Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జూలై 20వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు 727 నుంచి 732వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

Advertisement

జూలై 20వ తేదీ 727వ ఎపిసోడ్‌లో..
నాకు నీ సాయం కావాలి? తాతని గెలిపించాలని దీప ఎమోషనల్ కావడంతో జ్యోత్స్న చేతులు కలుపుతుంది. నిర్దేశించిన టైమ్ మేరకు వంటలను పూర్తి చేస్తారు దీప- జ్యోత్స్న. డీఎం రెస్టారెంట్స్, జ్యోత్స్న రెస్టారెంట్స్‌లు వంటలలో సమానంగా నిలవడంతో పోటీ టఫ్‌గా మారుతుంది. చివరిలో స్వీట్ బాగుందని ఇద్దరూ జడ్జిలు జ్యోత్స్న రెస్టారెంట్స్‌కే ఓటేయడంతో శివన్నారాయణ గెలుస్తాడు. మాలిని చేతుల మీదుగా జ్యోత్స్న- దీపలు సంయుక్తంగా అవార్డును అందుకుంటారు. నా మనవరాళ్లు ఇద్దరూ కలిసి నన్ను గెలిపించారని శివన్నారాయణ పొంగిపోతాడు. షెఫ్‌లు కనుక సమయానికి దొరక్కపోతే పోటీకి నేను దిగేవాడిని అంటాడు. నువ్వు పెద్ద వంటగాడివి అని మాకు తెలుసు అని అంటాడు దక్షిణామూర్తి. నా చేతులతోనే దీపని పోటీకి దిగేలా చేశావు అని సూరజ్‌పై మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వు పెద్ద వంట వాడివని దక్షిణామూర్తి అన్నాడు.. మా కోసం వంట చేయొచ్చు కదా అని అంటాడు కార్తీక్.

Advertisement

జూలై 21వ తేదీ 728వ ఎపిసోడ్‌లో..
నన్ను గెలిపిస్తానని చెప్పి ఆ దీపని గెలిపిస్తావా అంటూ సూరజ్‌పై మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వు గెలుపు కోసం అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా గెలిపించాలని అనుకున్నానని అంటాడు సూరజ్. ప్రస్తుతానికి నీ లవర్‌ని, నువ్వు ఒప్పుకుంటే నీకు కాబోయే మొగుడిని అని చేతిలో పువ్వు పెడతాడు. దానిని కిందపడేసి కాలితో తొక్కుతుంది. మాలిని, దక్షిణామూర్తిలపై గెలిచినందుకు గాను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాడు శివన్నారాయణ. మరోవైపు.. అవమాన భారంతో రగిలిపోతుంటుంది మాలిని. నేను ఓడిపోయాను, శివన్నారాయణ ముందు తలెత్తుకోలేకపోయానని బాధపడతాడు దక్షిణామూర్తి. మనం ఈ పోటీలో గెలిచాం.. మీ అమ్మాయిని నీ పక్కన కూర్చొనేలా చేశాను, ఎప్పటికైనా మీ అమ్మాయిని మీ దగ్గరికి చేరుస్తానని చెబుతుంది మాలిని. జ్యోత్స్న మెట్లు ఎక్కుతుండగా పూలకుండీ తగిలి రక్తం వస్తుంది. దాంతో సూరజ్ వెంటనే ఆమె కాలికి కట్టుకట్టడంతో అంతా షాక్ అవుతారు. జ్యోత్స్నని సూరజ్ ఇష్టపడుతున్నాడని కార్తీక్‌తో అంటుంది దీప.

Advertisement

Photo Courtesy: JioHotstar

జూలై 22వ తేదీ 729వ ఎపిసోడ్‌లో..
మాలిని, శివన్నారాయణలపై గెలిచి ఇంటికొచ్చిన దీప, కార్తీక్‌లను కాంచన మెచ్చుకుంటుంది. జ్యోత్స్న కాలికి దెబ్బ తగలగానే మా కంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యావు ఎందుకు అని సూరజ్‌ని నిలదీస్తుంది సుమిత్ర. ఎక్కువగా చనువు తీసుకోనుంటే క్షమించమని అంటాడు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి.. అసలు మీ తల్లిదండ్రులు ఎవరు? మీ కుటుంబం ఎక్కడుంటుందని సుమిత్ర అడుగుతుంది. ఉదయాన్నే కాంచన ఇంటికి మాలిని రావడంతో దీప, కాంచనలు షాక్ అవుతారు. మీ జీవితాల్ని శివన్నారాయణ గారు ఇలాంటి ఇంటిలో పడేశాడు.. మీరు నాతో కలిసిపోతే మీ జీవితాలు మారిపోతాయని పండ్లు, బ్లాంక్ చెక్ ఇస్తుంది. దాంతో కార్తీక్ రగిలిపోతాడు.. తల్లి మాట విని సైలెంట్ అయిపోతాడు. అత్త అంత తేలికగా వదిలిపెట్టదు.. ఏదో ఒకటి చేస్తుందని కార్తీక్‌కి నచ్చచెబుతుంది దీప. ఇంతలో ఇంట్లో నుంచి శివన్నారాయణ మాటలు వినిపించడంతో ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఆ చెక్, పండ్ల బుట్ట తీసుకుని పదా అని సూరజ్‌తో కలిసి దక్షిణామూర్తి ఇంటికి వెళ్తాడు శివన్నారాయణ

