Photo Courtesy: JioHotstar

మన ఆఫీసులో పనిచేసే ఎవరికైనా జవాబుదారీతనం, నిజాయితీ, బాధ్యత ఉండాల్సిందేనని అంటాడు దశరథ. ఆ తాడు బొంగరం లేనోడు ఏదిపడితే అది వాగుతూ ఉంటాడని సూరజ్‌పై పారు సీరియస్ అవుతుంది. తాడు, బొంగరం లేకపోవడం అంటే ఏంటని అడుగుతాడు సూరజ్. పెళ్లి పెటాకులు లేనివాళ్లని అలా అంటారని పారు చెప్పగా.. అంటే జ్యోత్స్నగారిని, నన్ను కలిపి తిట్టారని ఇరికిస్తాడు సూరజ్. జరిగిందేదో జరిగిపోయింది.. ఇకపై ఎవరైనా బయటికి వెళ్లేటప్పుడు చెప్పి వెళ్లమని వదిలేస్తాడు శివన్నారాయణ.

Advertisement

కార్తీక్, దీపలను ఇంటి దగ్గర దించిన దశరథ.. త్వరగా జ్యోత్స్న పెళ్లి అయ్యేలా చూడండి, ఈ పెళ్లితోనే దీప జీవితం ముడిపడి ఉందని బతిమలాడతాడు. ఈ మాటలన్నీ విన్న శ్రీధర్.. నాకు తెలియకుండా వీళ్లిద్దరూ ఏదో జరుగుతుందని అనుకుంటాడు. ఆపరేషన్ పూర్తి చేసుకుని ఇంటికొచ్చిన శ్రీధర్‌ను చూడగానే కార్తీక్, దీపలు సంతోషిస్తారు. తన ఫోటోలు చూస్తున్న సూరజ్‌పై కోప్పడుతుంది జ్యోత్స్న. కార్తీక్, దీపలు నా దగ్గర ఏదో దాస్తున్నారని కాంచనకి ఇన్‌డైరెక్ట్‌గా చెబుతాడు శ్రీధర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 28వ తేదీ 734వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Advertisement