Photo Courtesy: JioHotstar

ఈ ఆస్తిలో సగం నా ఆడపడుచు సుమిత్రదే.. నువ్వు అడిగితే నా ఆస్తిలో సగం ఇస్తానని మాలిని ఆఫర్ ఇవ్వడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. నా మేనకోడలు అంటే నాకు చచ్చేంత ప్రాణం, ఇష్టమని చెబుతుంది. నాకు ఎవరి ప్రేమలు వద్దు అని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. మాలిని ఉంగరం కిందపడిపోవడంతో దానిని తీసుకుని ఇవ్వబోతుండగా పారు మెడనొప్పి తగ్గిపోతుంది. నా మేనకోడలిని నా ఇంటికి తీసుకొచ్చినందుకు నువ్వే దానిని ఉంచుకోమని పారుకి చెబుతుంది మాలిని. భోజనం చేస్తూ శ్రీధర్ అమెరికా నుంచి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తుంటుంది సుమిత్ర. ఇంతలో శ్రీధర్ రావడంతో కాంచన చాలా సంబరపడిపోతుంది..

Advertisement

నాకు బాగా ఆకలిగా ఉందని శ్రీధర్ చెప్పగా ప్లేటులో భోజనం పెట్టబోతుండగా ముద్దలు పెట్టమని అడుగుతాడు శ్రీధర్. దాంతో భర్తకు అన్నం పెడుతుంది. ఛైర్మన్ గారికి కానీ, సీఈవోగారికి కానీ ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లావని జ్యోత్స్నని కార్తీక్, దీపలు నిలదీస్తారు. ఇంటి దగ్గర కూడా ఇదే పంచాయతీ పెడతాడు శివన్నారాయణ. జ్యోత్స్న, పారులు చెబుతున్న దానికి పొంతన ఉండదు. ఇంతలో పారిజాతం చేతికి మాలిని ఉంగరం చూసి సూరజ్‌కి వాళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లాడో అర్ధమైపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 27వ తేదీ 733వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Advertisement

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న, పారులను ఎక్కడికి వెళ్లావని నిలదీస్తుండగా దశరథ ఎంట్రీ ఇస్తాడు. మన ఆఫీసులో పనిచేసే ఎవరికైనా జవాబుదారీతనం, నిజాయితీ, బాధ్యత ఉండాల్సిందేనని చెబుతాడు. జ్యోత్స్న చెప్పకుండా వెళ్లిపోయింది కాబట్టి నిజాయితీ లేనట్లేనని అంటాడు కార్తీక్. ఆ తాడు బొంగరం లేనోడు ఏదిపడితే అది మాట్లాడతాడు, నువ్వు కూడా అలాగే మాట్లాడతావా అని మండిపడుతుంది పారు. తాడు బొంగరం లేకపోవడం అంటే ఏంటీ అని అడుగుతాడు సూరజ్. పెళ్లి, పెటాకులు లేవు అని అర్ధమని అంటుంది. అంటే మీరు జ్యోత్స్న గారిని, నన్ను కలిపి తిట్టినట్లేనని ఇరికిస్తాడు సూరజ్. జ్యోత్స్నకి నాకు సంబంధం లేదని అంటుంది పారు.

Advertisement

నాకు తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్లానని చెప్పాను, నా మీద నమ్మకం లేక తాత దగ్గర పంచాయతీ పెట్టారని చెబుతుంది జ్యోత్స్న. మన ఆఫీసులో పనిచేసే వాళ్లయినా, మన ఇంట్లో ఉండేవాళ్లయినా క్షమశిక్షణతో ఉండాలి. అది ఎవరు తప్పినా నేను సీరియస్‌గా తీసుకుంటాను, ఎవరైనా ఎక్కడికైనా వెళితే ఎవరో ఒకరికి చెప్పమని వార్నింగ్ ఇస్తాడు. నేను మీ పెళ్లి గురించి మాట్లాడినందుకు నన్ను తప్పుగా అనుకోలేదు కదా అని సూరజ్ మళ్లీ రెచ్చగొడతాడు.

దాని పెళ్లి గురించి మాట్లాడే హక్కు నీకు లేదని పారు సీరియస్ అవ్వగా.. మరి సూరజ్ పెళ్లి గురించి మాట్లాడే రైట్ నీకుందా అని దశరథ కౌంటర్ వేస్తాడు. తాడు బొంగరం లేనోడు అన్నావు.. అది తప్పు కదా? నీ కూతురి పెళ్లెప్పుడు అని నేను బయటికి వెళ్తే జనం అడుగుతున్నారు. నీ పెళ్లి గురించి నీకు బెంగ లేదు కానీ, మాకుందని చెబుతాడు దశరథ. నువ్వు దీని గురించి, మా గురించి కూడా ఆలోచించమని జ్యోత్స్నకి చెబుతాడు. నీ ఇగోని టచ్ చేశావని సూరజ్‌పై రగిలిపోతుంది జ్యోత్స్న. మాలినిని కలిసిన విషయం బయటకు రాకపోవడంతో పారు ఊపిరి పీల్చుకుంటుంది