Photo Courtesy: JioHotstar

కార్తీక్‌ను కొనాలని చూసిన మాలినికి నీ డబ్బుకు అమ్ముడుపోయే వాళ్లు నా దగ్గర లేరని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. నిజాయితీ ఉన్నవాళ్లే కాదు, అవసరం ఉన్నవాళ్లు కూడా ఉంటారని అంటుంది మాలిని. వంటల పోటీ మొదలవ్వడంతో ఇరు వర్గాలకు చెందిన చెఫ్‌లను రమ్మని నిర్వాహకులు చెబుతారు. జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి చెందిన కిరణ్ అనే చెఫ్.. దక్షిణామూర్తి రెస్టారెంట్స్‌ వైపు నిలబడటంతో దక్షిణామూర్తి ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇతను రెండు గంటల క్రితమే మీ దగ్గర ఉద్యోగం మానేసి మా రెస్టారెంట్‌లో చెఫ్‌గా జాయిన్ అయ్యాడని మాలిని చెప్పడంతో శివన్నారాయణ రగిలిపోయి.. దక్షిణామూర్తిని నానా మాటలు అంటాడు.

Advertisement

మీకు ముందే చెప్పాల్సింది ఇతను నిన్న రాత్రి నా దగ్గర చేరతానని వచ్చాడని దక్షిణామూర్తితో అబద్ధం ఆడుతుంది మాలిని. మీ తరపున వంట చేసే వాళ్లు లేరు కాబట్టి పోటీ నుంచి తప్పుకుంటారా? లేక కొత్త వంట వాడిని వెతుక్కుంటారా అని అంటుంది. అవమానంతో బయటికి వచ్చేస్తాడు శివన్నారాయణ. హాయిగా జ్యూస్ తాగుతున్న సూరజ్ దగ్గరికి వచ్చి ఈ ఒక్కసారికీ నాకు హెల్ప్ చేయమని అడుగుతుంది జ్యోత్స్న. నమ్మిన వాళ్లని నేను మోసం చేయలేను, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నిన్ను గెలిపిస్తానని చెబుతాడు సూరజ్. నీ నిర్లక్ష్యం వల్ల శివన్నారాయణ గారు అవమానపడే స్థాయికి చేరుకున్నారని దీపని నానామాటలు అంటుంది పారు. ఆ వెంటనే సూరజ్ వచ్చి మనకి చెఫ్ దొరికాడని జ్యోత్స్న చేయ్యెత్తి చూపిస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. నాకొక అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తానని సూరజ్ అనడంతో శివన్నారాయణ సరేనని అంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 18వ తేదీ 726వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Advertisement

Photo Courtesy: JioHotstar