Photo Courtesy: ETV Telugu India

Advertisement

తెలుగునాట కామెడీ షోలకు కొదవే లేవు.. జబర్దస్త్ రాకతో తెలుగు బుల్లితెరపై కామెడీ షోలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. జబర్దస్త్‌ను చూసి పలు ఛానెల్స్.. స్టాండప్ కామెడీ పేరుతో రకరకాల కార్యక్రమాలు తీసుకొచ్చాయి. ఇందులో కమెడియన్స్ ఒకరిపై ఒకరు జోకులు, పంచ్‌లు పేల్చుకోవడంతో పాటు కొన్ని సందర్భాలలో యాంకర్లు, జడ్జిల మీద కూడా సెటైర్లు వేస్తుంటారు. ఇవి కొన్నిసార్లు మిస్ ఫైర్ అయిన సందర్భాలెన్నో. తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బుల్లెట్ భాస్కర్- ఫైమా చేసిన స్కిట్ జడ్జి ఇంద్రజను హర్ట్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement

వారం వారం సరికొత్త థీమ్‌తో ప్రేక్షకులను నవ్విస్తోంది శ్రీదేవి డ్రామా కంపెనీ. దీనిలో భాగంగా త్వరలో ఆషాడ మాసం మొదలు కానుండటంతో ఆషాడం పెళ్లికొడుకులు స్పెషల్ పేరుతో బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేశారు. మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తామని బుల్లితెర పెద్దలు వస్తారు. మధ్యలో హైపర్ ఆది పంచ్‌లు నవ్వించాయి. ఇక తన కొత్త సినిమా సంగతులను ఇంద్రజ పంచుకున్నారు.

Photo Courtesy: ETV Telugu India

Advertisement

ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని బుల్లెట్ భాస్కర్, పొట్టి నరేష్‌లు బట్టల దుకాణం నడిపేవారిలా ఎంట్రీ ఇస్తారు. ఒకరు 25 శాతం డిస్కౌంట్, మరొకరు 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ పెడతారు. ఓ వ్యక్తి వచ్చి మంచి చీర తీయి.. అది కట్టుకోగానే పెళ్లాలు మొగుడి మాట వినేట్లుగా ఉండాలని చెబుతాడు. అలాంటి చీరలు ఏమైనా ఉంటే ముందు నేనే కొనుక్కుంటానని భాస్కర్ అనడంతో అంతా నవ్వేస్తారు. పటాస్ ప్రవీణ్ భార్య వంశీత వచ్చి మా ప్రవీణ్‌కి నచ్చిన ఒక మంచి చీరను చూపించండి, నేను ఆ చీర కట్టుకుంటే ప్రవీణ్ నా చుట్టూనే తిరగాలని అంటుంది. ఈ మూడు చీరలు కట్టుకుంటే కుక్కలా నీ వెనుక తిరుగుతాడు.. ఎందుకంటే ఇవి ఫైమా కట్టకుని వదిలేసిన చీరలని భాస్కర్ చెప్పడంతో పక్కనే ఉన్న ఫైమా నవ్వుకుంటుంది.

Advertisement

ఇక మాస్ సాంగ్స్‌కి సెలబ్రిటీలు వేసిన స్టెప్స్ అలరించాయి. తర్వాత మగాళ్లతో గోరింటాకు నూరించే టాస్క్ ఇస్తుంది రష్మి గౌతమ్. ఎర్రగా పండాలి అంతేకదా? వేళ్లని రోట్లో పెట్టి దంచితే ఎర్రగా పండుతుందని పంచ్‌లు విసురుతాడు ఆది. అనంతరం ఒక బస్తాలోకి దూరి అలాగే పాకుతూ వెళ్లి బాల్‌ను గోల్ వేయాలని టాస్క్ ఇస్తుంది రష్మి. బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆదిలు పాకలేక మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. సరదాగా ఆడుకున్నావా అని పొట్టి నరేష్ అడగ్గా.. సరదానా? ఇంకేమైనానా మైకులు కూడా ఊడిపోయాయని అంటాడు ఆది.

Advertisement

ఇక చివరిలో ఇంద్రజ గతంలో చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌కి ఫైమా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగే సంఘటనలను భాస్కర్- ఫైమాలు స్పూఫ్ చేసి చూపిస్తారు. రాత్రి 10 గంటలైంది నిద్రపోయే టైమ్ కదా అని భాస్కర్ గుర్తు చేయగా.. అయితే అది మీరు అక్కడ, నేను ఇక్కడ అని చెబుతుంది ఫైమా. ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ కాదు.. చెన్నైలో మన కొంప అంటాడు భాస్కర్. నీ వల్ల పాలవాడు రావడం మానేశాడు, కూరగాయలు అమ్ముకునేవాడు రావడం మానేశాడు. నీ పాలల్లో డెప్త్ లేదని అన్నావట.. డెప్త్ పాలు ఇచ్చే గేదే కోసం ఊరంతా తిరుగుతున్నాడట వాడు అంటాడు భాస్కర్.

Advertisement

నేను మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్లాలని అంటుంది ఫైమా. దీనికి జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో ఇంద్రజ అసహనంగా కనిపించారు. మిమ్మల్ని ఒక్కటే అడగాలని అనుకుంటున్నాను. పిలిచిమరీ ఇలా అవమానించడం కరెక్టేనా? నాకెలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. నేను లాగి లాగి సాగదీసి మాట్లాడుతున్నానా? ఎందుకండీ పరువు తీస్తారు? హ్యాపీగా చేయండి, నేను కూడా నవ్వుకోవాలి అని సీరియస్ అయ్యారు. దాంతో కమెడియన్లు, గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. ఇంద్రజ నిజంగానే హర్ట్ అయ్యారా? లేక ఇదంతా షోలో భాగంగానే చేశారా? అన్నది తెలియాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.