానీ ఇప్పుడు దానిని మార్చి రూ.10 లక్షలు తీసుకున్నట్లు చూపిస్తున్నారు" అంటూ మీనా కన్నీటి పర్యంతమై వివరిస్తుంది. అయితే వెంటనే మేనేజర్ మధ్యలో కలుగజేసుకుని, "సార్.. ఈమె కథలు చెబుతోంది. నేను ఇప్పటికే రూ.10 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ డబ్బులు అడుగుతోంది" అంటూ అబద్ధం చెబుతాడు.

ఎవరి మాట నిజమో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఫంక్షన్ హాల్ యజమాని మీనాపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "ఇలాంటి వాళ్లను పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. కొత్త వాళ్లను నమ్మితే ఇలాంటి సమస్యలే వస్తాయి. బయట ఎవరికైనా ఈ కథలు చెప్పు.. నాకు పని ఉంది" అంటూ కఠినంగా మాట్లాడతాడు. అంతేకాకుండా మేనేజర్‌ను పిలిచి, "ఈ అమ్మాయిని బయటకు పంపించండి" అని సెక్యూరిటీకి ఆదేశిస్తాడు.

Advertisement

అయినా కూడా మీనా చివరి వరకు తన నిజాయితీని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. "సార్.. నేను అబద్ధం చెప్పడం లేదు. నా వెనుక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈ డబ్బులు రాకపోతే వాళ్లందరూ రోడ్డున పడతారు. ఒక్కసారి నిజం ఏంటో తెలుసుకోండి" అంటూ ఎంత వేడుకున్నా యజమాని వినిపించుకోడు. చివరకు సెక్యూరిటీ ఆమెను బయటకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుంది. దీంతో మీనా తీవ్ర మనోవేదనకు గురవుతుంది.

బయటకు వచ్చిన తర్వాత ఒంటరిగా నిలబడి కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. "నేను ఎలాంటి తప్పు చేయలేదు. నా నిజాయితీని తప్పకుండా నిరూపించుకుంటాను. నన్ను మోసం చేసిన వాళ్లందరికీ సమాధానం చెబుతాను. కానీ ముందు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు" అంటూ బాధపడుతుంది. చింతామణి వేసిన ప్లాన్ ఎంత పెద్దదో ఇప్పుడు మీనాకు పూర్తిగా అర్థమవుతుంది.

Advertisement

ఇలాంటి పరిస్థితిలోనే బాలు నుంచి వీడియో కాల్ వస్తుంది. కాల్ చూసిన మీనా ఒక్కసారిగా భయపడుతుంది. జరిగిన విషయం భర్తకు ఎలా చెప్పాలా అనే ఆందోళనతో మొదట కాల్ ఎత్తడానికి కూడా వెనుకాడుతుంది. కానీ చివరకు ధైర్యం చేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. అక్కడ బాలు మాత్రం ఎంతో సంతోషంగా కనిపిస్తాడు. అతనితో పాటు ఉన్న ప్రయాణికులు కూడా మీనా గురించి గొప్పగా మాట్లాడుతారు. "మీనా నిజంగా సూపర్ ఉమెన్. ఇంత పెద్ద ఆర్డర్లు తీసుకుని విజయవంతంగా పూర్తి చేయడం చిన్న విషయం కాదు" అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఆ మాటలు విన్న బాలు కూడా గర్వంతో ఉప్పొంగిపోతాడు.

Advertisement

"ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని అంటారు. నా విజయం వెనుక మాత్రం మీనా ఉంది. నేను లేకపోయినా లక్షల రూపాయల ఆర్డర్లు ఈజీగా పూర్తి చేస్తుంది. ఒకప్పుడు గుడి దగ్గర పూలు అమ్ముకునే స్థాయి నుంచి నేడు లక్షల విలువైన డెకరేషన్ ఆర్డర్లు చేసే స్థాయికి ఎదిగింది. అది నాకు చాలా గర్వంగా ఉంది" అంటూ భార్యను ఆకాశానికి ఎత్తేస్తాడు.

కానీ బాలు మాటలు వింటున్న మీనా మాత్రం లోపల ఎంతో బాధతో కుంగిపోతుంది. నిజం చెప్పలేక, భర్త ఆనందాన్ని చెడగొట్టలేక మౌనంగా ఉంటుంది. ఒక్క మాట కూడా సరిగా మాట్లాడకుండా "నాకు కొంచెం పని ఉంది" అంటూ కాల్‌ను త్వరగా ముగిస్తుంది. మీనా ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పును గమనించిన బాలు ఒక్కసారిగా అనుమానపడతాడు. "ఎప్పుడూ ఇలా మాట్లాడదు.. ఏదో జరిగింది" అని మనసులో అనుకుంటాడు.