Photo Courtesy: JioHotstar

గుడిలో అమ్మాయిని చూశానని, తననే పెళ్లి చేసుకుంటానని సూరజ్ చెప్పడంతో ఆ అమ్మాయి ఫోటో చూపించమని అడుగుతుంది జ్యోత్స్న. ఫోన్‌లో తన ఫోటో తనకే చూపించడంతో రగిలిపోతుంది. ఈ విషయం మా తాత దగ్గరే తేల్చుకుంటానని జ్యోత్స్న అనగా మీ తాతగారు, కార్తీక్‌గారు ఆఫీస్‌లో లేరు ఏదో మీటింగ్‌కి వెళ్లారని చెబుతాడు సూరజ్. రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్‌ మీటింగ్‌లో మరోసారి ఎదురవుతారు దక్షిణామూర్తి- శివన్నారాయణ. ఆ సమావేశానికి మాలిని కూడా రావడంతో ఆమెను పరిచయం చేస్తారు సభ్యులు. సిటీలోనే ది బెస్ట్ చెఫ్స్ మా దగ్గర ఉన్నారు.. మాతో పోటీపడలేక చాలా రెస్టారెంట్స్ పోటీలో నుంచి తప్పుకున్నాయి.. చివరికి మన రెండు రెస్టారెంట్స్ మాత్రమే మిగిలాయని, జ్యోత్స్న రెస్టారెంట్‌తో పోటీకి మేం సిద్ధమని చెబుతాడు దక్షిణామూర్తి.

Advertisement

కానీ నేను సిద్ధంగా లేనని తేల్చేస్తాడు శివన్నారాయణ. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం, ఇప్పడు కొత్తగా మా వంటలు రుచిగా ఉంటాయని చెప్పాల్సిన అవసరం లేదని ఇంటికి వచ్చేస్తాడు. జరిగినదంతా కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోటీ చేయాల్సిందేనని సూరజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కార్తీక్, దీప కూడా అందుకు సపోర్ట్‌గా నిలబడటంతో జ్యోత్స్న, పారులు నానామాటలు అంటారు. ఇంతలో దక్షిణామూర్తి ఫోన్ చేసి మాతో పోటీ చేసే దమ్ము లేదని అనడంతో సుమత్ర వచ్చి నా మెట్టింటి పౌరుషం చూపిస్తాం, శివన్నారాయణ గారు పోటీ చేస్తారని చెప్పడంతో అంతా ఉలిక్కిపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 14వ తేదీ 722వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Advertisement