Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జూలై 13వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు 721 నుంచి 726వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

Advertisement

జూలై 13వ తేదీ 721వ ఎపిసోడ్‌లో..
నాకు కాబోయే భార్య అంటూ ఫోన్‌లో తన ఫోటో తనకే చూపించడంతో సూరజ్‌పై రగిలిపోతుంది జ్యోత్స్న. ఈ విషయం మా తాత దగ్గరే తేల్చుకుంటానని జ్యోత్స్న అనగా మీ తాతగారు, కార్తీక్‌గారు ఆఫీస్‌లో లేరు ఏదో మీటింగ్‌కి వెళ్లారని చెబుతాడు సూరజ్. రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్‌ మీటింగ్‌లో మరోసారి ఎదురవుతారు దక్షిణామూర్తి- శివన్నారాయణ. ఆ సమావేశానికి మాలిని కూడా రావడంతో ఆమెను పరిచయం చేస్తారు సభ్యులు. సిటీలోనే ది బెస్ట్ చెఫ్స్ మా దగ్గర ఉన్నారు.. మాతో పోటీపడలేక చాలా రెస్టారెంట్స్ పోటీలో నుంచి తప్పుకున్నాయి.. చివరికి మన రెండు రెస్టారెంట్స్ మాత్రమే మిగిలాయని, జ్యోత్స్న రెస్టారెంట్‌తో పోటీకి మేం సిద్ధమని చెబుతాడు దక్షిణామూర్తి. కానీ నేను సిద్ధంగా లేనని తేల్చేస్తాడు శివన్నారాయణ. జరిగినదంతా కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోటీ చేయాల్సిందేనని సూరజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంతలో దక్షిణామూర్తి ఫోన్ చేసి మాతో పోటీ చేసే దమ్ము లేదని అనడంతో సుమత్ర అందుకుని పోటీ చేస్తామని చెబుతుంది.

Advertisement

జూలై 14వ తేదీ 722వ ఎపిసోడ్‌లో..
దక్షిణామూర్తి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు పోటీకి వెళ్లొద్దని చెబుతుంది పారు. కానీ సుమిత్ర మాత్రం మనం పోటీలో పాల్గొంటున్నాం, గెలుస్తున్నమని చెబుతుంది. కోడలి కోరిక మేరకు పోటీకి సిద్దమని ప్రకటిస్తాడు శివన్నారాయణ. కంపెనీ సీఈవో నువ్వే కాబట్టి గెలిపించాల్సిన బాధ్యత నీదేనని దీపకి చెబుతాడు పెద్దాయన. ఇది పోటీయే కాదు.... నా ఇంటి కోడలి ఆత్మగౌరవం దానిని నువ్వు గెలిపించాలని దీపతో అంటుంది సుమిత్ర. శివన్నారాయణ పోటీకి దిగేలా కనిపించడం లేదని మాలినితో అంటాడు దక్షిణామూర్తి. బాబాయి ఖచ్చితంగా పోటీకి వస్తాడని అంటుంది మాలిని. అమెరికా నుంచి రావడం లేదని శ్రీధర్ చెప్పడంతో కాంచన, దీప, కార్తీక్‌లు బాధపడతారు. నేను మీ అందరికీ అడ్డుగా ఉంటాను, మా ఊరికి వెళ్లిపోతానని అనసూయ అంటుంది. శౌర్య ఏడుస్తూ బతిమలాడటంతో ఉండటానికి ఒప్పుకుంటుంది అనసూయ. ఈ పోటీలో ఎలాగైనా మనం ఓడిపోవాలి.. తాతకి దీప మీదున్న నమ్మకం పోవాలి, ఇదంతా జరగాలంటే ఆ సూరజ్ గాడు ఇక్కడ ఉండకూడదని ప్లాన్ చేస్తారు జ్యోత్స్న, పారు.

Advertisement

Photo Courtesy: JioHotstar

జూలై 15వ తేదీ 723వ ఎపిసోడ్‌లో..
ఉదయాన్నే పారు దగ్గరకి జ్యోత్స్న వచ్చి ఆ సూరజ్ గాడిని అడ్డు తొలగించుకోవడానికి ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఈ కారుకి బ్రేక్‌లు తీసేశాను.. సూరజ్ వచ్చి కారు నడిపితే చాలు ఏ కాలో, చెయ్యో విరుగుతుందని అంటుంది. దీప చాలా మంచిది, నా తర్వాతే కడుపులోని బిడ్డయినా అని భార్యని మెచ్చుకుంటాడు కార్తీక్. మీరిద్దరూ ఇలాగే ఉండాలి, ముందు ఆ జ్యోత్స్నకి ఎవరో ఒకరితో ముడి వేసేయమని చెబుతుంది అనసూయ. సూరజ్‌తో ఎలాగైనా బ్రేక్‌లు తీసేసిన కారును నడిపించాలని జ్యోత్స్న, పారులు ప్లాన్ చేస్తారు. సూరజ్‌ని పిలిచి కారు స్టార్ట్ కావడం లేదు.. ఒకసారి స్టార్ట్ చేసి చూడమని రెచ్చగొడతారు. దాంతో సూరజ్ కారును నడుపుకుంటూ వెళ్లి క్షేమంగా తిరిగి రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు. కారు బాగానే ఉంది మీరిద్దరూ బ్యూటీ పార్లర్‌కి వెళ్లమని సూరజ్, కార్తీక్ చెప్పగా ఇద్దరూ వణికిపోతారు. ఇద్దరూ కారులో వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిలై చెట్టును ఢీకొడతారు.

