ఈటీవీలో ప్రసారమైన పటాస్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఫైమా. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించారు. పటాస్‌ నుంచి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోలతో పాటు బిగ్‌బాస్ రియాలిటీ షోకు కంటెస్టెంట్‌గానూ అడుగుపెట్టి.. తన సత్తా చాటారు. మారుమూల గ్రామం, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఫైమా తన ప్రతిభతో సెలబ్రిటీగా ఎదిగారు. ఇటీవలే తన ప్రియుడు ప్రవీణ్‌ను పెళ్లాడిన ఫైమా.. వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఫైమా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

తెలంగాణలోని ఓ గ్రామానికి చెందిన ఫైమా.. తినడానికి తిండి కూడా లేని కుటుంబంలో పుట్టారు. నలుగురు తోబుట్టువుల్లో ఫైమా చిన్నది. పేదరికం కారణంగా వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండేవి కావు.. అక్కాచెల్లెళ్లు వేసుకునే బట్టేలే వేసుకునేది. చదువుకునే రోజుల్లో యాంకర్ రవి, శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న పటాస్ షో చూడటానికి కాలేజీ తరపున హాజరైంది. ఈ సందర్భంగా ఆమె చేసిన అల్లరి తాలూకా వీడియో వైరల్ అయ్యింది. దాంతో పటాస్‌లో స్టాండప్ కమెడియన్‌గా ఫైమాకు అవకాశం దక్కింది.

తన పంచ్‌లు, ప్రాస, వెరైటీ వాయిస్‌తో మొదటి ఎపిసోడ్ నుంచే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఫైమా. కెరీర్ అప్పుడుప్పుడే మొదలవుతున్న దశలో పటాష్ షో అనూహ్యంగా ఆగిపోవడంతో ఫైమా ఇబ్బందులు పడ్డారు. అయితే కొద్దిరోజులకే జబర్దస్త్‌లో లేడీ కమెడియన్‌గా ఆమెకు అవకాశం దక్కింది. అందరు టీమ్ లీడర్స్ వద్ద చేస్తూ పంచ్‌లతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్‌బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్‌గా అనూహ్యంగా ఛాన్స్ అందుకున్న ఫైమా తన ఆటతీరు, వ్యక్తిత్వంతో ప్రేక్షకుల మద్ధతు పొందారు. టాప్ సెలబ్రిటీలను ఎదుర్కొని దాదాపు 13 వారాల పాటు హౌస్‌లో కొనసాగి తెలుగు లోగిళ్లకు మరింత దగ్గరైంది ఫైమా.

Advertisement

ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు ఛానెల్స్‌లో ప్రసారమవుతున్న కార్యక్రమాలు, ప్రైవేట్ ఈవెంట్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఫైమా దీని ద్వారానూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. పటాస్ షోలో తనకు జోడీగా అలరించిన ప్రవీణ్‌తో ఫైమా ప్రేమాయణం సాగిస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మాటలు లేకపోవడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రవీణ్ తనకు మంచి ఫ్రెండ్ అని.. తన బాయ్‌ఫ్రెండ్ పేరు కూడా ప్రవీణ్ కావడంతో ప్రజలు కన్‌ఫ్యూజ్ అయ్యారని ప్రవీణ్ స్పష్టం చేశారు.

Advertisement

9 ఏళ్ల పాటు సాగిన ప్రేమాయణానికి తెరదించుతూ గత నెల 26న ఫైమా- ప్రవీణ్‌లు వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రవీణ్ తాళి కడుతున్న వేళ భావోద్వేగానికి గురై ఎమోషనల్ అయ్యింది. పెళ్లి తర్వాత భర్త ప్రవీణ్‌తో కలిసి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు ఫైమా.

Advertisement

ఇకపోతే.. పెళ్లి తర్వాత కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలలో కొనసాగుతున్నారు ఫైమా. మెడలో తాళిబొట్టు, నుదిటిన సింధూరం ధరించిన ఫైమా ఇటీవల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈవెంట్స్‌కి కూడా అలాగే హాజరవుతున్నారు. పెళ్లి తర్వాత సగటు భారతీయ వివాహితలా తన కట్టు బొట్టు పూర్తిగా మార్చేశారు. ఇటీవల చీర కట్టులో ఫైమా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.