Gunde Ninda Gudi Gantalu Weekly Roundup: గుండె నిండా గుడిగంటలు ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జూన్ 29వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు 715 నుంచి 719వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

Advertisement

సోమవారం ఎపిసోడ్ వరుస ట్విస్టులతో ప్రేక్షకులను అలరించింది. చింతామణి రెచ్చగొట్టడంతో ప్రభావతి, మీనాపై మరింత కోపంతో ఊగిపోతూ ఆమె పూల వ్యాపారంతో పాటు డ్రైవింగ్ స్కూల్‌ను కూడా మూసివేయిస్తానని సవాల్ విసురుతుంది. ఇదే సమయంలో బాలు, మీనా హాల్లో ఆవిరి పట్టుకుంటుండగా ప్రభావతి గొడవకు దిగడం, వారికి ప్రత్యేక గది ఇవ్వాలని శృతి గట్టిగా నిలదీయడం కుటుంబంలో కొత్త ఉద్రిక్తతకు దారితీస్తుంది. మరోవైపు డ్రైవింగ్ స్కూల్‌లో బాలు గురువుగా మారి మీనాకు కారు నడపడం నేర్పుతాడు. ఆమె వేగంగా నేర్చుకోవడంతో ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. రెస్టారెంట్‌లో శృతి పనితీరును బాస్ ప్రశంసించగా, రవితో చిన్నపాటి వాగ్వాదం కూడా జరుగుతుంది.

Advertisement

Jio Hotstar

ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా ట్రాఫిక్ కానిస్టేబుల్ అరవింద్ ఎంట్రీ నిలిచింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన అరవింద్ బైక్‌కు బాలు వీల్ లాక్ వేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంటుంది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అరవింద్ ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే సమయంలో సుందరి-కిషోర్ పెళ్లి ఏర్పాట్లు మొదలుకాగా, రంగారావు కుటుంబ సభ్యులకు బాధ్యతలు అప్పగిస్తాడు. మీనా ఫ్లవర్ డెకరేషన్, బాలు ట్రాన్స్‌పోర్ట్, రవి క్యాటరింగ్, రోహిణి బ్రైడల్ మేకప్ బాధ్యతలు తీసుకుంటారు. అయితే చివర్లో వరుడి మేనమామకు మటన్ షాప్ ఉందని రంగారావు చెప్పడంతో బాలు షాక్‌కు గురవడం, రాబోయే ఎపిసోడ్‌లపై ఉత్కంఠను పెంచింది.

Advertisement

మంగళవారం ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. సుందరి పెళ్లి ఏర్పాట్ల బాధ్యతలను రంగారావు కుటుంబ సభ్యులకు అప్పగించగా, ట్రాన్స్‌పోర్ట్ బాధ్యత బాలుకు దక్కుతుంది. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో మనోజ్ హంగామా చేయడంతో పోలీసులు అతడిని గట్టిగా హెచ్చరించి పంపిస్తారు. ఇదే సమయంలో బాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ట్రాఫిక్ కానిస్టేబుల్ అరవింద్‌కు పెద్ద సమస్యగా మారుతుంది. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వీడియోలో వైరల్ కావడంతో అధికారులు అతడిని మూడు రోజుల పాటు సస్పెండ్ చేస్తారు. తల్లి ఆరోగ్యం బాగోలేక అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చిందని అరవింద్ చెప్పినా అధికారులు పట్టించుకోరు. దీంతో బాలుపై ప్రతీకారం తీర్చుకోవాలని అరవింద్ నిర్ణయించుకుంటాడు.

Advertisement

ఇక విద్య తన ప్రేమ విషయం గురించి మీనాతో మాట్లాడగా, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలంటే ఇద్దరూ ఒకే ప్రశ్నలకు విడివిడిగా సమాధానాలు రాయాలని మీనా ఇచ్చిన సలహా ఆమెకు నచ్చుతుంది. ఈ విషయాన్ని చూసిన రోహిణి మాత్రం అసూయతో రగిలిపోతుంది. సుమతి అరవింద్‌కు ధైర్యం చెబుతూ, సస్పెన్షన్‌ను కుటుంబంతో గడిపే అవకాశంగా తీసుకోవాలని సూచిస్తుంది. బాలు అరవింద్ సస్పెన్షన్‌పై సంతోషపడగా, అసలు పరిస్థితి తెలుసుకోకుండా ఎవ్వరినీ తప్పుబట్టకూడదని మీనా గట్టిగా మందలిస్తుంది. దీంతో బాలు తన తప్పును గ్రహిస్తాడు. చివర్లో డాన్స్ అకాడమీలో చింతామణి మాటలకు ప్రభావతి సవాల్ విసరడంతో కొత్త కుటుంబ ఘర్షణకు తెరలేస్తూ ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement

బుధవారం ఎపిసోడ్ ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఆకట్టుకుంది. డాన్స్ అకాడమీలో చింతామణి మాటలకు రెచ్చిపోయిన ప్రభావతి, మూడు నెలల్లో బరువు తగ్గి చూపిస్తానంటూ సవాల్ విసిరింది. ఇంటికి వచ్చిన వెంటనే డైటీషియన్ వివరాల కోసం మనోజ్‌కు ఫోన్ చేస్తుంది. మరోవైపు చింటూ స్కూల్ పేరెంట్స్ మీటింగ్‌కు రావాలని సుగుణమ్మ చెప్పడంతో, అక్కడ బాలు, మీనా కనిపిస్తారనే భయంతో రోహిణి తీవ్ర ఆందోళన చెందుతుంది. ఆవేశంలో "చింటూ అమ్మ చనిపోయిందని చెప్పేయ్" అని చెప్పడంతో సుగుణమ్మ షాక్ అవుతుంది. ఇక బాలు మీనాకు డ్రైవింగ్ నేర్పిస్తుండగా, ఆమె వేగంగా నేర్చుకోవడంతో స్నేహితులు ప్రశంసలు కురిపిస్తారు.

