తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్10. ఈ రియలిటీ షో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ల్యాండ్‌మార్క్ సీజన్ కావడంతో నిర్వాహకులు భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షోలో పాల్గొనడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతారు. కానీ, ఓ జబర్దస్త్ నటికి బిగ్ బాస్ అవకాశం వచ్చిన తిరస్కరించిందట. ఇంతకీ ఆ నటి ఎవరు? అసలు రిజెక్ట్ చేయడానికి కారణమేంటీ?

Advertisement
Advertisement

ఆ జబర్థస్త్ ఫేమ్ ఎవరో కాదు.. నటి సత్యశ్రీ . జబర్దస్త్ షోలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో సత్య శ్రీ ఒకరు. తన కామెడీ టైమింగ్, సహజ నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఫేమ్ తో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని బిజీ ఆర్టిస్టుగా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు, హీరోయిన్ల స్నేహితురాలి పాత్రల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల నవీన్ పొలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో కనిపించి మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం జబర్దస్త్‌కు దూరంగా ఉంటూ పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించింది.

Advertisement

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యశ్రీ... తనకు నిజంగానే బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 నుంచి ఆఫర్ వచ్చిందని ధృవీకరించారు. అయితే అంత క్రేజీ అవకాశం వచ్చినప్పటికీ తాను దాన్ని అంగీకరించలేదని స్పష్టం చేశారు. దీనికి కారణం తన కుటుంబ బాధ్యతలేనని చెప్పారు. "మా కుటుంబ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను. అమ్మానాన్నలను వదిలి మూడు నెలలు ఇంటికి దూరంగా ఉండటం నా వల్ల కాదు. నేను లేకపోతే వారు ఇబ్బంది పడతారు. అందుకే బిగ్‌బాస్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాను" అని వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, కానీ చాలామందికి బాధ్యతలు పంచుకునే వారు ఉంటారని సత్యశ్రీ అన్నారు.

Advertisement

తన పరిస్థితి మాత్రం భిన్నమని, ఇంట్లో తల్లిదండ్రులకు తానే ప్రధాన ఆధారమని చెప్పారు. కెరీర్ ఎంత ముఖ్యమైనా కుటుంబం కంటే గొప్పది కాదని భావించానని, అందుకే బిగ్‌బాస్ వంటి పెద్ద అవకాశాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని వివరించారు. జబర్దస్త్ తర్వాత బుల్లితెరపై ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నకు కూడా సత్యశ్రీ సమాధానం ఇచ్చారు. గత మూడేళ్లుగా సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతో టెలివిజన్‌కు దూరమయ్యానని తెలిపారు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం తన ఇమేజ్, రెప్యూటేషన్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటున్నానని చెప్పారు.

Advertisement

ఇక బిగ్‌బాస్ విషయానికి వస్తే.. ఈసారి తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఒకేసారి షో ప్రారంభం కానుండటం విశేషం. తెలుగులో మరోసారి నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతుండగా.. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్, బెంగాలీలో సౌరవ్ గంగూలీ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. సత్యశ్రీ బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన విషయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని అభినందిస్తుండగా.. మరికొందరు ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొని ఉంటే మరింత పాపులారిటీ వచ్చేదని అభిప్రాయపడుతున్నారు.