Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే ఎక్సర్‌సైజులు చేస్తున్న పారు దగ్గరకి జ్యోత్స్న వచ్చి ఆ సూరజ్ గాడిని అడ్డు తొలగించుకోవడానికి ఏం చేస్తున్నావని అడుగుతుంది. రాత్రంతా వీడియోలు చూసి బ్రహ్మాండమైన ప్లాన్ రెడీ చేశానని చెబుతుంది పారు. ఈ కారుకి బ్రేక్‌లు తీసేశాను.. సూరజ్ వచ్చి కారు నడిపితే చాలు ఏ కాలో, చెయ్యో విరుగుతుందని అంటుంది. ఉదయాన్నే టిఫిన్ చేయకుండా ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉన్న దీపపై సీరియస్ అవుతుంది అనసూయ. నన్ను కూడా పట్టించుకోవడం లేదు.. నువ్వే గట్టిగా బుద్ధి చెప్పమని అంటాడు కార్తీక్. దాంతో దీపకి క్లాస్ పీకుతుంది అనసూయ.
దీప చాలా మంచిది, నా తర్వాతే కడుపులోని బిడ్డయినా అని భార్యని మెచ్చుకుంటాడు కార్తీక్. మీరిద్దరూ ఇలాగే ఉండాలి, ముందు ఆ జ్యోత్స్నకి ఎవరో ఒకరితో ముడి వేసేయమని చెబుతుంది అనసూయ. మరోవైపు.. సూరజ్‌తో ఎలాగైనా బ్రేక్‌లు తీసేసిన కారును నడిపించాలని జ్యోత్స్న, పారులు ప్లాన్ చేస్తారు. కాఫీ తాగుతున్న సూరజ్‌ని పిలిచి కారు స్టార్ట్ కావడం లేదు.. ఒకసారి స్టార్ట్ చేసి పికప్‌లో ఉందో లేదో చూడమని రెచ్చగొడతారు. దాంతో సూరజ్ కారును నడుపుకుంటూ వెళ్లి క్షేమంగా తిరిగి రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు. కారు బాగానే ఉంది మీరిద్దరూ బ్యూటీ పార్లర్‌కి వెళ్లమని సూరజ్ చెప్పగా నానమ్మ మనవరాలు వణికిపోతారు. చేసేదేం లేక ఇద్దరూ కారులో వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిలై చెట్టును ఢీకొడతారు. ఆ శబ్దం విన్న కార్తీక్, సూరజ్‌లు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 16వ తేదీ 724వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?
Photo Courtesy: JioHotstar యాక్సిడెంట్‌లో దెబ్బలు తగలడంతో మెడకు బెల్ట్ వేయించుకుంటుంది పారు. కారుకి బ్రేక్‌లు పడలేదు యాక్సిడెంట్ అయ్యింది.. మరి నీ ముఖానికి ఆయిల్ ఏంటీ? అని శివన్నారాయణ అడగటంతో పారు షాక్ అవుతుంది. యాటిట్యూడ్ కోసం ఆయిల్ రాసుకుందని కార్తీక్ చెప్పడంతో పారు ఉలిక్కిపడుతుంది. అసలు ప్రమాదం ఎలా జరిగిందా? అని ఆలోచిస్తున్నా.. కారుని సర్వీస్ చేయించేది నేనే కదా? ఏ కారుకి ఏ కంప్లంట్ ఉందో నాకు బాగా తెలుసు అనడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. అంటే నీ ఉద్దేశం ఎవరైనా బ్రేకులు తీసేశారా అని అడుగుతాడు శివన్నారాయణ. ముందు కారుని బ్రదర్‌ని టెస్ట్ చేయమన్నారు సార్.. బ్రదర్ బాగానే వచ్చాడు. జ్యోత్స్న కారెక్కింది కానీ, పారు కారెక్కడానికి ఇబ్బంది పడిందని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నతో నేను ఎందుకులే అని ఆగిపోయాను, గేటు శుభ్రం చేస్తుంటే ఈ ఆయిల్ అంటుకుందని చెబుతుంది పారు. గేటుకు ఉండేది గ్రీజు ఆయిల్ కాదు. బ్రదర్‌ని వేసేయడానికి కారు బ్రేక్‌లు తీసేసి మర్దర్ ప్లాన్ చేశారేమోనని కార్తీక్ అనుమానించడంతో అంతా షాక్ అవుతారు. సూరజ్ ఇప్పుడు పరాయి వాడు కాదు కదా మనోడేనని చెబుతుంది పారు. మనకు కాంపీటిషన్‌కి టైం అవుతోంది.. వెళ్దామని పెద్దాయన చెబుతాడు. నేను కూడా వస్తాను.. మీరంతా వెళ్లిపోతే ఒంటి కన్ను రాక్షసిలా ఉండలేనని అంటుంది పారు. దాంతో సరేనని అంటాడు పెద్దాయన. గార్డెన్‌లో ఒక రెంజ్ దొరికింది దాని సంగతి ఏంటీ? అని పారుని కార్తీక్ అడగ్గా నానమ్మ మనవరాలు షాక్ అవుతారు. ఎన్ని వేషాలు వేసినా బ్రదర్ ఇక్కడి నుంచి పోడు, ముందు ఈరోజు కాంపీటిషన్‌లో దీపని గెలవనీ, ఆ తర్వాత మీ సంగతి చెబుతానని అనుకుంటాడు కార్తీక్. పోటీ కోసం రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్లు భారీ ఏర్పాట్లు చేస్తారు. బయటివాళ్లు ఎవరూ రారు.. అంతా మనవాళ్లే, వంటలను టేస్ట్ చేయడానికి ఒక చెఫ్ వస్తారని చెబుతారు అసోసియేషన్ వాళ్లు. ఇంతలో దక్షిణామూర్తి - మాలినిలు రావడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు.More Articles