ఈటీవీలో ప్రసారమవుతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో మరోసారి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈసారి షోలో కొత్త హోస్ట్‌గా ప్రదీప్ మాచిరాజు ఎంట్రీ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా కాలంగా ఈ షోకు హోస్ట్‌గా ఉన్న రష్మీ గౌతమ్ స్థానంలో ప్రదీప్ కనిపించడంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement

స్టేజ్‌పైకి వచ్చిన ప్రదీప్ తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇస్తూ.."ఇప్పటి నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి రాజు ప్రదీప్ మాచిరాజు"అంటూ పంచ్ డైలాగ్ చెప్పాడు. దీంతో స్టేజ్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. కొత్త హోస్ట్‌గా ప్రదీప్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఇక హైపర్ ఆది కూడా తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. "లేచిన దగ్గర నుంచి నేనిక్కడ.. ఆయనెక్కడ అంటారు.. వాళ్లిద్దరూ ఇక్కడ"అంటూ రష్మీ, సుధీర్‌లపై ఇన్‌డైరెక్ట్‌గా పంచ్ వేశాడు. దీనికి ప్రదీప్ వెంటనే స్పందిస్తూ.. "ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్లను మ్యాట్నీ షిఫ్ట్‌కు పంపించారు"అంటూ కౌంటర్ ఇచ్చాడు.

Advertisement

ఈ షోలో సీనియర్ హీరోయిన్ మహేశ్వరి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేజ్‌పైకి వచ్చి ప్రదీప్‌ను చూసి.. "నీ నుంచి ఇన్విటేషన్ వచ్చింది.. అది నీ పెళ్లి కార్డు అనుకున్నా.. ఇంతకీ పెళ్లి ఎప్పుడు?" అంటూ ఆటపట్టించారు. ప్రదీప్ సమాధానం చెప్పకుండా టాపిక్ మార్చేయడంతో, ఈ షోలో పెళ్లి సినిమాలో విలన్ లాంటి వ్యక్తి ఉన్నాడు? అంటూ ప్రశ్నించగా.. హైపర్ ఆది మధ్యలో కలగజేసుకుని బిల్డప్ ఇచ్చాడు. వెంటనే మహేశ్వరి "నేను మాట్లాడింది నీ గురించే బాబు" అంటూ ఒక్క డైలాగ్‌తో హైపర్ ఆది గాలి తీసేశారు. దీంతో స్టేజ్ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది.

Advertisement

ఆ తర్వాత యాంకర్ సౌమ్యా రావు ఎంట్రీ ఇచ్చి మరింత సందడి చేశారు. 'నన్ను శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ చేస్తామని చెప్పి దారుణంగా మోసం చేశారు. ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు"అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. వెంటనే ప్రదీప్‌ను చూపిస్తూ "ఈ మెంటల్ నా కొడుకు కూడా అక్కడే మెంటర్"అని ఫన్నీగా అనడంతో అందరూ నవ్వుకున్నారు. అంతటితో ఆగని ప్రదీప్.. "సరే నా గురించి చెప్పారు.. మరి హైపర్ ఆది గురించి ఏమైనా ఉందా?"అని ప్రశ్నించాడు.

Advertisement

దానికి సౌమ్యా.."హైపర్ ఆది గురించి ఫొటోలు అవసరం లేదు.. నా దగ్గర వీడియో ఉంది"అంటూ ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఓ ఏఐ వీడియో ప్లే చేశారు. అందులో హైపర్ ఆది సిక్స్‌ప్యాక్ బాడీతో బీచ్‌లో అమ్మాయిల మధ్య ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించారు. అది చూసిన ఆది "ఏంట్రా ఇది.. అసలు నేనేనా?" అంటూ షాక్ అయినట్లు నటించాడు.

Advertisement

ఇక పక్కనే ఉన్న పైమా.. హైపర్ ఆది బాడీని మరోసారి చూడాలంటూ.. హైపర్ ఆదిని ఆటపట్టించింది. దీంతో స్టేజ్‌పై నవ్వులు పూశాయి. ఈ మొత్తం సన్నివేశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ వారం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎపిసోడ్‌లో ప్రదీప్ మాచిరాజు ఎంట్రీ ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.