Advertisement

జూలై 16వ తేదీ 724వ ఎపిసోడ్‌లో..
యాక్సిడెంట్‌లో దెబ్బలు తగలడంతో మెడకు బెల్ట్ వేయించుకుంటుంది పారు. బ్రదర్‌ని చంపడానికి ఏదైనా కుట్ర జరిగిందా? అని కార్తీక్ చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. శివన్నారాయణ కుటుంబం మొత్తం కలిసి రెస్టారెంట్స్ మధ్య జరిగే పోటీకి వెళ్తారు. అక్కడికి మాలిని, దక్షిణామూర్తి రావడంతో శివన్నారాయణ రగిలిపోతాడు. కుటుంబాన్ని విడదీశారు ఇప్పుడు మనుషుల్ని కూడా విడదీస్తారా అని మండిపడుతుంది సుమిత్ర. గంటలో 5 రకాల వెరైటీలు చేయాలని, అసోసియేషన్ నిర్ణయించిన జడ్జిలు ఎవరి ఫుడ్ బాగుందో నిర్ణయిస్తారని చెబుతారు. ఇంతలో మాలిని ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుండగా ఆమె ఉంగరం కింద పడిపోతుంది. అది చూసిన సూరజ్ ఆమెకు ఇస్తాడు. ఇదే సమయంలో మాలినికి సూరజ్ అమ్ముడుపోయాడని నమ్మించాలని జ్యోత్స్న ప్లాన్ చేసి శివన్నారాయణని బయటికి రప్పిస్తుంది. మాలినికి సూరజ్ కౌంటర్ ఇవ్వడం చూసి అతనిని శివన్నారాయణ మెచ్చుకుంటాడు.

Advertisement

Photo Courtesy: JioHotstar

జూలై 17వ తేదీ 725వ ఎపిసోడ్‌లో..
సూరజ్‌ను కొనాలని చూసిన మాలినికి నీ డబ్బుకు అమ్ముడుపోయే వాళ్లు నా దగ్గర లేరని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. వంటల పోటీ మొదలవ్వడంతో ఇరు వర్గాలకు చెందిన చెఫ్‌లను రమ్మని నిర్వాహకులు చెబుతారు. జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి చెందిన కిరణ్ అనే చెఫ్.. దక్షిణామూర్తి రెస్టారెంట్స్‌ వైపు నిలబడటంతో దక్షిణామూర్తి ఫ్యామిలీ షాక్ అవుతుంది. మీ తరపున వంట చేసే వాళ్లు లేరు కాబట్టి పోటీ నుంచి తప్పుకుంటారా? లేక కొత్త వంట వాడిని వెతుక్కుంటారా అని అంటుంది. సూరజ్ దగ్గరికి వచ్చిన జ్యోత్స్న ఈ ఒక్కసారికీ నాకు హెల్ప్ చేయమని అడుగుతుంది. నమ్మిన వాళ్లని నేను మోసం చేయలేను, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నిన్ను గెలిపిస్తానని చెబుతాడు సూరజ్. నీ నిర్లక్ష్యం వల్ల శివన్నారాయణ గారు అవమానపడే స్థాయికి చేరుకున్నారని దీపని నానామాటలు అంటుంది పారు. ఆ వెంటనే సూరజ్ వచ్చి మనకి చెఫ్ దొరికాడని జ్యోత్స్న చేయ్యెత్తి చూపిస్తాడు.

Advertisement

జూలై 18వ తేదీ 726వ ఎపిసోడ్‌లో..
సూరజ్ మీద నమ్మకంతో అతనికి ఒక అవకాశం ఇస్తాడు శివన్నారాయణ. చెఫ్‌గా జ్యోత్స్న‌ని ఎంపిక చేయడంతో నా మనవరాలి పరువు తీయాలని అనుకుంటున్నావా అంటూ మండిపడుతుంది పారు. నీ వల్ల నువ్వు ఓడిపోతావేమో కానీ నా ప్లాన్ ఫాలో అయితే మాత్రం నువ్వు గెలుస్తావని జ్యోత్స్నతో అంటాడు సూరజ్. చెఫ్ రాకపోవడంతో తానే రంగంలోకి దిగుతానని కార్తీక్‌తో అంటుంది దీప. నువ్వు ప్రెజర్ తట్టుకోలేవు.. పైగా సీఈవో పోటీలో ఉండకూదని కార్తీక్ అనడంతో దీప షాక్ అవుతుంది. ఇంతలో జ్యోత్స్న వచ్చి నేనే పోటీలో దిగుతానని, నాకు దీప హెల్ప్ చేస్తుందని చెబుతుంది. దానికి మాలిని ఒప్పుకోకపోవడంతో దీప ఒప్పిస్తుంది. దీప చేస్తున్న వంటల్ని చెడగొట్టేందుకు జ్యోత్స్న నానా ప్రయత్నాలు చేస్తుంది. దాంతో మనిద్దరం తర్వాత చూసుకుందాం.. ముందు తాత పరువుని కాపాడమని జ్యోత్స్నని బ్రతిమలాడుతుంది దీప. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.