ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం తెలుగు కామెడీ షోలలో ట్రెండ్ సెట్టర్ అన్న సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్లుగా ఈ షో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ వేదిక ద్వారా పరిచయమైన ఎందరో ప్రతిభావంతులు ప్రస్తుతం సినీరంగంలో హీరోలుగా, దర్శకులుగా, నటులుగా, రచయితలుగా, కమెడియన్లుగా రాణిస్తున్నారు. ఇక పలువురు సీనియర్ హీరోయిన్లకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి జబర్దస్త్ ఓ వేదికలా మారింది. రోజా, మీనా, సంగీత, రంభ, ఇంద్రజ తదితరులు జబర్దస్త్ ద్వారా తెలుగు లోగిళ్లకు మరింత దగ్గరయ్యారు.

Advertisement
Advertisement

తొలుత జబర్డస్త్‌కు నాగబాబు - రోజాలు జడ్జిలుగా వ్యవహరించారు. వీరిద్దరూ కంటెస్టెంట్స్‌పై పంచ్‌లు వేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. ఈ క్రమంలో కొన్ని కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్‌ను వీడారు. కానీ రోజా మాత్రం కంటిన్యూ అయ్యారు. నాగబాబు ప్లేస్‌ను భర్తీ చేయడం అంత తేలిక కాలేదు.. కమెడియన్ అలీ, సింగర్ మనో, శివాజీ, కృష్ణభగవాన్ తదితరులు జడ్జిలుగా వచ్చినా నాగబాబు రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయారు. కృష్ణ భగవాన్, మనోలు కొంచెం కష్టపడి ట్రాక్‌లోకి వచ్చినట్లుగా కనిపించారు.

అంతా సెట్ అవుతున్న దశలో రోజా జబర్దస్త్ నుంచి తప్పించుకున్నారు. 2019లో నగరి నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన రోజా తొలుత ఏపీఐఐసీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. అయితే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో భాగంగా రోజాకు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రిగా నియమించారు నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్. పాలనా వ్యవహారాలతో బిజీగా ఉండటంతో జబర్దస్త్‌కు డేట్స్ అడ్జెస్ట్ చేసుకోలేకపోయారు. అలాగే ప్రతిపక్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని జబర్దస్త్‌ను వీడారు రోజా. చాలామంది కమెడియన్లు, యాంకర్ అనసూయ, జడ్జ్‌లు కూడా వెళ్లిపోవడంతో జబర్దస్త్ కళ తప్పింది.

Advertisement

దాంతో చాలామంది హీరోయిన్లను పట్టుకొచ్చినా వర్కవుట్ కాలేదు.. ఈ దశలో సీనియర్ నటి ఇంద్రజను రంగంలోకి దించింది మల్లెమాల. 90వ దశకంలో దక్షిణాదిలో అగ్రనటిగా ఇంద్రజ పాపులర్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో టాప్ హీరోలతో కలిసి పనిచేశారు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తోన్న ఇంద్రజ.. జబర్దస్త్‌లో తనకు జడ్జిగా దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సాఫ్ట్‌ నేచర్ కావడంతో ఇక్కడ కుదురుకోవడానికి తొలుత కాస్త ఇబ్బందిపడ్డారు. సెటైర్స్, కొన్ని అభ్యంతరకర డైలాగ్స్‌‌ సమయంలో ముఖాన్ని కవర్ చేసుకుంటూ నవ్వారు.

Advertisement

అయితే రాను రాను ఇంద్రజ బాగా కుదురుకున్నారు. అందరితో కలిసిపోవడం, కమెడయన్లను ప్రోత్సహిస్తూ ఉండటంతో జబర్దస్త్‌కు పర్మినెంట్ జడ్జిగా మారిపోయారు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోలకు కూడా జడ్జిగా అవకాశం తప్పించుకున్నారు. మనో, కృష్ణ భగవాన్, శివాజీలతో కలిసి జబర్దస్త్‌కు జడ్జిగా వ్యవహరించి తన మార్క్‌తో జబర్దస్త్‌‌లో గట్టిగా జెండా పాతారు. రీసెంట్‌గా మెగా బ్రదర్ నాగబాబు కూడా తిరిగి జబర్దస్త్‌లో రీ ఎంట్రీ ఇవ్వడం, ఆయనకు ఇంద్రజ తోడు కావడంతో వీరిద్దరూ కలిసి ఈ కామెడీ షోను పునర్వైభవం దిశగా పరుగులు పెట్టిస్తున్నారు.

Advertisement

ఇదిలాఉండగా.. జబర్దస్త్‌కు జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు గాను ఇంద్రజ ఎంత పారితోషికం అందుకుంటున్నారు? ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత అనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇంద్రజకు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించినందుకు ఒక్కో ఎపిసోడ్‌కు 2.5 లక్షల రూపాయల పారితోషికాన్ని చెల్లిస్తున్నారు. నెలకు నాలుగు లేదా 5 ఎపిసోడ్స్‌కు షూటింగ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. దీని ప్రకారం నెలకు 10 నుంచి 12.5 లక్షల రూపాయల రేంజ్‌లో ఇంద్రజకు ఆదాయం సమకూరుతోందని ఫిల్మ్ నగర్ టాక్.