Photo Courtesy: JioHotstar

గుడిలో తనను చూసి వెళ్లిపోతున్న శివన్నారాయణను అతని కుటుంబాన్ని ఆపుతాడు దక్షిణామూర్తి. ఈ శాంతి హోమం నా కూతురి కోసం చేస్తున్నానని చెబుతాడు. కూతురికి అమ్మ అనే పిలుపు దూరం చేసి శాంతి హోమాలు చేయిస్తావా అంటూ ఫైర్ అవుతుంది సుమిత్ర. ఇంతలో మాలిని జోక్యం చేసుకుని ఎలా ఉన్నావని సుమిత్రని అడుగుతుంది దాంతో అంతా షాక్ అవుతారు. ఆమె దక్షిణామూర్తి గారి కోడలు మాలిని అని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. జ్యోత్స్నని, కార్తీక్‌ని ఎలా ఉన్నారని అడుగుతుంది మాలిని. మీది సిటీలోనే పేరున్న రెస్టారెంట్.. గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీ ఫోటోలతో సహా వచ్చాయని అంటుంది మాలిని. సూరజ్ చెప్పినట్లే మాలిని కూడా చెప్పడంతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది.

Advertisement

జ్యోత్స్న, సూరజ్‌లు పూజ చేస్తుండగా మీ ఇద్దరు భార్యాభర్తల్లా ఉన్నారని పంతలు అనడంతో జ్యోత్స్న మండిపడుతుంది. ఇద్దరూ కలిసి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తుండగా సూరజ్‌పై పడుతుంది జ్యోత్స్న. ఇదంతా చూసిన పారు రగిలిపోతుంది, అది గమనించిన కార్తీక్.. ఆమెను పక్కకి తీసుకొచ్చేస్తాడు. దీపం పెడుతున్న మాలినికి ప్రసాదం పెడుతుంది దీప. ఆ ప్రసాదం చాలా రుచిగా ఉండటంతో తన దగ్గర చెఫ్‌గా చేరితే ఎంతైనా ఇస్తానని ఆఫర్ ఇస్తుంది మాలిని. తను చెఫ్ కాదు.. నా భార్య దీప.. జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి సీఈవో అని కార్తీక్ చెబుతాడు. మాలినికి ఈ విషయాలన్నీ ముందే తెలుసని కార్తీక్‌తో అంటాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 11వ తేదీ 720వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Advertisement