Advertisement

జూలై 23వ తేదీ 730వ ఎపిసోడ్‌లో..
నా గుమ్మం తొక్కను అన్నావు.. నేను అడ్రస్ ఇవ్వకుండా నువ్వే వచ్చావని శివన్నారాయణతో అంటాడు దక్షిణామూర్తి. గతంలో మన రెండు కుటుంబాల మధ్య ఏం జరిగిందో నాకు అనవసరం, బంధాలు వద్దుకున్నాం విడిపోయాం. అందుకే మీకు కనిపించనంత దూరంగా వచ్చి వ్యాపారం మొదలుపెట్టాను. మీరు మాత్రం ఇంకా పాత మనుషుల్లాగే మిగిలిపోయారని అంటాడు శివన్నారాయణ. కాంచన ఏం కోరుకుంటే అది ఇవ్వడానికి ఈ శివన్నారాయణ సిద్ధం. కానీ ఆమె ఏం అడగదని చెబుతాడు. మరోసారి నా జోలికి, నా కంపెనీ జోలికి, నా కుటుంబం జోలికి రావొద్దని చెక్ మీద రూపాయి పెట్టి వెళ్లిపోతాడు శివన్నారాయణ. ఇంటికి వెళ్లేసరికి కాంచన వచ్చి ఉంటడటంతో రేపు శ్రీధర్ అమెరికా నుంచి రాబోతున్నాడని చెబుతాడు. అలాగే నేను నీకు అన్యాయం చేశావని బాధపడుతున్నావా అని అడుగుతాడు. ఆ మాటలతో కాంచన, కార్తీక్‌లు షాక్ అవుతారు

Advertisement

Photo Courtesy: JioHotstar

జూలై 24వ తేదీ 731వ ఎపిసోడ్‌లో..
శివన్నారాయణ ఇంటికొచ్చి వార్నింగ్ ఇవ్వడంతో మాలినిపై కోప్పడతాడు దక్షిణామూర్తి. కాంచన కుటుంబం పేదరికంలో ఉండటం చూసి తట్టుకోలేక చెక్ ఇచ్చాను, అయినా బాబాయి బలం కుటుంబం, దానిని తగ్గించాల్సిందేనని చెబుతుంది. ఆఫీస్‌లో సూరజ్ తనను అదేపనిగా చూస్తుండటంతో కోప్పడుతుంది జ్యోత్స్న. జ్యోత్స్నకి పారు ఫోన్ చేసి అర్జెంట్‌గా ఒకచోటికి వెళ్లాలని, వచ్చేటప్పుడు ఫోన్ అక్కడే వదిలేసి రమ్మని చెబుతుంది. పారు ఏదో ప్లాన్ చేసినట్లుగా ఉందని అనుకుని ఆమె చెప్పినట్లే చేస్తుంది జ్యోత్స్న. దాంతో ఆమెను మాలిని ఇంటికి తీసుకెళ్తుంది పారు. మాలినిని చూడగానే తాత చెప్పింది మరిచిపోయావా? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావని గ్రానీ మీద ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నీలో మీ తాత లక్షణాలు కానీ, మీ కుటుంబంలో ఎవరి లక్షణాలు కనిపించడం లేదని మాలిని చెప్పడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. జ్యోత్స్న కనిపించకపోవడం, పారు ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో శివన్నారాయణ, కార్తీక్‌లు కంగారుపడతారు

Advertisement

జూలై 25వ తేదీ 732వ ఎపిసోడ్‌లో..
నువ్వు అడిగితే నా ఆస్తిలో సగం ఇస్తానని మాలిని ఆఫర్ ఇవ్వడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. నాకు ఎవరి ప్రేమలు వద్దు అని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. మాలిని ఉంగరం కిందపడిపోవడంతో దానిని తీసుకుని ఇవ్వబోతుండగా పారు మెడనొప్పి తగ్గిపోతుంది. నా మేనకోడలిని నా ఇంటికి తీసుకొచ్చినందుకు నువ్వే ఉంచుకోమని పారుకి చెబుతుంది మాలిని. శ్రీధర్ అమెరికా నుంచి తిరిగి రావడంతో కాంచన చాలా సంతోషించి.. భర్తకు అన్నం పెడుతుంది. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లావని జ్యోత్స్నని కార్తీక్, దీపలు నిలదీస్తారు. ఇంటి దగ్గర కూడా ఇదే పంచాయతీ పెడతాడు పెద్దాయన. పారిజాతం చేతికి మాలిని ఉంగరం చూసి సూరజ్‌కి అనుమానం వస్తుంది. పారు చెబుతున్న దానికి, జ్యోత్స్న చెబుతున్న దానికి పొంతన లేకపోవడంతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.