హైపర్ ఆది.. ఈ కామెడియన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పంచులు, ప్రాసలు, కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కమెడియన్. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆది.. మొదట అదిరే అభి టీంలో సభ్యుడిగా చేరి, తర్వాత తన ప్రతిభతో టీమ్ లీడర్‌గా ఎదిగాడు. బుల్లితెరతో పాటు వెండితెరపైనా తనదైన ముద్ర వేసుకున్నాడు. సినిమాకు డైలాగ్ రైటర్‌గా పనిచేయడంతో పాటు నటుడిగానూ ఆకట్టుకున్నాడు. పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఆయన పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో అప్పుడప్పుడు వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా హైపర్ ఆది కష్టాలు పడుతున్నారంట. ఈ సమయంలో అందరిముందు ఆయనపై నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది?

Advertisement
Advertisement

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈసారి షోలో ఎన్నో కొత్త విశేషాలు కనిపించాయి. ముఖ్యంగా ఇకపై ప్రతి ఆదివారం జబర్దస్త్ ప్రసారం కానుందని హోస్ట్ ఇంద్రజ ప్రకటించడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. కొత్త ఎపిసోడ్‌లో నాగబాబు రీఎంట్రీ, హైపర్ ఆది కామెడీ, తాగుబోతు రమేష్-రోహిణి స్కిట్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ప్రోమో ప్రారంభంలోనే నాగబాబు తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చి స్టేజ్‌పై సందడి చేశారు. "జబర్దస్త్‌లో పోటీ అంటే సాధారణ పోటీ కాదు.. కత్తులు, కటార్లతో యుద్ధం చేసినట్లు ఉంటుంది. ప్రతి స్కిట్ డీ అంటే డీ అనేలా సాగుతుంది" అంటూ షోపై భారీ హైప్ క్రియేట్ చేశారు.

Advertisement

ఇక హైపర్ ఆది పెళ్లికొడుకు గెటప్‌లో స్టేజ్‌పైకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే నాగబాబు మాత్రం ఆ అవకాశాన్ని కూడా కామెడీగా మార్చేశారు. "ఏంటి ఆది.. ఈ గెటప్ నీకు అస్సలు సెట్ కాలేదు. నీ ఆటిట్యూడ్‌కు, ఈ పెళ్లికొడుకు గెటప్‌కు ఏమైనా సంబంధం ఉందా?" అంటూ సరదాగా పంచ్ వేయడంతో స్టేజ్ మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది. ఆ తర్వాత హైపర్ ఆది తన మార్క్ కామెడీని మొదలుపెట్టాడు.

Advertisement

రష్మిని చూసి "ఏంటి రష్మి .. ఎలా ఉన్నావ్?" అని పలకరించగా, ఆమె "ఇక్కడ హాయ్ అంటారు.. అక్కడ బై బై అంటారు" అంటూ ఫన్నీ రిప్లే ఇచ్చింది. వెంటనే ఆది, తమిళనాడు రాజకీయాలను ప్రస్తావిస్తూ విజయ్ గారు కష్టపడి సీఎం అయితే.. త్రిష గారి చేతి ఊపినట్లు.. నీ పని బాగుంది రష్మి. మేం కష్టపడి స్కిట్లు చేస్తుంటే నువ్వు కేవలం చేయి ఊపితే చాలు.. డబ్బులు వచ్చేస్తున్నాయి" అంటూ పంచ్ వేశాడు.

Advertisement

ఇక తన పెళ్లి గురించి వస్తున్న ప్రశ్నలపై కూడా హైపర్ ఆది సరదాగా స్పందించాడు. "ఎక్కడికి వెళ్లినా పెళ్లెప్పుడు అని అడిగి విసిగిస్తున్నారు సార్" అంటూ నాగబాబుతో తన గోడును చెప్పుకున్నాడు. "ఈ అమ్మాయిని అడిగితే రిచ్ అబ్బాయి కావాలంటున్నారు. అందుకే జబర్దస్త్‌కు వచ్చాను. ఇక్కడ బెస్ట్ పంచ్‌కు వెయ్యి రూపాయలు, పర్ఫార్మర్ ఆఫ్ ది డేకు ఐదు వేల రూపాయలు, ఎక్కువ స్కిట్లు చేస్తే యాభై వేల రూపాయలు, ఇంకా ఎక్కువ చేస్తే లక్ష రూపాయలు ఇస్తారట. అలాంటి ఆఫర్లు ఉన్నాయంటే నేనూ వచ్చేశా" అంటూ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు.

Advertisement

దీనిపై నాగబాబుతో కూడా సరదా సంభాషణ జరిగింది. "ముందు మీరు నవ్వుకుని డబ్బులు తీసుకెళ్లేవారు.. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరీ నవ్వుకుంటున్నారా?" అని ఆది అడగగా, నాగబాబు "రోజులు మారిపోయాయి.. ఏం చేస్తాం" అంటూ ఇచ్చిన సమాధానం ప్రోమోలో హైలెట్‌గా నిలిచింది. మరోవైపు తాగుబోతు రమేష్, రోహిణి స్కిట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ స్కిట్‌లో రోహిణి, తాగుబోతు భర్తతో విసిగిపోయిన భార్య పాత్రలో కనిపించింది. మందు కోసం డబ్బులు అడిగిన భర్తను చితకబాదే సన్నివేశాలు నవ్వులు పంచాయి. "మొసలికి నీళ్లలో ఎంత బలం ఉంటుందో.. నా మొగుడికి మందు తాగితే అంత బలం వస్తుంది" అంటూ రోహిణి చెప్పిన డైలాగ్‌కు మంచి స్పందన వచ్చింది.

అంతేకాదు, "మద్యపానం అని ఎందుకంటారో తెలుసా? మధ్యలోనే నీ ప్రాణం పోతుంది కాబట్టి మద్యపానం అంటారు" అంటూ చెప్పిన కొత్త నిర్వచనం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. మొత్తం మీద ఈ వారం జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది పెళ్లి కామెడీ, నాగబాబు పంచ్‌లు, రోహిణి స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పూర్తి ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.