Advertisement

మార్కెట్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అరవింద్‌తో బాలుకు వాగ్వాదం జరగగా, తోపులాటలో అరవింద్ షర్ట్ చిరిగిపోతుంది. దీంతో బాలుపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని అతడు నిర్ణయించుకుంటాడు. ఇదే సమయంలో ఇంట్లో డైట్ చేస్తున్నానని చెప్పిన ప్రభావతి, మీనా చేసిన గారెలు, చికెన్ వాసనకు ఆగలేక దొంగచాటుగా తింటూ మనోజ్‌కు చిక్కిపోతుంది. చివర్లో చింటూని స్కూల్‌కు తీసుకెళ్తున్న సుగుణమ్మకు ఆటో దొరకకపోవడంతో రోడ్డుపైకి పరిగెత్తిన చింటూని మనోజ్ కారు ఢీకొట్టే ప్రమాదం తృటిలో తప్పుతుంది. అనంతరం వారిని స్కూల్‌కు తీసుకెళ్లేందుకు మనోజ్ ముందుకు రావడంతో, పేరెంట్స్ మీటింగ్‌లో రోహిణి దాచిన నిజం బయటపడుతుందేమో అన్న ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

గురువారం ఎపిసోడ్ ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్కూల్ పేరెంట్స్ మీటింగ్‌కు చింటూని మనోజ్ తన కారులో తీసుకురావడం చూసిన బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. చింటూ తన తల్లి విదేశాల్లో ఉందని చెప్పడంతో సుగుణమ్మ వెంటనే మాట మార్చి పరిస్థితిని చక్కదిద్దుతుంది. ఇదే సమయంలో రోహిణి తన అసలు గుర్తింపు బయటపడకుండా విగ్, మాస్క్, కళ్లద్దాలతో వీడియో కాల్ ద్వారా మీటింగ్‌లో పాల్గొంటుంది. ఆమె తరఫున విద్య మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పినా, వీడియో కాల్‌లో తన తల్లి రూపం మారిపోయిందని చింటూ అమాయకంగా చెప్పడం అందరిలో కొత్త సందేహాలకు కారణమవుతుంది.

మీటింగ్ అనంతరం కూడా చింటూ అదే విషయాన్ని బాలు, మీనాలకు చెప్పడంతో సుగుణమ్మ ప్రవర్తనపై వారి అనుమానాలు మరింత పెరుగుతాయి. ఒకవేళ చింటూ తండ్రి మనోజే అయి ఉంటాడేమోనని మీనా అనుమానం వ్యక్తం చేస్తే, ఆధారాలు లేకుండా నిర్ణయానికి రావద్దని బాలు సూచిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సత్యం కూడా వీడియో కాల్‌లో చింటూ తల్లి మాస్క్ ధరించడం విచిత్రంగా ఉందని అభిప్రాయపడతాడు. వెంటనే మనోజ్ ఆమెను సమర్థిస్తూ మాట్లాడటం బాలు, మీనాలకు మరింత అనుమానం కలిగిస్తుంది. చివర్లో బాలు సరదాగా "మనోజ్‌నే చింటూ తండ్రి అనుకుందామా?" అని అనగా, మనోజ్ ఊహించని విధంగా స్పందించడం కథలో కొత్త ట్విస్ట్‌కు దారితీస్తుంది.

శుక్రవారం ఎపిసోడ్ లో చింటూ అసలు మనోజ్, కల్పన కుమారుడే కావచ్చని మీనా అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్ణయానికి రావద్దని బాలు ఆమెను సముదాయిస్తాడు. మరోవైపు ప్రభావతి బరువు తగ్గాలనే పట్టుదలతో డైటీషియన్‌ను ఇంటికి పిలిపిస్తుంది. ఏఐలో తన స్లిమ్ లుక్ చూసి సంతోషపడిన ఆమె, భారీ ఫీజు అయినా డైట్ మొదలుపెట్టాలని నిర్ణయిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న మీనా, డైట్ ఫుడ్ తానే తయారు చేస్తానని, అందుకు రోజుకు రూ.300 ఇవ్వాలని షరతు పెడుతుంది. సత్యం మద్దతుతో కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు.

ఇదిలా ఉండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్, బాలు వల్ల చినిగిన షర్ట్ ఘటనను మర్చిపోకుండా సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటానని నిర్ణయించుకుంటాడు. డాన్స్ క్లాస్‌లో ప్రభావతి, చింతామణి కలిసి తన వ్యాపారానికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రహించిన మీనా, ఇద్దరికీ గట్టిగా హెచ్చరిక చేస్తుంది. ఎపిసోడ్ చివర్లో మీనాకు సర్‌ప్రైజ్‌గా బంగారు గొలుసు కొనివ్వాలని బాలు రహస్యంగా చిట్టి వేస్తాడు. అదే సమయంలో ప్రభావతి కోసం మీనా తయారుచేసిన స్పెషల్ డైట్‌లో శృతి రహస్యంగా ఆముదం కలుపుతుంది. ఆ విషయం తెలియక ప్రభావతి, మనోజ్ ఆ డైట్ తినడంతో వచ్చే ఎపిసోడ్‌లో ఎలాంటి గందరగోళం చోటు చేసుకోనుందో అన్న ఉత్కంఠ నెలకొంది.