Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. మీనాను మోసం చేసిన చింతామణి, మేనేజర్‌కు బాలు తెలివైన ప్లాన్‌తో గట్టి బుద్ధి చెప్పాడు. డెకరేషన్ పని పూర్తయిన తర్వాత తనకు సాయం చేసిన వారికి డబ్బులు చెల్లించాల్సి వచ్చినా, రూ.9 లక్షలు పోవడంతో మీనా తీవ్ర ఆందోళనలో పడుతుంది. విషయం ఎవరితోనూ చెప్పకుండా దేవుడిని ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీనా ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన బాలు, శృతి ద్వారా అసలు విషయం తెలుసుకుంటాడు. గుడిలో మీనా సుమతికి జరిగిన మోసం గురించి చెబుతుండగా, దూరం నుంచి విన్న శృతి వెంటనే రవి, బాలుకు సమాచారం అందిస్తుంది.

Advertisement

మొదట ఆవేశంతో మేనేజర్‌పై వెళ్లాలనుకున్న బాలు, రవి-శృతి సూచనతో ఆలోచించి ప్లాన్ మార్చుకుంటాడు. ముగ్గురూ కలిసి మేనేజర్‌ను గమనించగా, చింతామణితో కలిసి మీనాను ఎలా మోసం చేశారో అతడు ఫోన్‌లో చెప్పడం వింటారు. వెంటనే రవి, శృతిని రంగంలోకి దింపిన బాలు, మ్యారేజ్ యానివర్సరీ డెకరేషన్ పేరుతో చింతామణిని గుడికి రప్పిస్తాడు. మరోవైపు శృతి చింతామణి గొంతుతో మేనేజర్‌కు ఫోన్ చేసి రూ.9 లక్షలు తీసుకుని రావాలని చెప్పిస్తుంది. గుడికి చేరుకున్న చింతామణి, మేనేజర్ ఎదుటే బాలు ఓనర్‌ను పిలిపించి నిజాన్ని బయటపెడతాడు. డబ్బుతో సహా ఇద్దరూ అడ్డంగా దొరికిపోవడంతో మీనాకు రావాల్సిన రూ.9 లక్షలు తిరిగి దక్కుతాయి. బాలు తెలివైన ప్లాన్‌తో మోసగాళ్ల ఆట కట్టించిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Advertisement