Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ భావోద్వేగాలతో పాటు సరదా సన్నివేశాలతో ఆకట్టుకుంది. మనోజ్ పుట్టినరోజు వేడుకల్లో బాలు స్నేహితుడు రాజేష్‌ను మనోజ్ అవమానించడంతో ఇంట్లో ఉద్రిక్తత నెలకొంది. అతిథులను గౌరవించలేదని బాలు ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మనోజ్ "జైలుకు వెళ్లడం నీకు కొత్త కాదు" అని చెప్పడంతో బాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. చిన్ననాటి చేదు సంఘటనను గుర్తు చేసుకున్న బాలు కోపంతో వంటగదిలో నుంచి కత్తి తీసుకుని మనోజ్‌పైకి వెళ్లాడు. వెంటనే మీనా, రవి, శృతి అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సత్యం వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పాడు. బాలు అన్యాయంగా శిక్ష అనుభవించిన విషయాన్ని గుర్తు చేస్తూ మనోజ్‌ను గట్టిగా మందలించాడు. ప్రభావతి కూడా మనోజ్ చేసిన పాత తప్పును ప్రస్తావించింది.
ఇంట్లో వాతావరణం మారాలని భావించిన శృతి అందరితో కలిసి ఓ సరదా గేమ్ ఆడించింది. మీనా, బాలు, రవి, రోహిణి, మనోజ్ పాల్గొనడంతో ఇంట్లో నవ్వులు పూశాయి. డ్యాన్స్ స్టెప్స్‌ను మార్చి చెప్పే ఆటలో మనోజ్ చేసిన కామెడీ అందరినీ అలరించింది. పుకార్లు ఎలా మారిపోతాయో రవి సరదాగా వివరించాడు. చాలా రోజుల తర్వాత బాలు, మనోజ్ కలిసి నవ్వుకోవడం కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగించింది. గేమ్ ముగిసిన తర్వాత బాలు అందరి ముందే మీనాను ఎత్తుకుని తీసుకెళ్లడం ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. మరోవైపు మనోజ్‌కు రోహిణి ప్రత్యేక పూజలు చేయించి తాయత్తు కట్టింది. అయితే అది కేవలం రూ.20 విలువైన తాయత్తు అని చూపించారు. చివర్లో మనోజ్ తమకు పిల్లలు కావాలని తన కోరిక చెప్పగా, రోహిణి బయటకు అంగీకరించినట్లు నటించింది. సుందరి పెళ్లి నేపథ్యంలో కొత్త ట్విస్టులకు కథ సిద్ధమవుతూ ఎపిసోడ్ ముగిసింది.
photo courtesy jio hotstarMore Articles