Photo Courtesy: JioHotstar
దక్షిణామూర్తి ఇంటికి సూరజ్, కార్తీక్‌లతో కలిసి కోపంగా వెళ్తాడు శివన్నారాయణ. నా గుమ్మం తొక్కను అన్నావు.. నేను అడ్రస్ ఇవ్వకుండా నువ్వే వచ్చావని శివన్నారాయణతో అంటాడు దక్షిణామూర్తి. గతంలో మన రెండు కుటుంబాల మధ్య ఏం జరిగిందో నాకు అనవసరం, బంధాలు వద్దుకున్నాం విడిపోయాం. అందుకే మీకు కనిపించనంత దూరంగా వచ్చి వ్యాపారం మొదలుపెట్టాను. మీరు మాత్రం ఇంకా పాత మనుషుల్లాగే మిగిలిపోయారని అంటాడు శివన్నారాయణ. కాంచనను నువ్వు అనాథలా వదిలేశావని మాలిని అనడంతో కార్తీక్ సీరియస్ అవుతాడు.
లండన్‌లో చదువుకున్నది మీ మరదలికి డ్రైవర్‌గా పనిచేయడానికా? అని అవమానిస్తుంది మాలిని. నా వాళ్ల కోసం నేను ఏమైనా అవుతానని చెబుతాడు కార్తీక్. కాంచన ఏం కోరుకుంటే అది ఇవ్వడానికి ఈ శివన్నారాయణ సిద్ధం. కానీ ఆమె ఏం అడగదని చెబుతాడు. మరోసారి నా జోలికి, నా కంపెనీ జోలికి, నా కుటుంబం జోలికి రావొద్దని చెక్ మీద రూపాయి పెట్టి వెళ్లిపోతాడు శివన్నారాయణ. ఇంటికి వెళ్లేసరికి కాంచన వచ్చి ఉంటడటంతో రేపు శ్రీధర్ అమెరికా నుంచి రాబోతున్నాడని చెబుతాడు. అలాగే నేను నీకు అన్యాయం చేశావని బాధపడుతున్నావా అని అడుగుతాడు. ఆ మాటలతో కాంచన, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 24వ తేదీ 731వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?
Photo Courtesy: JioHotstarMore Articles